AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shraddha Case: శ్రద్ధావాకర్ కేసులో భయంకర నిజాలు.. ఆఫ్తాబ్‌కు ఢిల్లీ నుంచి దుబాయ్ వరకూ గాళ్ ఫ్రెండ్స్

దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైన శ్రద్ధావాకర్ హత్య కేసుపై ఛార్జ్ షీట్ విడుదల చేశారు పోలీసులు. ఆమెను హతమార్చడం నుంచి తర్వాత ఏమేం జరిగిందో.. ప్రతిదీ తన ఛార్జ్ షీట్ లో పేర్కొన్నారు పోలీసులు

Shraddha Case: శ్రద్ధావాకర్ కేసులో భయంకర నిజాలు.. ఆఫ్తాబ్‌కు ఢిల్లీ నుంచి దుబాయ్ వరకూ గాళ్ ఫ్రెండ్స్
Shradha Walker Case
Surya Kala
|

Updated on: Feb 08, 2023 | 6:47 AM

Share

ఢిల్లీ సంచలన ఫ్రిజ్ హత్య కేసుకు సంబంధించి 6, 600 పేజీల ఛార్జిషీట్ వెలువడింది. ఈ ఛార్జ్ షీట్ ద్వారా ఎన్నో విషయాలను వెలుగులోకి తెచ్చారు పోలీసులు. మే 18న శ్రద్ధను చంపిన తర్వాత ఆఫ్తాబ్ జొమాటో నుంచి ఫుడ్ ఆర్డర్ తెప్పించి తిన్నాడని పేర్కొంది ఛార్జ్ షీట్. శ్రద్ధా- ఆఫ్తాబ్ గతేడాది మేలో ఢిల్లీ వెళ్లారు. అప్పటికి వారిద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఇద్దరూ అనేక సమస్యలపై తగవులాడుకుంటున్నారు. విపరీతమైన ఖర్చులు, అతడి స్నేహితురాళ్లు ఇవే వారి గొడవలకు కారణం. మరీ ముఖ్యంగా ఆఫ్తాబ్ కు ఢిల్లీ నుంచి దుబాయ్ వరకూ గాళ్ ఫ్రెండ్స్ ఉన్నట్టు వివరించింది ఛార్జ్ షీట్.

మే 18న ఇద్దరూ ముంబై వెళ్లాలని ప్లాన్ వేసుకున్నారు. ఇంతలో ఆఫ్తాబ్ టికెట్ క్యాన్సిల్ చేసుకున్నాడు. తర్వాత ఇద్దరి మధ్య పెద్ద గొడవే జరిగింది. క్షణికావేశంలో అతడు ఆమె గొంతు కోసి చంపేసినట్టు రాసింది ఛార్జ్ షీట్. శ్రద్ధను చంపాక.. ప్లాస్టిక్ సంచిలో డెడ్ బాడీని ప్యాక్ చేసి పారేయాలని నిర్ణయించాడు ఆఫ్తాబ్. ఇందుకోసం ఒక బ్యాగ్ కూడా కొన్నాడు. కానీ పోలీసులు వెంటనే పట్టుకుంటారని భావించి.. ఆ ప్లాన్ ఛేంజ్ చేశాడు. ఫైనల్ గా ఆమె మృతదేహాన్ని ముక్కలు చేయడానికే డిసైడ్ అయ్యాడు ఆఫ్తాబ్. డెడ్ బాడీ కట్ చేయడానికి.. ఒక రంపం, సుత్తి, మూడు కత్తులుకొన్నాడు. వేళ్లు వేరు చేయడానికి బ్లో టార్చ్ సైతం ఉపయోగించాడని గుర్తించారు పోలీసులు.

శ్రద్ధ డెడ్ బాడీని మొత్తం 35 ముక్కలుగా నరికి.. ఫ్రిజ్ లో ఉంచాడు. తన గాళ్ ఫ్రెండ్ ఎవరైనా వస్తే.. ఈ ముక్కలను ఫ్రిజ్ లోంచి బయటకు తీసి వంటగదిలో ఉంచేవాడని వివరించింది ఛార్జ్ షీట్. ఆఫ్తాబ్ శ్రద్ధావాకర్ సెల్ ఫోన్ తన దగ్గరే ఉంచుకున్నాడు. మే 18 తర్వాత అతడి ఫోన్ నుంచే ఆమె అకౌంట్ నడుస్తున్నట్టు వెల్లడయింది. ఆ తర్వాత ముంబైలో ఆమె లిప్ స్టిక్ తో పాటు సెల్ ఫోన్ కూడా పారేసినట్టు పేర్కొంది ఛార్జ్ షీట్.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..