AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కాల్పుల శబ్ధాలు ఇంకా చెవుల్లో ప్రతిధ్వనిస్తున్నాయి.. పహల్గామ్‌ దాడి తర్వాత కర్ణాటక సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ పోస్ట్‌!

ఏప్రిల్ 22, 2025న, జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్ సమీపంలోని ప్రశాంతమైన బైసారన్ పచ్చికభూముల్లో జరిగిన ఉగ్రదాడితో 28 మంది పౌరుల ప్రాణాలను కోల్పోయారు. ఈ ఉగ్రదాడి నుంచి తప్పించుకున్న కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ ప్రసన్నకుమార్.. ఆరోజు అక్కడ జరిగిన భయానక పరిస్థితులను, వారు తప్పించుకున్న విధానాన్ని సోషల్‌ మీడియాతో ద్వారా పంచుకున్నారు.

కాల్పుల శబ్ధాలు ఇంకా చెవుల్లో ప్రతిధ్వనిస్తున్నాయి.. పహల్గామ్‌ దాడి తర్వాత కర్ణాటక సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ పోస్ట్‌!
Pahalgam
Anand T
|

Updated on: Apr 28, 2025 | 10:33 AM

Share

కర్ణాటక రాష్ట్రం మైసూరుకు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ప్రసన్న కుమార్ భట్, ఏప్రిల్ 22న పహల్గామ్‌లోని బైసరన్ గడ్డి మైదానాల్లో జరిగిన ఉగ్రవాద దాడి నుండి బయటపడిన ఉత్కంఠభరితమైన కథను సోషల్‌ మీడియా వేదికగా పంచుకున్నారు. ఈ నెల 21న ఫ్యామిలీతో పాటు కాశ్మీర్‌ అందాలను చూడ్డానికి వెళ్లిన తాము ప్రమాదంలో చిక్కుకున్నామని.. అప్పుడు సీనియర్ ఆర్మీ అధికారి అయిన తన సోదరుడు సహాయంతో తన ఫ్యామిలీతో పాటు మరో 35-40 మంది పర్యాటకులు ప్రాణాలతో బయటపడినట్టు తెలిపారు.

దాడి జరిగిన రోజు మధ్యాహ్నం 12.30 గంటల ప్రాంతంలో భట్ తన భార్య, సోదరుడు వదినతో కలిసి పహల్గామ్‌కు చేరుకున్నాడు. వారు బైసరన్ లోయకు పోనీ రైడ్‌ను ప్రారంభించి, ప్రధాన ద్వారం ద్వారా లోపలికి వెళ్లారు.  అక్కడే ఒక కేఫ్‌లో టీ తాగిన తర్వాత మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో అక్కడి ప్రకృతి అందాలను ఆస్వాదిస్తున్నారు. ఆ సమయంలో వాళ్లకు కాల్పుల శబ్ధం వినిపించినట్టు భట్‌ తెలిపారు. దీంతో ఏం జరిగిందోనని వాళ్లు టెన్షన్ పడ్డారు. అయితే వాళ్లతో పాటే ఉన్న సీనియర్ ఆర్మీ అధికారి అయిన భట్‌ సోదరుడు అది ఉగ్రదాడి అని పసిగట్టారు. దీంతో భట్‌ కుటుంబంతో పాటు మరో 35-40 మంది ఇతర పర్యాటకులను ఉగ్రవాదులు ఉన్న ప్రధాన ద్వారం నుండి దూరంగా తీసుకెళ్లాడు. ఇక్కడ కంచేకు ఉన్న రంద్రం ద్వారా దిగువ ప్రాంతానికి వెళ్లి అక్కడ ఉన్న నీటి ప్రవాహం సమీపంలో ఉన్న లోయలో వద్ద దాక్కున్నట్టు తెలిపారు.

ఆ ప్రాంతంలో మొబైల్ నెట్‌వర్క్ కవరేజ్ తక్కువగా ఉన్నప్పటికీ, తన సోదరుడు దాడి గురించి పహల్గామ్‌లోని స్థానిక ఆర్మీ యూనిట్‌కు, శ్రీనగర్‌లోని ఆర్మీ ప్రధాన కార్యాలయానికి సమాచారం అందించినట్టు అతని తెలిపారు. అయితే మధ్యాహ్నం 3 గంటల వరకు వారు అక్కడే వేచి ఉన్నట్టు తెలిపారు. దాదాపు 40 నిమిషాల తర్వాత తమకు సహాయం అందినట్టు తెలిపారు. ఇక సాయంత్రం 4 గంటల సమయంలో ప్రత్యేక సైనిక దళాలు వారిని గుర్తించి, గాయపడిన పర్యాటకులను కొండ క్రిందికి తీసుకెళ్లినట్టు భట్‌ రాసుకొచ్చారు. వారు తిరిగొచ్చేప్పుడు కాల్పులు జరిగిన ప్రాంతాన్ని చూసి ఎంతో చలించి పోయినట్టు తెలిపారు. ఇంటికి చేరుకన్న తర్వాత కూడా తుపాకీ కాల్పుల శబ్దాలు తమ చెవుల్లో ప్రతిధ్వనిస్తున్నాయని.. ఆ భయం ఇప్పటికీ తనను కలచివేస్తోంది” అని ప్రసన్నకుమార్ భట్ ఎక్స్‌ లో చేసిన పోస్ట్‌లో రాసుకొచ్చారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…