BJP Candidates List: బీజేపీ లోక్ సభ అభ్యర్థుల తొలిజాబితా విడుదల.. తెలంగాణలో వీరికి ఛాన్స్..
బీజేపీకి చెందిన లోక్‌సభ అభ్యర్థుల తొలి జాబితా విడుదల అయింది. ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ముఖ్యనేతలు ప్రెస్‌మీట్ నిర్వహించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా 125 మందితో ఫస్ట్ లిస్ట్ విడుదల చేశారు. తెలంగాణలో సికింద్రాబాద్ నుంచి కిషన్‌రెడ్డి బరిలో నిలువగా.. కరీంనగర్ నుంచి బండి సంజయ్ పోటీలో ఉన్నారు. ఇక నిజామాబాద్ నుంచి ధర్మపురి అర్వింద్ కు టికెట్ ఖరారు చేసింది అధిష్టానం.

బీజేపీకి చెందిన లోక్‌సభ అభ్యర్థుల తొలి జాబితా విడుదల అయింది. ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ముఖ్యనేతలు ప్రెస్‌మీట్ నిర్వహించారు. బీజేపీ జనరల్ సెక్రటరీ వినోద్ తావడే 195 మందితో ఫస్ట్ లిస్ట్ విడుదల చేశారు. తెలంగాణలో 9 మందికి చోటు కల్పించారు. సికింద్రాబాద్ నుంచి కిషన్‌రెడ్డి బరిలో నిలువగా.. కరీంనగర్ నుంచి బండి సంజయ్ పోటీలో ఉన్నారు. ఇక నిజామాబాద్ నుంచి ధర్మపురి అర్వింద్ కు టికెట్ ఖరారు చేసింది అధిష్టానం. అలాగే జాతీయ స్థాయిలో వారణాసి నుంచి ప్రధాని నరేంద్ర మోదీ పోటీ చేయనున్నారు. 2014, 2019 లోక్‌సభ ఎన్నికల్లోనూ ప్రధాని మోదీ యూపీలోని వారణాసి నియోజకవర్గం నుంచే పోటీ చేసి భారీ మెజార్టీతో గెలిచారు. ఇప్పుడు వరుసగా మూడోసారి అక్కడి నుంచే ప్రధాని బరిలో నిలవనున్నారు. ఇక లక్నో పార్లమెంట్ నియోజకవర్గంలో మంత్రి రాజ్‌నాధ్ సింగ్ బరిలో నిలువగా.. గాంధీనగర్ నుంచి అమిత్ షా పోటీ చేయనున్నారు. దేశ వ్యాప్తంగా బీజేపీ మూడవ సారి అధికారంలోకి రావాలని తీవ్ర కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఫిర్ ఏక్ బార్ మోదీ సర్కార్ అనే నినాదంతో ముందుకు వెళ్తున్నారు. 380 లోక్ సభ స్థానాల్లో విజయమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. తొలి జాబితాలో 34 మంత్రులు, ఇద్దరు సీఎంలకు అవకాశం కల్పించారు.
28 మంది మహిళలకు అవకాశం ఇవ్వగా.. 47 మంది యువతకు ఛాన్స్ ఇచ్చారు. అలాగే 27 మంది ఎస్సీ, 17 ఎస్టీ సామాజిక వర్గానికి కేటాయించగా.. 57 మంది ఓబీసీలకు అవకాశం కల్పించారు. విదిశ నుంచి మధ్యప్రదేశ్ మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ లోక్‌సభ బరిలో నిలుచోనున్నారు. భోపాల్ ఎంపీ సాధ్వి ప్రజ్ఞాసింగ్‌కు ఈసారి టికెట్ ఇవ్వలేదు బీజేపీ అధిష్టానం. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్‌ను సాధ్వి ప్రజ్ఞాసింగ్ ఓడించారు. దేశవ్యాప్తంగా 90 – 100 మంది సిట్టింగ్ ఎంపీలకు టికెట్లు నిరాకరించింది. మూడు పర్యాయాలు ఎంపీలుగా చేసినవారికి, వయస్సు పైబడినవారికి కోత విధించింది. కొత్త తరానికి, పార్టీ కోసం శ్రమించినవారికి చోటు కల్పిస్తూ అభ్యర్థుల కూర్పుపై కసరత్తు చేసింది. అయితే తెలంగాణ నుంచి ముగ్గురు సిట్టింగ్‌లకు తొలి జాబితాలో స్థానం కల్పించడం గమనార్హం. ఉత్తర్‌ప్రదేశ్ 51, పశ్చిమ బెంగాల్ 20, మధ్యప్రదేశ్ 24 స్థానాలకు అభ్యర్థులు ఖరారు చేశారు. దేశంలోని మొత్తం పార్లమెంట్ స్థానాల్లో 3వ వంతు లోక్ సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది బీజేపీ.
బీజేపీ లోక్ సభ అభ్యర్థులు – నియోజకవర్గాలు..
- అరుణాచల్ వెస్ట్ – కిరెన్ రిజిజు
- కరీంగంజ్ – కృపానాథ్ మల్లా
- సిల్చార్ – పరిమళ్ శుక్ల బైద్య
- తేజ్‌పూర్ – రంజిత్ దత్తా
- నవగాంవ్ – సురేశ్ బోరా
- కలియాబోర్ – కామాఖ్య ప్రసాద్
- దిబ్రూగఢ్ – శర్బానంద్ సోనోవాల్
- నార్త్ ఢిల్లీ – మనోజ్ తివారీ
- పశ్చిమ ఢిల్లీ – కమల్‌జీత్
- దక్షిణ ఢిల్లీ – రాంవీర్ సింగ్ బిదూరి
- నార్త్ గోవా – శ్రీపాద్ నాయక్
- రాజ్‌కోట్ – పురుషోత్తం రూపాలా
- పోర్‌బందర్ – డా. మన్సుఖ్ మాండవియా
- ఉధంపూర్ – డా. జితేంద్ర సింగ్
- జమ్ము – జుగల్ కిశోర్ శర్మ
- న్యూఢిల్లీ – బన్సూరి స్వరాజ్
- త్రిసూర్ – సురేష్ గోపి
- అత్తింగళ్- వి. మురళీధరన్
- తిరువనంతపురం – రాజీవ్ చంద్రశేఖర్
- గుణ – జ్యోతిరాదిత్య సింధియా
- విదిష – శివరాజ్ సింగ్ చౌహాన్
- భోపాల్ – అలోక్ శర్మ
- దేవాస్ – మహేంద్ర సింగ్ సోలంకి
- మందసౌర్ – సుధీర్ గుప్తా
- రత్లాం – అనితా చౌహాన్
- ఖాండ్వా – న్యారేశ్వర్ పాటిల్
- బేతుల్ – దుర్గాదాస్ ఓకే
BJP announces first list of candidates for Lok Sabha elections; PM Modi to contest from Varanasi.
The first list of candidates includes 34 central ministers and MoS and Lok Sabha Speaker, says BJP National General Secretary Vinod Tawde. pic.twitter.com/05zQ1FUUCg
— ANI (@ANI) March 2, 2024
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




