Independence Day 2022: స్వాతంత్ర్య వజ్రోత్సవాల వేళ కలకలం రేపిన ఉగ్రకుట్ర.. ఆరుగురి అరెస్ట్..
Independence Day 2022: హస్తినలో ఉగ్ర కుట్ర కలకలం రేపింది. స్వాతంత్ర్య దినోత్సవం ముంగిట ఉగ్రవాదులు పన్నిన కుట్రను ఛేదించారు ఢిల్లీ పోలీసులు.
Independence Day 2022: హస్తినలో ఉగ్ర కుట్ర కలకలం రేపింది. స్వాతంత్ర్య దినోత్సవం ముంగిట ఉగ్రవాదులు పన్నిన కుట్రను ఛేదించారు ఢిల్లీ పోలీసులు. ఆయుధాలు, బుల్లెట్లను అక్రమంగా రవాణా చేస్తోన్న ఆరుగురు వ్యక్తుల్ని అరెస్టు చేశారు. వారి నుంచి పెద్ద ఎత్తున బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు.
పంద్రాగస్టు వేళ.. ఢిల్లీలో పకడ్బందీ నిఘా ఏర్పాటు చేశారు పోలీసులు. భద్రతను కట్టుదిట్టం చేశారు. రాజధానిలో ముమ్మర తనిఖీలు చేపట్టారు. ఆనంద్ విహార్ ప్రాంతంలో సోదాలు చేపడుతుండగా కొందరు అనుమానాస్పదంగా కన్పించారు. అదుపులోకి తీసుకున్న పోలీసులు తమదైన శైలిలో విచారించారు. ఎంక్వైరీలో దిమ్మదిరిగే విషయాలు బయటపడ్డాయి. నిందితులు ఆయుధాలు స్మగ్లింగ్ చేస్తున్నట్లు గుర్తించిన పోలీసులు.. వారి నుంచి 2 వేల తూటాలను స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదిని అరెస్ట్ చేశారు పోలీసులు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..