Voters List: ప్రతి 100 మందిలో ఇద్దరు కొత్త ఓటర్లు.. పెరిగిన మహిళా ఓటర్ల నిష్పత్తి
సార్వత్రిక ఎన్నికల కోసం దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు సిద్ధమయ్యాయి. కొన్ని ఒంటరిగా, మరికొన్ని గుంపుగా కూటములు కట్టాయి. పొత్తులు, సీట్ల సర్దుబాటుతో పాటు అభ్యర్థులను సైతం ఎంపిక చేసే కసరత్తు మొదలుపెట్టాయి. కొన్ని పార్టీలు ఏకంగా అభ్యర్థుల జాబితాలు సైతం ప్రకటించాయి. మరోవైపు కేంద్ర ఎన్నికల సంఘం సైతం ఎన్నికల నిర్వహణ కోసం కసరత్తు చేస్తోంది. ఒక్కో రాష్ట్రంలో పర్యటిస్తూ అక్కడి స్థానిక పరిస్థితులు, సన్నద్ధతను అంచనా వేస్తోంది.

సార్వత్రిక ఎన్నికల కోసం దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు సిద్ధమయ్యాయి. కొన్ని ఒంటరిగా, మరికొన్ని గుంపుగా కూటములు కట్టాయి. పొత్తులు, సీట్ల సర్దుబాటుతో పాటు అభ్యర్థులను సైతం ఎంపిక చేసే కసరత్తు మొదలుపెట్టాయి. కొన్ని పార్టీలు ఏకంగా అభ్యర్థుల జాబితాలు సైతం ప్రకటించాయి. మరోవైపు కేంద్ర ఎన్నికల సంఘం సైతం ఎన్నికల నిర్వహణ కోసం కసరత్తు చేస్తోంది. ఒక్కో రాష్ట్రంలో పర్యటిస్తూ అక్కడి స్థానిక పరిస్థితులు, సన్నద్ధతను అంచనా వేస్తోంది. మరో వారం, పది రోజుల్లో ఎన్నికల తేదీలను ప్రకటించేందుకు సమాయత్తమవుతోంది. ఇదంతా సరే.. మరి ఎంతమందికి ఓటుహక్కు ఉంది? జనసంఖ్యలో చైనాను అధిగమించి దూసుకెళ్తున్న భారతదేశంలో తమను పరిపాలించే ప్రభుత్వాన్ని ఎన్నుకునేది ఎంతమంది? ఇవే ఇప్పుడు ఆసక్తి కల్గిస్తున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం తయారు చేసిన ఓటర్ల జాబితా గణాంకాల ప్రకారం దేశంలో ఓటు హక్కు కల్గిన పౌరుల సంఖ్య 96.9 కోట్లుగా తేలింది.
ఓటర్ల జాబితా ఎప్పటికప్పుడు నవీకరిస్తూ ఉంటారన్న విషయం తెలిసిందే. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ తమ పేరును ఓటర్ల జాబితాలో నమోదు చేయించుకోవచ్చు. 2023 ప్రారంభం నుంచి ఇప్పటి వరకు 2.63 కోట్ల మంది కొత్త ఓటర్లు జాబితాలో చేరారు. లోక్‌సభ ఎన్నికల వేళ గత కొన్ని నెలలుగా ఓటరు నమోదులో భారీ పెరుగుదల కనిపిస్తోంది. ఓటర్ల సంఖ్య 2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో 91.2 కోట్లుగా ఉండగా అది ఇప్పుడు 6% పెరిగి దాదాపు 97 కోట్లకు చేరుకుంది. అదనంగా పెరిగిన 5.68 కోట్ల ఓటర్లలో, గణనీయ సంఖ్య (1.85 కోట్లు)లో మొదటిసారి ఓటర్లున్నారు. మొత్తం ఓటర్ల సంఖ్య 1.91% కొత్త ఓటర్లేనని తెలింది. అంటే ప్రతి 100 మంది ఓటర్లలో దాదాపు ఇద్దరు కొత్త, మొదటిసారి ఓటర్లేనని అర్థమవుతోంది. 2019 గణాంకాలతో పోలిస్తే 18-19 ఏళ్ల వయస్సు గల వ్యక్తుల నమోదులో పెరుగుదల 23% పెరిగింది. నిరుద్యోగం, విద్యావకాశాల వంటి సమస్యలను ఎదుర్కొంటున్న యువ ఓటర్ల సంఖ్య పెరుగుదల ఎన్నికల రాజకీయాల్లో కీలకంగా మారనుంది.
ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్, పశ్చిమ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాలు ఫిబ్రవరి 8 నాటికి అత్యధిక సంఖ్యలో ఓటర్లున్న రాష్ట్రాలుగా నిలిచాయి. గత ఐదేళ్లలో 87.3 లక్షల కొత్త ఓటర్ల నమోదుతో ఉత్తరప్రదేశ్‌లో అత్యధిక వృద్ధిని ప్రతిబింబించింది. పశ్చిమ బెంగాల్, బీహార్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. జనాభా దామాషా నిష్పత్తి ప్రకారం చూస్తే మేఘాలయలో 2019 లోక్‌సభ ఎన్నికల తర్వాత దాదాపుగా 17.1% ఓటర్ల సంఖ్యలో వృద్ధి కనిపించింది. ఆ తర్వాతి స్థానాల్లో జార్ఖండ్, హర్యానా, జమ్మూ, కాశ్మీర్, తెలంగాణ రాష్ట్రాలు నిలిచాయి. ఈ రాష్ట్రాలు మహిళా ఓటర్లలోనూ గణనీయమైన పెరుగుదలను సాధించాయి. అత్యధికంగా జార్ఖండ్‌లో మహిళా ఓటర్ల వృద్ధి 19.1%గా నమోదైంది. దీనికి విరుద్ధంగా, గోవా, పంజాబ్ వంటి రాష్ట్రాలు మొత్తం ఓటర్లలో ఓ మోస్తరు పెరుగుదల మాత్రమే కనిపించింది. మహిళా ఓటర్లలో పెరుగుదల చాలా కనిష్టంగా ఉంది. మొత్తం అర్హులైన ఓటర్లలో దాదాపు 47 కోట్ల మంది మహిళలు.. అంటే దాదాపు 49% మంది ఉన్నారని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. స్త్రీ, పురుష లింగ నిష్పత్తిలో ఈసారి మహిళల సంఖ్య పెరిగింది. 2019లో ప్రతి 1,000 మంది పురుషులకు 928 మహిళలు ఉండగా.. 2024లో ఆ సంఖ్య 948కు చేరింది. కొత్త ఓటర్ల నమోదులోనే కాదు.. ఆ ఓటర్లంతా తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు వీలుగా కేంద్ర ఎన్నికల సంఘం విస్తారమైన ఏర్పాట్లు చేస్తోంది. దేశవ్యాప్తంగా 12 లక్షలకు పైగా పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేస్తోంది.
2024 లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి కొన్ని కీలక గణాంకాలు:
- 2024 ఎన్నికల్లో 96.9 కోట్ల మంది ప్రజలు ఓటు వేయడానికి అర్హులు.
- 2019లో దాదాపు 91 కోట్ల మంది ఓటర్లు అర్హులు.
- 47 కోట్లకు పైగా మహిళా ఓటర్లు. ఇది మొత్తం ఓటర్ల సంఖ్యలో దాదాపు 49%.
- 2019లో 928గా ఉన్న లింగ నిష్పత్తి 2024లో 948కి పెరిగింది.
- దాదాపు 1.73 కోట్ల మంది ఓటర్లు 18-19 సంవత్సరాల మధ్య వయస్కులు.
- 1.8 కోట్ల మందికి పైగా ప్రజలు 80 లేదా అంతకంటే ఎక్కువ వయస్కులు.
- ఓటర్ల జాబితాలో కొత్తగా 2.63 కోట్ల మంది ఓటర్లు చేరారు, వీరిలో 1.41 కోట్ల మంది మహిళా ఓటర్లు ఉన్నారు.
- దాదాపు 18 లక్షల మంది ఓటర్లు వికలాంగులు.
- ఎన్నికల కోసం దేశవ్యాప్తంగా 12 లక్షల పోలింగ్ బూత్‌లను ఏర్పాటవుతున్నాయి.
- పోలింగ్ సజావుగా నిర్వహించేందుకు 1.5 కోట్ల మంది పోలింగ్ సిబ్బందిని నియమించనున్నారు.
- మొదటి లోక్‌సభ ఎన్నికల్లో (1951-52) 45% ఓటింగ్ నమోదు. 2019 ఎన్నికల్లో 67%. పోలింగ్ శాతం నమోదు.
- భారతదేశంలో 1951లో 17.32 కోట్ల మంది ఓటర్లు ఉండగా, 1957 నాటికి అది 19.37 కోట్లకు పెరిగింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




