జమ్మూలో డ్రోన్ దాడులు..పాకిస్తాన్ కు భారత్ తీవ్ర నిరసన.. శాంతి, సుస్ధిరతలే ప్రధాన అజెండా
జమ్మూ ప్రాంతంలో పాకిస్తాన్ డ్రోన్ దాడులకు తెగబడుతుండడంపై ఆ దేశానికి ఇండియా తీవ్ర నిరసన తెలిపింది. బోర్డర్ సెక్యూరిటీకి, పాకిస్థాన్ రేంజర్లకు మధ్య నిన్న జరిగిన సమావేశంలో భారత అధికారులు తమ ప్రొటెస్ట్ ను పాక్ రేంజర్లకు తెలిపారు.
జమ్మూ ప్రాంతంలో పాకిస్తాన్ డ్రోన్ దాడులకు తెగబడుతుండడంపై ఆ దేశానికి ఇండియా తీవ్ర నిరసన తెలిపింది. బోర్డర్ సెక్యూరిటీకి, పాకిస్థాన్ రేంజర్లకు మధ్య నిన్న జరిగిన సమావేశంలో భారత అధికారులు తమ ప్రొటెస్ట్ ను పాక్ రేంజర్లకు తెలిపారు. కమాండర్ స్థాయి సమేవేశమిదని, ఇందులో పలు అంశాలను తాము పాక్ దృష్టికి తెచ్చామని అధికారులు వెల్లడించారు. ఉభయ దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన తరువాత జరిగిన మొట్ట మొదటి మీటింగ్ ఇది. సుభేద్ ఘర్ ఏరియాలో అంతర్జాతీయ సరిహద్దు వద్ద పాక్ రేంజర్ల అభ్యర్తనపై ఈ మీటింగ్ జరిగింది. ఆపరేషన్ కార్యకలాపాల పరిష్కారానికి అవసరమైనప్పుడలా రెండు దేశాల ఫీల్డ్ కమాండర్లు భేటీ కావాలని ఇందులో నిర్ణయించారు. జమ్మూలో వరుసగా డ్రోన్లు ఎగురుతుండడం, గత నెలలో భారత వైమానిక బేస్ పై డ్రోన్ దాడి అంశాన్ని పాక్ అధికారుల దృష్టికి భారత కమాండర్లు తెచ్చారు.
సరిహద్దుల్లో ఉగ్రవాదులు టనెల్స్ తవ్వుతున్నారని, రహస్యంగా స్థానికులను ప్రేరేపిస్తున్నారని, ఉగ్రవాద కార్యకలాపాల వైపు వారిని ప్రోత్సహిస్తున్నారని కూడా అధికారులు పేర్కొన్నట్టు తెలిసింది. లష్కరే తోయిబా, జైషే మహ్మద్ వంటి ఉగ్రవాద సంస్థలు డ్రోన్లను వినియోగిస్తుండడాన్ని ఇండియా తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. కాగా ఉభయ దేశాల కమాండర్ల మధ్య ఈ చర్చలు సుహృద్భావ పూరితంగా, స్నేహ వాతావరణంలో జరిగినట్టు అధికారులు వెల్లడించారు.సరిహద్దుల్లో శాంతి నెలకొనేలా చూడాలని ఈ సమావేశంలో నిర్ణయించారు.ఇక డ్రోన్లు జమ్మూలో ఎగరకుండా చూస్తామని పాక్ అధికారులు మాత్రం గట్టిగా హామీనివ్వకపోవడం విశేషం. ఇంత జరిగినా ఆదివారం ఓ టెర్రరిస్టు జమ్మూ కాశ్మీర్ లో భద్రతా దళాల కాల్పుల్లో హతమయ్యాడు.
మరిన్ని ఇక్కడ చూడండి : రెండు డోసులతోనే డెల్టా కు చెక్..!రానున్న మరో ప్రమాదకరమైన మూడు వేరియంట్లు..:Control Delta with two doses Video.