భారత 6జీ టెక్నాలజీ విధానానికి ఆమోదం తెలిపిన ఐరాసా సంస్థ
ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే చాలావరకు దేశాల్లో 5జీ టెక్నాలజీ అమలులో ఉంది. మరికొన్ని దేశాల్లో 6జీ టెక్నాలజీని కూడా అమలు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే సాంకేతిక రంగంలో భారత్ ఓ కీలక పురోగతిని సాధించింది. ప్రపంచవ్యాప్తంగా 6జీ టెక్నాలజీని అందించేందుకు అయ్యే ఖర్చుని తగ్గించేలా చేయడానికి ఇండియాకి చెందిన 6జీ టెక్నాలజీ విధానాన్ని అనుసరించేందుకు ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ (ITU) స్టడీ గ్రూప్ ఆమోదం తెలిపింది.

ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే చాలావరకు దేశాల్లో 5జీ టెక్నాలజీ అమలులో ఉంది. మరికొన్ని దేశాల్లో 6జీ టెక్నాలజీని కూడా అమలు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే సాంకేతిక రంగంలో భారత్ ఓ కీలక పురోగతిని సాధించింది. ప్రపంచవ్యాప్తంగా 6జీ టెక్నాలజీని అందించేందుకు అయ్యే ఖర్చుని తగ్గించేలా చేయడానికి ఇండియాకి చెందిన 6జీ టెక్నాలజీ విధానాన్ని అనుసరించేందుకు ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ (ITU) స్టడీ గ్రూప్ ఆమోదం తెలిపింది. సెప్టెంబర్ 25 నుంచి 26 వ తేదీ వరకు జెనీవీలో ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ సమావేశం జరిగింది. అయితే ఇండియా ప్రతిపాదించిన ఈ సాంకేతిక విధానానికి కొంతమంది సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. అయినా కూడా ఐటీయూ ఇండియా 6జీ విజన్‌కు ఆమోదం తెలిపింది.
ప్రధానమంత్రి మోడీ విడుదల చేసిన ఈ భారత 6జీ టెక్నాలజీ విధానం.. ఖర్చును భరించగలగే సమర్థత, సుస్థిరతను సూచిస్తుంది. భారత్‌కు చెందిన ప్రతినిధుల బృందం గతంలో జరిగిన స్టడీ గ్రూప్ సమావేశంలో.. IMT2030 ఫ్రేమ్‌వర్క్‌లో 6జీ సాంకేతికత విధానాన్ని చేర్చడంలో విజయం సాధించింది. డిజిటల్ విభజనను తగ్గించి, మొబైల్ టెక్నాలజీలో సమాన అవకాశాలు కల్పించడానికి.. అలాగే గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో నివసించే వారికి హై స్పీడ్ ఇంటర్నేట్‌ను చేరవేయడాన్ని ఇది సూచిస్తుంది.
IMT2030 లేదా 6జీ టెక్నాలజీ అభివృద్ధికి ITU-R స్టడీ గ్రూప్ 5 కింద వర్కింగ్ పార్టీ 5D సారథ్యం వహిస్తోంది. భవిష్యత్తు మొబైల్ కమ్యూనికేషన్ కోసం.. ఈ సాంకేతికతను అందుబాటులో ఉంచేలా వారు వినూత్న మార్గాలను అన్వేషిస్తున్నారు. ఈ సాంకేతికత ప్రపంచవ్యాప్తంగా ఉన్న వినియోగదారులకు సరసమైన ధరలో లభించేలా చేయడం.. అలాగే దీన్ని స్థిరంగా ఎలా అమలు చేయాలో పరిగణలోకి తీసుకొని ముందుకు వెళ్తున్నారు. ఇప్పుడు ఇండియా ప్రవేశపెట్టిన ప్రతిపాదనకు ఆమోదం లభించడం వల్ల ప్రపంచంలోని సాంకేతిక ప్రమాణాన్ని రూపొందించండంలో భారత్ కీలక పాత్ర పోషించనుంది. అయితే ఇండియా చేపడుతున్న ఈ 6జీ టెక్నాలజీ కేవలం దేశంలో మాత్రమే కాకుండా.. డిజిటల్ విభేధాలను తగ్గించేందుకు కృషి చేస్తున్న దేశాలకు కూడా ఓ కీలక పురోగతికి ఉదాహరణగా నిలిచింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




