TN Elections 2021: మార్కెట్లో మామిడి పళ్లు విక్రయిస్తూ…అభ్యర్థి వినూత్న ఎన్నికల ప్రచారం
Tamil Nadu Election 2021: తమిళనాడులోని మొత్తం 234 అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతలో ఏప్రిల్ 6న పోలింగ్ జరగనుంది. మే 2న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.
తమిళనాట అసెంబ్లీ ఎన్నికల ప్రచార ఘట్టం రసవత్తరంగా సాగుతోంది. పోలింగ్ తేదీ(ఏప్రిల్ 6) దగ్గరపడుతుండటంతో ఓటరు దేవుళ్లను ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులు వినూత్న రీతిలో ప్రచారం నిర్వహిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో అభ్యర్థుల ఫీట్స్‌కు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇప్పటికే సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. ఎన్నికల ప్రచారంలో ప్రజలను ఆకర్షించేందుకు ఓ అభ్యర్థి మార్కెట్లో మామిడి పళ్లు విక్రయిస్తూ ప్రచారం నిర్వహించారు. ఇంతకీ ఆయన ఈ పంథాను ఎంచుకోవడానికి బలమైన కారణం లేకపోలేదు. మామిడి పండు ఆయన ఎన్నికల చిహ్నం కావడమే అందుకు కారణం. పీఎంకే అభ్యర్థి కసాలి చెన్నైలోని చేపాక్ నియోజకవర్గంలో డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ తనయుడు ఉదయనిధి స్టాలిన్‌ను ఢీకొంటున్నారు. ట్రిప్లికేన్ మార్కెట్‌లో మామిడి పళ్లను విక్రయిస్తూ ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ(పీఎంకే) చిహ్నమైన మామిడి పండుకు ఓటు వేసి తనను గెలిపించాలని ఆయన ఓటర్లను కోరారు.
గతంలో ఎన్నడూ ఉదయనిధి స్టాలిన్ చేపాక్ నియోజకవర్గం వైపు కన్నెత్తి కూడా చూడలేదని…ఇప్పుడు ఆయన అక్కడి నుంచి పోటీచేయడం విడ్డూరంగా ఉందని కసాలి ఎద్దేవా చేశారు. నియోజకవర్గ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఉదయనిధికి ఎలాంటి అవగాహన లేదని చెప్పుకొచ్చారు. ఉదయనిధి స్టాలిన్ జీవితం వడ్డించిన విస్తరిగా పేర్కొన్న ఆయన..పేదల కష్టాలను ఆయన అర్థం చేసుకోలేరని అన్నారు. స్థానిక ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండే తననే నియోజకవర్గ ప్రజలు గెలిపిస్తారని ధీమా వ్యక్తంచేశారు. ఉదయనిధి తనకంటే చిన్నవాడని, ఆయనకు రాజకీయ అనుభవం లేదన్నారు. ఎన్నికల్లో తనకు గట్టిపోటీ ఇస్తాడని భావించడం లేదన్నారు. ఉదయనిధి సినిమాలు కూడా డబ్బు కోసమే చేశారని…సినిమాలతో వచ్చిన ఆదాయాన్ని ప్రజల కోసం ఖర్చు చేస్తున్నారా? అంటూ ఎద్దేవా చేశారు.
Chennai: AVA Kasali, Pattali Makkal Katchi, contesting against DMK’s Udhayanidhi Stalin from Chepauk, campaigns in Triplicane Market area by selling mangoes-his party’s election symbol
“He (Stalin) isn’t bothered to campaign in the constituency. I’m sure I’ll win,” he says pic.twitter.com/J7kBggxcas
— ANI (@ANI) March 27, 2021
తమిళనాడులోని మొత్తం 234 అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతలో ఏప్రిల్ 6న పోలింగ్ జరగనుంది. మే 2న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. అధికార అన్నాడీఎంకే-బీజేపీ కూటమితో కలిసి పీఎంకే ఎన్నికల బరిలో నిలుస్తోంది.
ఇవి కూడా చదవండి: తేయాకు ఆకులు పెరగకుండానే ఎలా కోస్తారు.. అంతా ఉత్తుత్తి… ఫోటో సెషన్ కోసమే.. ప్రియాంకపై షా సెటైర్లు
ఓటర్లలో హెచ్చు తగ్గులు, పని చేయని ఎలెక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లు, తృణమూల్ కాంగ్రెస్ ఆరోపణ