Viral Video: దేవుడికి దండం.. హుండీకి కన్నం.. వైరల్‌గా మారిన దొంగతనం..
దొంగలు ఈ మధ్య ముదిరిపోతున్నారు. ఇంతకు ముందు తాళం వేసిన ఇళ్లకే కన్నాలు వేసే కేటుగాళ్లు.. ఇప్పుడు దేవుడి గుడిని కూడా వదలడం లేదు.

ఇటీవల కాలంలో దొపిడీ దొంగల బీభత్సం ఎక్కువైంది..బడి, గుడి, ఇళ్లు, షాపులు, బ్యాంకులు..ఏదైనా సరే కన్ను పడిదా..? కన్నం వేయాల్సిందే..! అన్నచందంగా దొంగలు రెచ్చిపోతున్నారు. తాజాగా ఓ హనుమాన్ గుడిలో దొంగ భక్తుడి చోరకళ అక్కడి సీసీ కెమెరాలో రికార్డైంది..ఆ వీడియో కాస్త నెట్‌లో చేరటంతో ఇప్పుడది కాస్త వైరల్ అవుతోంది..
ఇక్కడ ఓ దొంగ భక్తుడు ఎవరూ లేని సమయంలో గుడిలోకి ప్రవేశించాడు. చుట్టూ చూశాడు.. ఎవరూ లేరు.. హమ్మయ్యా అనుకున్నాడు. కానీ, ఎదురుగా దేవుడు చూస్తూనే ఉన్నాడని మనోడు కాస్త కంగురుపడ్డాడు.. ఆ వెంటనే..ఆ హనుమంతుడి కాళ్లు మొక్కాడు. తన పనికి ఆటంకం కలిగించవద్దని మొక్కుకున్నాడేమో బాహుషా…ఇక ఆ తర్వాత తన పనికానిచ్చేశాడు.. స్వామివారి ముందు ఉన్న హుండీని చేత పట్టుకుని నేరుగా పరిగెత్తాడు..ఇదంతా గుడిలో ఉన్న సీసీటీవీలో రికార్డ్ అయింది. సీసీటీవీని పట్టించుకోలేదు.. కానీ.. ఆ దేవుడికి క్షమాపణలు చెప్పి మరీ దొంగతనం చేశాడు కేటుగాడు. కానీ, పాపం..కానీ, ఇతగాడి విన్నపాలు నేలపాలయ్యాయి. ఎందుకంటే పోలీసులు ఆ దొంగ కూపీని లాగి పట్టేసుకున్నారు. దొంగిలించిన మొత్తాన్ని కక్కించారు. సీసీటీవీలో రికార్డ్ అయిన చోరీ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఈ ఘటన మహారాష్ట్రలోని థానేలో జరిగినట్లుగా తెలిసింది. థానెలో ఖోపాట్ ఏరియాలో గల హనుమంతుడి ఆలయంలో హనుమంతుడి విగ్రహం ముందున్న హుండీపై ఆ దొంగ కన్ను పడింది. నవంబర్ 9వ తేదీ రాత్రి ఈ దొంగతనం జరిగినట్లు పోలీసులు తేల్చారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు..ఎట్టకేలకు నిందితుడిని పట్టుకుని చోరీ సొత్తు రికవరీ చేసినట్లు తెలిసింది.
మరిన్ని ఇక్కడ చదవండి :
