Covid Third Wave: థర్డ్ కోవిడ్ వేవ్ ఎప్పుడో చెప్పిన ఎయిమ్స్ డైరెక్టర్ డా. రణదీప్ గులేరియా
దేశంలో థర్డ్ కోవిడ్ వేవ్ వచ్చే సెప్టెంబరు లేదా అక్టోబరులో తలెత్తే అవకాశం ఉందని ఢిల్లీలోని ఎయిమ్స్ డైరెక్టర్ డా. రణదీప్ గులేరియా తెలిపారు. సెకండ్ వేవ్ తో పోలిస్తే ఇది మరీ అంత తీవ్రంగా ఉండకపోవచ్చునని ఆయన అన్నారు.
దేశంలో థర్డ్ కోవిడ్ వేవ్ వచ్చే సెప్టెంబరు లేదా అక్టోబరులో తలెత్తే అవకాశం ఉందని ఢిల్లీలోని ఎయిమ్స్ డైరెక్టర్ డా. రణదీప్ గులేరియా తెలిపారు. సెకండ్ వేవ్ తో పోలిస్తే ఇది మరీ అంత తీవ్రంగా ఉండకపోవచ్చునని ఆయన అన్నారు.ఐసీఎంఆర్ నాలుగో జాతీయ కోవిడ్ సీరో సర్వేలో ఈ విషయం బయట పడిందని, ఆరేళ్ల వయస్సుకు మించి పిల్లలు, యువకులు, ఇతర వయస్సులవారిలో సార్స్-కొవ్-2 యాంటీబాడీలు ఉన్నాయని ఆ సర్వేలో వెల్లడైందని ఆయన చెప్పారు.పైగా దేశంలో వ్యాక్సినేషన్ డ్రైవ్ కూడా పెద్ద ఎత్తున సాగుతోందన్నారు. ఇండియాలో చాలా రాష్ట్రాలు ఆంక్షలను ఎత్తివేస్తున్న కారణంగా ప్రజలు కోవిడ్ ప్రొటొకాల్స్ ని పట్టించుకోవడం లేదని ఆయన విచారం వ్యక్తం చేశారు.ఇప్పటికీ మాస్కులు, ధరించడం, భౌతిక దూరం పాటించడం తప్పనిసరి అని గులేరియా సూచించారు.
థర్డ్ వేవ్ లో పిల్లలపై దీని ప్రభావం అంతగా ఉండదని ఆయన అభిప్రాయపడ్డారు. కోవిడ్ తొలి, రెండో దశల్లో వీరికి స్వల్ప లక్షణాలు మాత్రమే సోకాయని ఆయన వెల్లడించారు. బాలల్లో 50 నుంచి 60 శాతం యాంటీ బాడీలు పెరిగాయని తాజా అధ్యయనంలో తేలినట్టు ఆయన పేర్కొన్నారు. వీరికి కొవాగ్జిన్, జైడస్ క్యాడిలా టీకామందులు బాగా పని చేస్తాయన్నారు. జైడస్ క్యాడిలా టీకామందు సెప్టెంబరు నుంచి అందుబాటులోకి వస్తుందని రణదీప్ గులేరియా ప్రకటించారు. తలిదండ్రులు తప్పనిసరిగా వారికి వ్యాక్సిన్ ఇప్పించాలని ఆయన సూచించారు. వ్యాధి నిరోధక శక్తి ఉన్నప్పటికీ వ్యాక్సినేషన్ అనివార్యమని ఆయన అభిప్రాయపడ్డారు. మొదట ఆగస్టు మాసాంతానికి థర్డ్ వేవ్ రావచ్చునని ప్రకటించిన నిపుణులు ప్రస్తుతం దీన్ని కొద్దిగా సవరిస్తున్నాడు.
మరిన్ని ఇక్కడ చూడండి: Vimala Raman: టాలీవుడ్ మాజీ హీరోయిన్ విమలా రామన్ లేటెస్ట్ ఫోటో గ్యాలెరీ…
తక్కువ ఖర్చుతో దేశాలకు వెళ్లాలనుకుంటున్నారా ? అయితే ఈ అందమైన యూరోపియన్ దేశాలకు వెళ్లోచ్చు..