Viral: ఇన్‌స్టాలో పరిచయమై.. ఇన్‌స్టంట్‌గా దోచేసింది..చివరిలో సూపర్ ట్విస్ట్!
సోషల్ మీడియాలో రిలేషన్‌షిప్స్ కోసం వెతకకండి.. లేనిపోని చిక్కుల్లో పడతారు. ఇటీవలి కాలంలో ఇలాంటి మోసాలు పెరిగిపోయాయి. కొద్ది రోజుల్లోనే అంత ప్రేమ ఎలా పుట్టుకొస్తుందో అర్థం కావడం లేదు. సకలం సమర్పించుకుని.. అప్పుడు పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కుతున్నారు. తాజాగా...

సోషల్ మీడియాలో పరిచయాలు పెంచుకోవడం.. ప్రేమలో పడటం.. ఆ తర్వాత పెళ్లి చేసుకోవడం.. ఆ తర్వాత అమ్మాయిలు దొరికినంత దోచుకుని పారిపోవడం లాంటి ఘటనలు ఇటీవల చాలా చూశాం. అలాంటిదే మరో ఘటన కర్నాటకలో వెలుగులోకి వచ్చింది. ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన ఓ యువతి ఇన్‌స్టంట్‌గా యువకుడి నుంచి పాతిక లక్షలు దోచేసింది. మోసపోయానని తెలుసుకొని పోలీసులను ఆశ్రయించిన బాధితుడికి అక్కడ మరో షాక్ తగిలింది.
వివరాల్లోకి వెళ్తే… కర్నాటకలోని గజేంద్రగఢకు చెందిన రాఘవేంద్ర రాథోడ్ అనే వ్యక్తికి ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ యువతితో పరిచయం ఏర్పడింది. కొన్నిరోజులు చాటింగ్ చేసుకున్నారు. అనంతరం ఇద్దరూ నెంబర్లు మార్చుకున్నారు. ఆ తర్వాత కొన్ని రోజులకు ఆ యువతి ఐ లవ్ యూ చెప్పింది.. పెళ్లి చేసుకుందామని కోరింది. దీంతో అతనూ ఓకే చెప్పాడు. ఇద్దరూ పీకల్లోతు ప్రేమలో మునిగిపోయారు. ఆ తర్వాత మెల్లగా అతని నుంచి డబ్బులు వసూలు చేయడం మొదలు పెట్టింది. పెళ్లి చేసుకోబోతున్నాం కదా అని అడిగినప్పుడల్లా నగదు బదిలీ చేస్తూ వచ్చాడు. దాదాపు రూ.25 లక్షల వరకూ రాబట్టిన యువతి అనంతరం ప్లేటు ఫిరాయించింది. మోసపోయానని గ్రహించిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్తే అక్కడ వారు రూ.3 లక్షల రూపాయలు తీసుకొని తనను బెదిరించి పంపించారని ఆవేదన వ్యక్తం చేశాడు. నిందితురాలు రోణ ఠాణా ఇన్‌స్పెక్టర్ కి సన్నిహిత బంధువు అని బాధితుడు ఆరోపిస్తున్నాడు. చివరికి బాధితుడు ఆత్మహత్యకు యత్నించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఆస్పత్రిలో బాధితుని ఫిర్యాదుతో గదగ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…




