- Telugu News Photo Gallery World photos These are europe travel cheapest european countries to visit from india
తక్కువ ఖర్చుతో దేశాలకు వెళ్లాలనుకుంటున్నారా ? అయితే ఈ అందమైన యూరోపియన్ దేశాలకు వెళ్లోచ్చు..
చాలా మందికి తమకు నచ్చిన దేశానికి.. ప్రాంతానికి వెళ్లాలనుకుంటారు. కానీ ఆర్థికంగా వెనకడగు వేస్తారు. అయితే తక్కువ ఖర్చులో కొన్ని దేశాలను చుట్టి రావచ్చు. ఎక్కడెక్కడున్నాయో తెలుసుకుందామా.
Updated on: Jul 23, 2021 | 12:58 PM

ఐరోపా దేశాలను చుట్టేయాలని భారతదేశంలోని చాలా మంది ప్రజలు అనుకుంటుంటారు. అయితే యూరోపియన్ దేశాలకు వెళ్లాలంటే అధికమొత్తంలో డబ్బులు కావాల్సి వస్తుంది. కానీ తక్కువ బడ్జెట్‌లో కూడా వెళ్లే యూరోపియన్ దేశాలు కూడా ఉన్నాయి.

రొమేనియా మధ్య, తూర్పు, ఆగ్నేయ ఐరోపా నడిబొడ్డున ఉంది. ఇక్కడ మంత్రముగ్దులను చేసే దృశ్యాలు, రాతి శిఖరాలు నుండి మధ్యయుగ గ్రామాలు వరకు రొమేనియా పర్యాటకులు ఆకర్షిస్తాయి. యూరప్ సాంస్కృతిక వారసత్వం గురించి తెలుసుకోవచ్చు.

ఐరోపాలో ఉన్న పోలాండ్ కూడా ప్రజల బడ్జెట్‌లో ఉంది. వార్సా పోలాండ్ రాజధాని దేశంలో అతిపెద్ద నగరం. ఈ నగరం తూర్పు-మధ్య పోలాండ్‌లోని విస్తులా నదిపై ఉంది. పోలాండ్‌లోని చౌక రెస్టారెంట్లు, నగరానికి, ప్రయాణానికి తక్కువ ఖర్చుతో ఈ ప్రాంతం బెటర్.

గ్రీస్ రాజధాని, ఏథెన్స్ దేశంలో అతిపెద్ద నగరం. ప్రపంచంలోని పురాతన నగరాల్లో ఏథెన్స్ ఒకటి. దీని చరిత్ర 3400 సంవత్సరాల నాటిది. ఏథెన్స్ ఐరోపాలోని ప్రసిద్ధ నగరాలలో ఒకటి. ఈ నగరం సంస్కృతి, రుకైన వీధులతో దేవతల భూమిగా పిలువబడుతుంది.

లాట్వియా ఉత్తర ఐరోపాలోని బాల్టిక్ ప్రాంతంలో ఉన్న దేశం. లాట్వియా జనాభా 19 లక్షలు. ఈ దేశం ఇటలీ, ఫ్రాన్స్ వంటి చాలా ప్రాచుర్యం పొందిన ప్రాంతం కాదు. కానీ ఇది ఇతర యూరోపియన్ దేశాల కంటే చాలా తక్కువ బడ్జెట్ కలిగినది. హోటళ్ల నుండి రెస్టారెంట్లు వరకు ఇక్కడ చాలా విషయాలు చాలా చౌకగా ఉంటాయి.

క్రొయేషియా అడ్రియాటిక్ సముద్రంలో ఉన్న దేశం. ఇది మధ్య, ఆగ్నేయ ఐరోపా కూడలిలో ఉంది. ఈ దేశంలో బీచ్‌లకు, మధ్యయుగ సంస్కృతికి ప్రసిద్ధి చెందింది. ఇది ఐరోపాలో చౌకైన ప్రదేశం, రవాణా, వసతి, రెస్టారెంట్లు చాలా చౌకగా ఉన్నాయి.

బల్గేరియా ఆగ్నేయ యూరోపియన్ దేశం. తూర్పు వైపు నల్ల సముద్రం ఉంది. సోఫియా దేశ రాజధాని..అతిపెద్ద నగరం. బడ్జెట్ ప్రయాణికులకు బల్గేరియా ఉత్తమమైన ప్రదేశం. ఇక్కడ చౌకైన వసతులు ఉన్నాయి. ఇక్కడ సహజమైన బీచ్‌లు , ఎండ పర్వత శిఖరాలకు ప్రసిద్ధి చెందింది.

యూరోపియన్ దేశాలు




