IRCTC Updates: ఐఆర్‌సీటీసీ సరికొత్త సదుపాయం.. ఇక నుంచి రైళ్లలోనూ ఆన్‌లైన్ ఫుడ్ ఆర్డర్..
IRCTC Updates: ఒక్కోసారి ట్రైన్‌లో సుదూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. రోజుల పాటు ప్రయాణించాల్సి వస్తుంది. ఇలాంటి సందర్భంలో
IRCTC Updates: ఒక్కోసారి ట్రైన్‌లో సుదూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. రోజుల పాటు ప్రయాణించాల్సి వస్తుంది. ఇలాంటి సందర్భంలో ఇంటి భోజనం తెచ్చుకున్నా.. ఎక్కువ కాలం ఉండదు. అందుకే ఐఆర్‌సీటీసీ యాప్, వెబ్ సైట్ ద్వారా భోజనం సదుపాయం కల్పిస్తోంది. ట్రైన్ టిక్కెట్ బుక్ చేసుకున్నట్లే.. ట్రైన్‌లో ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ చేసుకోవచ్చు. దీని ద్వారా ఫుడ్ ఆర్డర్ చేయడం చాలా ఈజీ. IRCTC రైళ్లలో ఫుడ్ డెలివరీ కోసం కొత్తగా eCatering యాప్‌ను తీసుకువచ్చింది. ఇది గూగుల్ ప్లే స్టోర్, ఐఫోన్ స్టోర్‌లో అందుబాటులో అందుబాటులో ఉంది. ఈ యాప్ ద్వారా నార్త్ ఇండియా, సౌత్ ఇండియా ఆహారాలు అన్నీ లభిస్తాయి.
రైళ్లలో ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ చేయడానికి 5 స్టెప్స్..
1. మొదటగా ecatering.irctc.co.inకి లాగిన్ అవ్వాలి.
2. మీ ట్రైన్ పేరు, స్టేషన్ నెంబర్ టైప్ చేయాలి.
3. మీ PNRని నెంబర్ ఎంటర్ చేయాలి. అందుబాటులో ఉన్న రెస్టారెంట్‌లను సెర్చ్ చేయాలి.
4. నచ్చిన ఆహారాన్ని సెలక్ట్ చేసుకోవాలి. ఆన్‌లైన్ పేమెంట్, క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ ఎంచుకుని ఆర్డర్ పెట్టాలి.
5. ఎంచుకున్న సమయానికి ఫుడ్ డెలివరీ జరుగుతుంది.
ముంబై సెంట్రల్ (BCT), చత్రపతి శివాజీ టెర్మినల్ (CST), న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ (NDLS), పాత ఢిల్లీ రైల్వే స్టేషన్ (DEL), బెంగళూరు సిటీ జంక్షన్ (SBC), మీరు రైలులో ఫుడ్ బాక్స్ డెలివరీని పొందే కొన్ని ప్రధాన స్టేషన్‌లు. చెన్నై సెంట్రల్ (MAS), కాన్పూర్ (CNB), అలహాబాద్ జంక్షన్ (ALD), వారణాసి (BSB), లక్నో (LKO), ఇటార్సీ (ET), భోపాల్ జంక్షన్ (BPL), విజయవాడ (BZA) మొదలైన స్టేషన్ల పరిధిలో ఈ సదుపాయం అందుబాటులో ఉంది. ఈ సదుపాయాన్ని విస్తరించేందుకు IRCTC ప్లాన్స్ చేస్తోంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..