India Covid-19: దేశంలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు.. తాజాగా ఎన్ని నమోదయ్యాయంటే..?

Coronavirus Updates In India: దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతోంది. ఒకప్పుడు లక్షల్లో నమోదైన కేసులు కాస్త.. ప్రస్తుతం 50వేలకు

India Covid-19: దేశంలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు.. తాజాగా ఎన్ని నమోదయ్యాయంటే..?
Coronavirus India
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jul 14, 2021 | 10:32 AM

Coronavirus Updates In India: దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతోంది. ఒకప్పుడు లక్షల్లో నమోదైన కేసులు కాస్త.. ప్రస్తుతం 50వేలకు దిగువన కేసులు నమోదవుతున్నాయి. కాగా సోమవారంతో పోల్చుకుంటే.. కరోనా కేసులు మరలా పెరిగాయి. దేశవ్యాప్తంగా గత 24 గంటల వ్యవధిలో (మంగళవారం) 38,792 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతోపాటు ఈ మహమ్మారి కారణంగా.. 624 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ బుధవారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. తాజాగా నమోదైన గణాంకాలతో.. దేశంలో మొత్తం కేసుల సంఖ్య 3,09,46,074 కి చేరగా.. మరణాల సంఖ్య 4,11,408 కి పెరిగింది.

కాగా నిన్న కరోనా నుంచి 41,000 మంది బాధితులు కోలుకున్నారు. వీరితో కలిపి కోలుకున్న వారిసంఖ్య మొత్తం 3,01,04,720కి పెరిగింది. ప్రస్తుతం దేశంలో 4,29,946 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. నిన్న దేశవ్యాప్తంగా 19,15,501 కరోనా నిర్ధారణ పరీక్షలు చేసినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్ వెల్లడించింది. వీటితో కలిపి ఇప్పటి వరకూ 43,59,73,639 నిర్ధరాణ పరీక్షలు చేసినట్లు ఐసీఎంఆర్ తెలిపింది.

ఇదిలాఉంటే.. దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. నిన్న దేశవ్యాప్తంగా 37,14,441 వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేసినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ డోసులతో కలిపి ఇప్పటివరకూ 38,76,97,935 వ్యాక్సిన్ డోసులను లబ్ధిదారులకు పంపిణీ చేసినట్లు పేర్కొంది.

Also Read:

తాలిబన్లతో చర్చలు విఫలమైతే మేం భారత సైన్యం సాయాన్ని కోరవచ్చు..ఆఫ్ఘనిస్తాన్ రాయబారి

Markets Closed: కరోనా నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలే.. మరో రెండు మార్కెట్ల మూసివేసిన కేజ్రీవాల్ సర్కార్

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!