India Post: ఇండియా పోస్టల్ సేవలపై ఎన్ని లక్షల ఫిర్యాదులు వచ్చాయో తెలిస్తే షాకే..
India Postal Service: ఆధునిక ప్రపంచ అరచేతుల్లో నుంచే మారుతోంది. ప్రతిదీ డిజిటల్ కావడంతో దాదాపు అందరూ.. సమాచారం, ఫిర్యాదులు,
India Postal Service: ఆధునిక ప్రపంచ అరచేతుల్లో నుంచే మారుతోంది. ప్రతిదీ డిజిటల్ కావడంతో దాదాపు అందరూ.. సమాచారం, ఫిర్యాదులు, పేమెంట్లు ఇలా అన్నీ ఫోన్ ద్వారానే వేరే వారికి చేరవేస్తున్నారు. ఇలాంటి తక్షణ సమాచార ప్రసార యుగంలో కూడా.. భారతీయ పోస్టల్ విభాగం సేవలు నేటికీ లాక్షలాది మందికి అందుతున్నాయి. చాలామంది పలు వస్తువులను, సమాచారాన్ని ఇంకా పోస్ట్ ఆఫిస్‌ల ద్వారానే చేరవేస్తున్నారు. అయితే.. డెలివరీలో ఇబ్బందులు, ఆలస్యం, ఇతర లోపాల కారణంగా తపాలా శాఖకు సంవత్సరానికి సగటున 24 లక్షల ఫిర్యాదులు వస్తాయని గణాంకాలు పేర్కొంటున్నారు. ఈ ఫిర్యాదుల్లో చాలావరకు పరిష్కారమవుతాయని.. కొన్ని పరిష్కారం కావని పేర్కొంటున్నారు.
ప్రపంచంలోనే అతిపెద్ద పోస్టల్ నెట్‌వర్క్.. ఒక్క ఇండియా పోస్టల్ విభాగానికే ఉంది. దేశవ్యాప్తంగా దాదాపు 1.57 లక్షల పోస్టాఫీసులు ఉన్నాయి, వాటిలో 90% గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి. మిగిలిన 10% పట్టణ ప్రాంతాల్లో ఉన్నాయి. భారతదేశంలో పోస్టల్ నెట్‌వర్క్ 1727నే ప్రారంభమైనప్పటికీ.. 1854 ఇండియన్ పోస్ట్ ఆఫీస్ చట్టం పునఃప్రారంభమైంది. ఈచట్టం ఆధునిక తపాలా వ్యవస్థకు పునాది వేసింది. కమ్యూనికేషన్‌ను చేరవేసే చౌకైన సేవల్లో పోస్టల్ సేవ ఒకటి. పోస్టల్ వ్యాసాల పంపిణీతో పాటు, ఈ విభాగం ఆర్థిక, భీమా సేవలను కూడా అందిస్తూ.. సామాజిక-ఆర్థిక అభివృద్ధికి దోహదపడుతుంది.
ఇండియా పోస్ట్ ఆఫిస్ నెట్‌వర్క్‌లో దేశీయ, అంతర్జాతీయ సేవలతో సహా మొత్తం 26 మెయిల్ సేవలు ఉన్నాయి. ఇంత పెద్ద నెట్‌వర్క్‌లో.. ఎక్కువ సేవలు ఉండటం వలన.. ఆలస్యం, వస్తువులను పంపిణీ చేయకపోవడం, సమాధానం లభించకపోవడం తదితర ఫిర్యాదులు వస్తున్నాయి. అయితే ఏడాది కాలంలోనే దాదాపు 24లక్షల ఫిర్యాదులు వచ్చాయని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. మూడేళ్ల నుంచి ఆరు విభాగాలలోనే ఈ సంఖ్య అధికమని పేర్కొంటున్నాయి.
ఇతర సేవల మాదిరిగానే.. పోస్టల్ సేవల్లో కూడా ఆలస్యంగా డెలివరీ, డెలివరీ చేయకపోవడం, వారే వారికి డెలివరీ, వస్తువుల నష్టం వంటి సేవల్లో లోపాలు ఉంటాయి. ఇటువంటి లోపాలను తపాలా శాఖ దృష్టికి తీసుకువచ్చే హక్కుంది. ఈ మేరకు వినియోగదారులు స్వయంగా ఫిర్యాదు చేయవచ్చు. దీనికి రసీదును కూడా అందిస్తారు. స్థానిక పోస్ట్ ఆఫిస్ లో లేదా.. ఆన్‌లైన్‌లో ‘ఇండియా పోస్ట్’ వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేయాలి. ఒక వేళ సమస్య అక్కడ పరిష్కారం కాకపోతే.. సంబంధిత సర్కిల్ చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ వద్దకు వెళ్లాలి. అక్కడ ఊడా కాకపోతే.. న్యూఢిల్లీలోని పోస్టల్ డైరెక్టరేట్‌లోని అధికారులను సంప్రదించవచ్చు. దీనికోసం ప్రత్యేకంగా నోడల్ అధికారులను నియమించారు. ఫిర్యాదు చేసినప్పటి నుంచి రెండు నెలల్లో పరిష్కారమవుతుంది.
Also Read: