India Post: సూపర్ ఫాస్ట్ డెలివరీ.. ఇకపై దేశంలో ఎక్కడికైనా.. కేవలం 24 గంటల్లోనే
దేశంలో పోస్టల్ సేవలు మరింత వేగవంతం కానున్నాయి. భారత తపాలా శాఖ తన సేవలను మరింత వేగంవంతం చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే ప్రైవేటు కొరియర్ సర్వీస్‌లకు దీటుగా 24 గంటల్లో దేశంలోని ఎక్కడికైనా పార్శిళ్లను చేరవేసే సరి కొత్త విధానాన్ని తీసుకురానుంది. ఈ విషయాన్ని స్వయంగా కేంద్ర టెలికాం శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు.

దేశంలో పోస్టల్ సేవలు మరింత వేగవంతం కానున్నాయి. భారత తపాలా శాఖ తన సేవలను మరింత వేగంవంతం చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే కేవలం 24 గంటల్ దేశంలోని ఏ ప్రాంతానికైనా పార్శిళ్లను డెలివరీ చేసే సరికొత్త కొత్త విధానాన్ని తీసుకురానుంది.వచ్చే ఏడాది జనవరి వరకు ఈ సూపర్ ఫాస్ట్ డెలివరీ సేవలను దేశవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకురానున్న శుక్రవారం కేంద్ర టెలికాం శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు.
కేంద్ర కమ్యూనికేషన్ల మంత్రి జ్యోతిరాదిత్య సింధియా శుక్రవారం మాట్లాడుతూ.. ఇండియన్ పోస్టల్ ద్వారా దేశంలోని అన్ని ప్రధాన నగరాలు, రాష్ట్ర రాజధానుల్లో కూడా 24, 48 గంటల్లో గ్యారెంటీ డెలివరీ సేవలను ప్రారంభిస్తామని తెలిపారు. ఇందులో భాగంగా 24 గంటల్లోపు మెయిల్స్ డెలివరీ అయ్యేలా 24 గంటల స్పీడ్ పోస్ట్ సర్వీస్ ఉంటుంది. అదేవిధంగా, 48 గంటల్లోపు డెలివరీ కోసం 48 గంటల స్పీడ్ పోస్ట్ ఉంటుంది అని సింధియా చెప్పారు. దానితో పాటు ప్రముఖ ఈ ప్రైవేట్ కామర్స్ సంస్థలైన అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సంస్థలతో కలిసి పనిచేయనున్నట్లు తెలిపారు.




