India-China Border Row: దేనికైనా సిద్ధంగా ఉన్నాం.. చైనా కవ్వింపులపై కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాధ్ కీలక ప్రకటన
India-China Border Clash: భారత్ చైనా సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం నెలకొంది. అరుణాచల్ ప్రదేశ్‌లోని తూర్పుకొండల్లో డిసెంబర్ 9న భారత, చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణ కలకలం రేపింది. భారత భూభాగంలోకి వచ్చిన పీఎల్ఏ సైనికులను భారత సైన్యం అడ్డుకుంది.
India-China Border Clash: భారత్ చైనా సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం నెలకొంది. అరుణాచల్ ప్రదేశ్‌లోని తూర్పుకొండల్లో డిసెంబర్ 9న భారత, చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణ కలకలం రేపింది. భారత భూభాగంలోకి వచ్చిన పీఎల్ఏ సైనికులను భారత సైన్యం అడ్డుకుంది. ఈ ఘర్షణలో ఇరు దేశాల సైనికులకు గాయాలైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తవాంగ్ సెక్టార్‌లో భారత్, చైనా సైనికుల ఘర్షణ ఘటనపై లోక్‌సభలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాధ్ సింగ్ కీలక ప్రకటన చేశారు. డిసెంబరు 9న అరుణాచల్‌ప్రదేశ్‌లోని తవాంగ్ సెక్టార్‌లో..వాస్తవాధీన రేఖ దగ్గర భారత్, చైనా సైనికుల మధ్య ఘర్షణ జరిగినట్లు తెలిపారు. తవాంగ్ సెక్టార్‌లోని యాంగ్ట్సే ప్రాంతంలో PLA దళాలు చొరబడటానికి ప్రయత్నించాయ్నారు. ఈ ప్రయత్నాన్ని భారత దళాలు అడ్డుకున్నాయని పేర్కొన్నారు. PLA మన భూభాగంలోకి చొరబడకుండా దళాలు ధైర్యంగా ఆపివేసి, వారి పోస్ట్‌కి తిరిగి వెళ్లవలసిందిగా గట్టి హెచ్చరికలు చేశారని తెలిపారు. ఈ క్రమంలో ఘర్షణ జరిగినట్లు తెలిపారు.
ఈ విషయాన్ని దౌత్య మార్గాల ద్వారా చైనాకు కూడా తీసుకెళ్లినట్లు వివరించారు. మన దేశ సరిహద్దులను కాపాడేందుకు బలగాలు కట్టుబడి ఉన్నాయని, సవాలు చేసే ఏ ప్రయత్నాన్నైనా అడ్డుకోవడానికి సిద్ధంగా ఉన్నామని లోక్‌సభలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు.
ఈ సంఘటన తర్వాత డిసెంబర్ 11న ఏరియా స్థానిక కమాండర్, చైనీస్ కౌంటర్‌తో ఫ్లాగ్ మీటింగ్ నిర్వహించి, ఈ సంఘటన గురించి చర్చించారన్నారు. అటువంటి చర్యలన్నింటినీ నిరోధించి.. సరిహద్దు వద్ద శాంతిని కొనసాగించాలని చర్చించారని తెలిపారు.
ఈ ఘటనలో ఇరువైపులా కొంతమంది సైనికులు గాయపడ్డారన్నారు. మన సైనికులు ఎవరూ చనిపోలేదని లేదా తీవ్ర గాయాలు కూడా కాలేదని సభకు తెలియజేశారు. భారత సైనిక కమాండర్ల సకాలంలో జోక్యం కారణంగా, PLA సైనికులు తమ సొంత స్థానాలకు వెనుదిరిగారంటూ వెల్లడించారు.
లోక్ సభలో కేంద్ర మంత్రి రాజ్‌నాధ్ సింగ్ ప్రకటన..
On Dec 9 in Yangtse area of Tawang sector PLA troops encroached upon & attempted to change status quo.This attempt was tackled by our troops in a determined manner. Our troops bravely stopped PLA from encroaching upon our territory&forced them to go back to their post:Defence Min pic.twitter.com/dbwNzSbZj5
— ANI (@ANI) December 13, 2022
మరిన్ని జాతీయ వార్తల కోసం..