AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

16 పాకిస్తానీ యూట్యూబ్ ఛానెల్స్‌ను నిషేధించిన భారత్‌! కారణం ఏంటంటే..?

పహల్గామ్ ఉగ్రదాడి తరువాత, భారత ప్రభుత్వం పాకిస్థాన్ పై తీవ్ర చర్యలు తీసుకుంటోంది. 16 పాకిస్థానీ యూట్యూబ్ ఛానెళ్లను నిషేధించడం, పాకిస్థానీ పౌరుల కు వీసాలు రద్దు చేయడం వంటి చర్యలతో పాటు, సింధునీటి ఒప్పందాన్ని ఉల్లంఘించి పాకిస్థాన్‌పై కాల్పులు జరిగాయి.

16 పాకిస్తానీ యూట్యూబ్ ఛానెల్స్‌ను నిషేధించిన భారత్‌! కారణం ఏంటంటే..?
Ban On Pak Youtube Channels
SN Pasha
|

Updated on: Apr 28, 2025 | 11:19 AM

Share

పహల్గామ్‌లో ఉగ్రదాడి తర్వాత భారత ప్రభుత్వం పాకిస్థాన్‌పై కఠిన చర్యలు తీసుకుంటుంది. ఉగ్రవాదాన్ని ప్రొత్సహించి.. మన దేశంపై దాడి చేయించారని ఆరోపిస్తూ.. ఇప్పటికే సింధు జలాల నిలిపివేత, పాక్‌ పౌరుల వీసాలు రద్దు, భారత్‌లో ఉన్న పాకిస్థానీ పౌరులను వెనక్కి పంపడం వంటి చర్యలు తీసుకుంది. ఇదే క్రమంలో తాజాగా ఓ 16 పాకిస్థానీ యూట్యూబ్‌ ఛానెల్స్‌పై బ్యాన్‌ విధిస్తూ నిర్ణయం తీసుకుంది. రెచ్చగొట్టే, మతపరంగా సున్నితమైన కంటెంట్, తప్పుదారి పట్టించే కథనాలు, తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసినందుకు సోమవారం 16 పాకిస్తానీ యూట్యూబ్ ఛానెల్‌లను నిషేధించింది. హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ సిఫార్సు మేరకు ఈ చర్య తీసుకున్నారు.

నిషేధానికి గురైన ఛానెళ్ల జాబితాను MHA విడుదల చేసింది, వాటిలో ప్రముఖ పాకిస్తానీ వార్తా ఛానెల్‌లు డాన్ న్యూస్, జియో న్యూస్ ఉన్నాయి. పహల్గామ్ ఉగ్రవాద దాడిపై బీబీసీ ప్రచురించిన వార్తా కథనం గురించి కూడా ప్రస్తావించారు. ఉగ్రవాదులను “మిలిటెంట్లు” అని పేర్కొనడంపై వివరణ కోరుతూ బీబీసీకి ఇప్పటికే లేఖ రాసినట్లు ఎంహెచ్‌ఏ పేర్కొంది. బీబీసి నివేదికలను పరిశీలిస్తామని తెలిపింది. అలాగే లక్నోలోని ఆధార్ సేవా కేంద్రం అనుమానాస్పద కార్యకలాపాలపై దర్యాప్తు ప్రారంభించారు. లక్నోలో ఉన్న కొంతమంది పాకిస్థానీయులకు ఈ కేంద్రంలో అక్కమంగా ఆధార్‌ కార్డులను నమోదు చేసి ఇస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి.

పహల్గామ్‌లోని బైసరన్ లోయలో జరిగిన దారుణమైన ఉగ్రవాద దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ దాడిపై విచారణ జరిపేందుకు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నేషనల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ (ఎన్‌ఐఏ)ను ఆదేశించింది. ఈ దాడి తర్వాత భారత్‌, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి, ఇస్లామాబాద్ దళాలు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి, నియంత్రణ రేఖ వెంబడి “కవాతు లేకుండా” పాక్‌ సైన్యం కాల్పులు జరపడం ప్రారంభించింది. దీనికి భారత సైన్యం వెంటనే ప్రతీకారం తీర్చుకుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి