EPFO Customers: ఈపీఎఫ్ ఖాతాదారులకు అలెర్ట్.! ఆ సేవలకు అంతరాయం..

ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) సేవలకు అంతరాయం ఏర్పడింది. ఆధార్‌ అథెంటికేషన్‌కు సంబంధించిన సేవల్లో అంతరాయం ఏర్పడినట్లు అధికారులు తెలిపారు. ఈ విషయాన్ని EPFO ట్విట్టర్‌ వేదికగా తెలిపింది. ఆధార్‌ అథెంటికేషన్‌ సేవలు ప్రస్తుతం అందుబాటులో లేవంటూ ఎర్రర్‌ మెసేజ్‌ చూపిస్తుంది. ఇదే విషయాన్ని తెలుపుతూ ఓ ఖాతాదారుడు.. గత నాలుగు రోజులుగా తాను ఈ సమస్య ఎదుర్కొంటున్నట్లు ‘ఎక్స్‌’ వేదికగా తెలిపారు.

EPFO Customers: ఈపీఎఫ్ ఖాతాదారులకు అలెర్ట్.! ఆ సేవలకు అంతరాయం..

|

Updated on: Mar 02, 2024 | 11:11 AM

ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) సేవలకు అంతరాయం ఏర్పడింది. ఆధార్‌ అథెంటికేషన్‌కు సంబంధించిన సేవల్లో అంతరాయం ఏర్పడినట్లు అధికారులు తెలిపారు. ఈ విషయాన్ని EPFO ట్విట్టర్‌ వేదికగా తెలిపింది. ఆధార్‌ అథెంటికేషన్‌ సేవలు ప్రస్తుతం అందుబాటులో లేవంటూ ఎర్రర్‌ మెసేజ్‌ చూపిస్తుంది. ఇదే విషయాన్ని తెలుపుతూ ఓ ఖాతాదారుడు.. గత నాలుగు రోజులుగా తాను ఈ సమస్య ఎదుర్కొంటున్నట్లు ‘ఎక్స్‌’ వేదికగా తెలిపారు. దీనిపై స్పందించిన EPFO అధికారులు.. టెక్నికల్‌ మెయింటెనెన్స్‌ కారణాల వల్ల ఆధార్‌ అథెంటికేషన్‌ సేవలకు అంతారయం కలిగిందని, ఇందుకుగాను తాము చింతిస్తున్నట్లు తెలుపుతూ ట్వీట్‌ చేశారు. త్వరలోనే ఈ సేవలను పునరుద్ధరించనున్నట్లు అధికారులు తెలిపారు.

ఇదిలా ఉంటే EPFO అకౌంట్‌ను ఆధార్‌తో లింక్‌ చేసుకోవాలని ఈపీఎఫ్‌ఓ ఇప్పటికే ప్రకటించింది. అకౌంట్​ను డూప్లికేట్​ చేసే ముప్పు తగ్గించడంతో పాటు, వ్యక్తిగత వివరాల డేటాలో తప్పులు ఉండే అవకాశం తగ్గించడానికి, పీఎఫ్​ అకౌంట్​ నుంచి డబ్బులు విత్​డ్రా చేసుకోవడం సులభతరం చేయడానికి ఆధార్‌తో లింక్‌ చేయాలని తెలిపారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం EPFO 277 మిలియన్లకు పైగా ఖాతాలు, దాదాపు రూ.20 లక్షల కోట్ల కార్పస్‌తో ప్రపంచంలోనే అతిపెద్ద సామాజిక భద్రతా సంస్థగా ఉంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Follow us