Shocking: భార్యకు గుండు కొట్టించిన భర్త.. కారణం తెలిస్తే ముఖంపై ఉమ్మేస్తారు..!

ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో దారుణం చోటు చేసుకుంది. స్నేహితులతో గడిపేందుకు నిరాకరించిందనే కారణంతో.. భార్యకు గుండు కొట్టించాడు భర్త. ఈ ఘటన లిసాడి గేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో

Shocking: భార్యకు గుండు కొట్టించిన భర్త.. కారణం తెలిస్తే ముఖంపై ఉమ్మేస్తారు..!
Wife And Husband
Follow us

|

Updated on: Feb 08, 2023 | 7:03 AM

ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో దారుణం చోటు చేసుకుంది. స్నేహితులతో గడిపేందుకు నిరాకరించిందనే కారణంతో.. భార్యకు గుండు కొట్టించాడు భర్త. ఈ ఘటన లిసాడి గేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. అలీషా, షరీక్ దంపతులు. షరీక్ రోజూ తాగి వచ్చేవాడు. ఈ క్రమంలో తాజాగా మద్యం మత్తులో తన స్నేహితులను ఇంటికి తీసుకువచ్చి.. వారితో వ్యభిచారం చేయాలని భార్యపై ఒత్తిడి చేశాడు. దానికి ఆమె నిరాకరించింది. దాంతో తీవ్ర ఆగ్రహానికి గురైన షరీక్.. భార్యకు కూల్‌డ్రింక్‌లో మత్తుమందు ఇచ్చాడు. అనంతరం ఆమె స్పృహతప్పగానే గుండు కొట్టించాడు.

అలీషా స్పృహలోకి వచ్చి చూడగా.. తన జుట్టును కట్ చేసినట్లు గుర్తించి షాక్ అయ్యింది. భర్త చేసిన నిర్వాకానికి ఆగ్రహానికి గురైన అలీష్.. నేరుగా పోలీసులను ఆశ్రయించి. భర్త షరీక్ అరాచకాలపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కట్నం గురించి వేధించడమే కాకుండా, తనను వేరే వ్యక్తులతో వ్యభిచారం చేయాలని ఒత్తిడి చేస్తున్నాడని, అందుకు ఒప్పుకోకపోవడంతో గుండు కొట్టించాడని ఫిర్యాదులో పేర్కొంది అలీషా. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు.

5 నెలల క్రితమే పెళ్లి..

వీరిద్దరికీ 5 నెలల క్రితమే వివాహం జరిగింది. అయితే, కట్నం తీసుకురావాలని అలీషా పై భర్త షరీక్ ఒత్తిడి తీసుకువచ్చాడు. ఈ క్రమంలోనే నిత్యం వేధించేవాడని చెప్పింది బాధితురాలు. తన భర్తకు డ్రగ్స్ కూడా తీసుకుంటాడని ఫిర్యాదులో పేర్కొంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. ఆమె భర్త షరీక్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఆమె అత్తమామ, అలీషా పై బలవంతం చేయబోయిన షరీక్ స్నేహితులను కూడా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..