AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maharashtra: సహోద్యోగి పై దారుణం.. ప్రైవేటు పార్టులో ఎయిర్ ప్రెజర్ పంప్ తో.. చివరకు..

మహారాష్ట్రలోని ధూలే జిల్లాలో హృదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది. తనతో కలిసి పనిచేసే కార్మికుడి పట్ల ఓ వ్యక్తి దారుణంగా ప్రవర్తించాడు. అతని ప్రైవేట్ పార్ట్‌లో ఎయిర్ ప్రెజర్ పంపును చొప్పించి....

Maharashtra: సహోద్యోగి పై దారుణం.. ప్రైవేటు పార్టులో ఎయిర్ ప్రెజర్ పంప్ తో.. చివరకు..
Murder
Ganesh Mudavath
|

Updated on: Dec 13, 2022 | 12:22 PM

Share

మహారాష్ట్రలోని ధూలే జిల్లాలో హృదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది. తనతో కలిసి పనిచేసే కార్మికుడి పట్ల ఓ వ్యక్తి దారుణంగా ప్రవర్తించాడు. అతని ప్రైవేట్ పార్ట్‌లో ఎయిర్ ప్రెజర్ పంపును చొప్పించి.. అమానుషంగా హత్య చేశాడు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నిజాంపూర్‌లో ఆదివారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది. మృతుడిని తుషార్ సదాశివ్ నికుంభ్ (20) అనే కాంట్రాక్టు కార్మికుడిగా గుర్తించారు. నికుంభ్ పనిచేసిన కంపెనీ ఇంటిగ్రేటెడ్ ఇంజనీరింగ్ సేవలను అందిస్తోంది. కంపెనీ ఉద్యోగులు తమ దుస్తులకు అంటుకున్న దుమ్మును తొలగించడానికి ఎయిర్ ప్రెజర్ పంపులను ఉపయోగిస్తుంటారు. ఈ క్రమంలో పని విరామ సమయంలో ఎయిర్ ప్రెషర్ పంపుతో దుమ్మును తొలగిస్తున్న సమయంలో నికుంభ్‌ కు, నిందితుడి మధ్య వాగ్వాదం జరిగింది. మాటా మాటా పెరిగి తీవ్ర వివాదానికి దారి తీసింది. ఈ క్రమంలో నిందితుడు కోపం ఆపుకోలేకపోయాడు. ఎయిర్ ప్రెషర్ పంపును నికుంభ్ ప్రైవేటు పార్టులో చొప్పించాడు. ఎయిర్ కంప్రెసర్ బటన్ నొక్కడంతో గాలి అతని శరీరంలోకి ప్రవేశించింది. దీంతో నికుంభ్ అంతర్గత అవయవాలు తీవ్రంగా దెబ్బతిని ప్రాణాపాయ స్థితికి చేరుకున్నాడు.

నికుంభ్‌ను మొదట నందుర్‌బార్‌లోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరిస్థితి విషమించడంతో గుజరాత్‌లోని సూరత్‌కు తీసుకెళ్లారు. అయితే.. అంతర్గత గాయాలు తీవ్రం కావడంతో అతను మరణించాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. తదుపరి విచారణను ముమ్మరం చేశారు. అంతే కాకుండా కంపెనీ అధికారుల నుంచి సమాచారం సేకరిస్తున్నారు. ఈ ఘటనపై కంపెనీ అధికారులతో మాట్లాడినట్లు పోలీసు అధికారులు తెలిపారు. ఘటనా స్థలంలో ఉన్న వ్యక్తుల వివరాలను కూడా ఆరా తీస్తున్నారు.

మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించేందుకు పోలీసులు కసరత్తు చేస్తున్నారు. దీంతో పాటు తుషార్ సదాశివ్ నికుంభ్ కుటుంబ సభ్యులకు కూడా సమాచారం అందించారు. మరోవైపు ఈ విషయం తెలిసిన వెంటనే కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. నికుంభ్ ఈ లోకంలో లేడని కుటుంబ సభ్యులు నమ్మలేకపోతున్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం

పిల్లలకు చెవి నొప్పి వస్తే.. నూనె వేసే అలవాటు మీకూ ఉందా?
పిల్లలకు చెవి నొప్పి వస్తే.. నూనె వేసే అలవాటు మీకూ ఉందా?
'మౌనికా’ సాంగ్‌కు అద్దిరిపోయే స్టెప్పులేసిన బుడ్డోడు.. వీడియో
'మౌనికా’ సాంగ్‌కు అద్దిరిపోయే స్టెప్పులేసిన బుడ్డోడు.. వీడియో
అమ్మో మళ్ళీ వచ్చిన డేంజర్ వైరస్‌.. చెన్నై కాకుల మరణాలు
అమ్మో మళ్ళీ వచ్చిన డేంజర్ వైరస్‌.. చెన్నై కాకుల మరణాలు
భాగ్యనగరంలో బయటపడ్డ భారీ ఆన్‌లైన్ గేమింగ్ ముఠా..!
భాగ్యనగరంలో బయటపడ్డ భారీ ఆన్‌లైన్ గేమింగ్ ముఠా..!
లక్కీ ఇండియన్‌.. దుబాయ్ లాటరీలో రూ.49 కోట్లు
లక్కీ ఇండియన్‌.. దుబాయ్ లాటరీలో రూ.49 కోట్లు
భోజనం తిన్న కాసేపటికే మళ్లీ ఆకలిగా ఎందుకు అనిపిస్తుందో తెలుసా?
భోజనం తిన్న కాసేపటికే మళ్లీ ఆకలిగా ఎందుకు అనిపిస్తుందో తెలుసా?
వాలెంటైన్స్ డే రోజు గులాబీ పువ్వునే ఎందుకు ఇస్తారో తెలుసా?
వాలెంటైన్స్ డే రోజు గులాబీ పువ్వునే ఎందుకు ఇస్తారో తెలుసా?
చెప్పకుండానే అకౌంట్లో రూ.29 లక్షలు వేశారు! ఆ తర్వాత..
చెప్పకుండానే అకౌంట్లో రూ.29 లక్షలు వేశారు! ఆ తర్వాత..
పాలు, పండ్లు కలిపి తినడం ఆరోగ్యానికి మంచిదేనా..? ఇది తెలుసుకోండి
పాలు, పండ్లు కలిపి తినడం ఆరోగ్యానికి మంచిదేనా..? ఇది తెలుసుకోండి
సూర్యకుమార్ యాదవ్‌పై రోహిత్ శర్మ కామెంట్స్.. అసలేం జరిగిందంటే?
సూర్యకుమార్ యాదవ్‌పై రోహిత్ శర్మ కామెంట్స్.. అసలేం జరిగిందంటే?