AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bansuri Swaraj: బీజేపీ తొలి జాబితాలో సుష్మా స్వరాజ్ కుమార్తె.. న్యూఢిల్లీ నియోజకవర్గ బరిలో బన్సూరి స్వరాజ్

వచ్చే లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి పార్టీ అభ్యర్థుల తొలి జాబితాను బీజేపీ విడుదల చేసింది. 195 మంది అభ్యర్థులతో కూడిన ఈ జాబితాలో.. 34 మంది సిట్టింగ్ కేంద్ర మంత్రులకు తిరిగి సీటు ఇచ్చారు. అత్యధికంగా ఉత్తర ప్రదేశ్ నుంచి 51 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది.

Bansuri Swaraj: బీజేపీ తొలి జాబితాలో సుష్మా స్వరాజ్ కుమార్తె.. న్యూఢిల్లీ నియోజకవర్గ బరిలో బన్సూరి స్వరాజ్
Bansuri Swaraj
Janardhan Veluru
|

Updated on: Mar 02, 2024 | 7:40 PM

Share

వచ్చే లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి పార్టీ అభ్యర్థుల తొలి జాబితాను బీజేపీ విడుదల చేసింది. 195 మంది అభ్యర్థులతో కూడిన ఈ జాబితాలో.. 34 మంది సిట్టింగ్ కేంద్ర మంత్రులకు తిరిగి సీటు ఇచ్చారు. అత్యధికంగా ఉత్తర ప్రదేశ్ నుంచి 51 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. తెలంగాణ నుంచి మూడు సిట్టింగ్‌లతో సహా 9 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేశారు.

తొలి జాబితాలో ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు, 28 మంది మహిళా అభ్యర్థులకు చోటు దక్కింది. సామాజిక వర్గాల వారీగా 27 మంది ఎస్సీ, 18 మంది ఎస్టీ, 57 మంది ఓబీసీ కేటగిరీకి చెందిన వారికి సీటు కేటాయించారు. తొలి జాబితాలో 50 ఏళ్ల లోపు వయస్కులైన 47 మంది చోటు దక్కించుకున్నారు.

మాజీ కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ కుమార్తె బన్సూరి స్వరాజ్‌కు న్యూఢిల్లీ లోక్‌సభ నియోజకవర్గం నుంచి బరిలో దింపారు. బన్సూరి స్వరాజ్ వృత్తి రీత్యా న్యాయవాది. ఆమె ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడం ఇదే తొలిసారి కావడం విశేషం. లీగల్ విభాగంలో ఆమె బీజేపీకి సేవలు అందిస్తున్నారు. గత ఏడాది బీజేపీ ఢిల్లీ లీగల్ సెల్ కో-కన్వీనర్‌గా నియమితులయ్యారు. న్యాయవాద వృత్తిలో ఆమె 15 ఏళ్ల అనుభవం ఉంది. 2007లో ఢిల్లీ బార్ కౌన్సిల్‌లో ఆమె తన పేరును నమోదు చేసుకున్నారు. లండన్‌లోని బీపీపీ లా స్కూల్‌లో న్యాయశాస్త్రంలో డిగ్రీ చేశారు. యూనివర్సిటీ ఆఫ్ వర్‌విక్ నుంచి ఇంగ్లీష్ లిటరేచర్ చేశారు. యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్‌ఫర్డ్ నుంచి పీజీ చేశారు.

న్యూఢిల్లీ లోక్‌సభ సీటును తనకు ఖరారు చేయడం పట్ల బన్సూరీ స్వరాజ్ సంతోషం వ్యక్తంచేశారు. ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా, పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డాలకు కృతజ్ఞతలు తెలిపారు.

కాగా నార్త్ ఈస్ట్ ఢిల్లీ నుంచి మనోజ్ తివారీ, వెస్ట్ ఢిల్లీ నుంచి కమల్‌జీత్ షెరావత్, సౌత్ ఢిల్లీ నుంచి రాంవీర్ సింగ్ బింధూరి, ఢిల్లీ చాంద్నీ చౌక్ నుంచి ప్రవీణ్ ఖందేల్‌వాల్ పేర్లను బీజేపీ ఖరారు చేసింది.

ఢిల్లీ నుంచి 5 మంది బీజేపీ అభ్యర్థుల పేర్లు ఖరారు..

గాంధీ నగర్ నుంచే అమిత్ షా..

గుజరాత్‌లోని గాంధీ నగర్ నియోజకవర్గం నుంచి కేంద్ర హోం మంత్రి అమిత్ షా మరోసారి పోటీ చేయనున్నారు. యూపీలోని లక్నో స్థానం నుంచి రాజ్‌నాథ్ సింగ్, అమేథీ నుంచి స్మృతీ ఇరానీ పోటీ చేయనున్నారు.

త్రిసూర్ నుంచి సురేష్ గోపి పోటీ..

కేరళలోని త్రిసూర్ నుంచి సినీ నటుడు సురేష్ గోపికి సీటు కేటాయించారు. తిరువనంతపురం నుంచి రాజీవ్ చంద్రశేఖర్‌కు సీటు ఖరారు చేశారు. మధ్యప్రదేశ్‌లోని గుణ సీటును జ్యోతిరాదిత్య సింథియాకు ఖరారు చేశారు. విదిష నుంచి మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహార్ బరిలో నిలవనున్నారు.