Prisioner: తప్పిపోయిన ఖైదీ కోసం ఊరంతా వెతికి పోలీసులు.. చివరికి జైల్లోనే ఉన్నాడని తెలిసి..
Prisioner: చంకలో పిల్లిని పెట్టుకుని ఊరంతా వెతకడం అనే నానూడి ఈ ఘటనకు సరిగ్గా సరిపోలుతుంది. ఆదివారం సాయంత్రం ఉత్తరప్రదేశ్‌లోని..
Prisioner: చంకలో పిల్లిని పెట్టుకుని ఊరంతా వెతకడం అనే నానూడి ఈ ఘటనకు సరిగ్గా సరిపోలుతుంది. ఆదివారం సాయంత్రం ఉత్తరప్రదేశ్‌లోని బండా జైలు నుంచి తప్పిపోయిన ఓ ఖైదీ చివరకు జైలులోనే పట్టుబడ్డారు. అతన్ని పట్టుకోవడానికి ఊరంతా గాలించిన పోలీసులు.. చివరికి జైలులోనే దాక్కున్నట్లు గుర్తించి ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. ఉత్తరప్రదేశ్‌లో దొంగతనం కేసులో అరెస్ట్ అయి బండా జైలులో శిక్ష అనుభవిస్తు్న్న విజయ్ అరఖ్.. ఆదివారం సాయంత్రం జైలు నుంచి తప్పించుకున్నాడు. విషయం తెలుసుకున్న అధికారులు మొదట జైలు అంతా గాలించారు. అయినప్పటికీ దొరక్కపోవడంతో చివరికి అలారం మోగించారు. విషయం ఉన్నతాధికారులకు తెలియడంతో కాస్త గందరగోళం నెలకొంది.
పోలీసు సిబ్బంది అంతా రంగంలోకి దిగి తప్పించుకున్న ఖైదీ కోసం గాలింపు చర్యలను తీవ్రం చేశారు. మరోవైపు ఖైదీ పరార్ అవడంపై సమాచారం అందుకున్న ఏడీజీ సందీప్ త్రిపాఠి బండా జైలుకు చేరుకున్నారు. వివరాలు అడిగి తెలుసుకున్నారు. కాగా, తప్పించుకున్న ఖైదీ కోసం పోలీసులు చుట్టుపక్కన గ్రామాలు, ప్రాంతాలు అంతా గాలించారు. చివరికి జైలులోని తోటలో దాక్కున్నట్లు గుర్తించారు.
జైలు నుంచి తప్పించుకున్న విజయ్.. జైలులోని వ్యవసాయక్షేత్రంలోనే నక్కినట్లు గుర్తించారు. వాస్తవానికి విజయ్… జైలు వ్యవసాయ క్షేత్రంలో పని చేసేవాడు. అలా అక్కడ జైలు గోడ పక్కనే ఉన్న వెదురు మొక్కలను గమనించాడు. వాటి సాయంతో గోడ దూకి పారిపోవాలని ప్రణాళిక సిద్ధం చేసుకున్నాడు. ఈ ప్రణాళిక ప్రకారమే ఆదివారం సాయంత్రం.. జైలులో ఉన్న వ్యవసాయక్షేతంలో గల వెదురు చెట్టు సాయంతో గోడ దూకి పారిపోయేందుకు ప్రయత్నించాడు. అయితే, ఆ ప్రయత్నంలో విజయ్ జారి కిందపడటంతో నడుముకి తీవ్ర గాయమైంది. దాంతో ఎటూ వెళ్లలేక పొదల మాటునే ఊపిరి బిగబట్టి దాక్కున్నాడు. ఈ గ్యాప్‌లో పోలీసులు అతని కోసం చుట్టుపక్కన ఊర్లన్నీ గాలించి వచ్చారు. చివరికి అతను జైలులోనే ఉన్నాడని తెలుసుకుని అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
Also read:
Silver Price Today: స్వల్పంగా తగ్గిన వెండి ధరలు.. ప్రధాన నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయంటే?