World’s Brightest Student: ప్రపంచంలోనే అత్యంత తెలివైన విద్యార్థినిగా భారత సంతతి చిన్నారి..

వరల్డ్‌ బ్రైటెస్ట్‌ స్టూడెంట్స్‌ జాబితాలో వరుసగా రెండోసారి చోటుదక్కించుకుంది ఇండో అమెరికన్ స్టూడెంట్. వెర్బల్‌, క్వాంటిటేటివ్‌ విభాగాల్లో 90 శాతం స్కోర్‌ చేసి..

World’s Brightest Student: ప్రపంచంలోనే అత్యంత తెలివైన విద్యార్థినిగా భారత సంతతి చిన్నారి..
World's Brightest Student
Follow us

|

Updated on: Feb 08, 2023 | 6:29 AM

వరల్డ్‌ బ్రైటెస్ట్‌ స్టూడెంట్స్‌ జాబితాలో వరుసగా రెండోసారి చోటుదక్కించుకుంది ఇండో అమెరికన్ స్టూడెంట్. వెర్బల్‌, క్వాంటిటేటివ్‌ విభాగాల్లో 90 శాతం స్కోర్‌ చేసి.. అరుదైన రికార్డు సాధించింది. ప్రపంచంలోనే అత్యంత తెలివైన విద్యార్థినిగా ఘనత సాధించింది ఇండో అమెరికన్‌ బాలిక పెరియనాయగమ్ నటషా. వరల్డ్‌ బ్రైటెస్ట్‌ స్టూడెంట్స్‌ జాబితాలో చోటుదక్కించుకుంది. వరుసగా రెండో ఏడాది నటషా ఈ జాబితాలో చోటు సంపాదించింది. మెరికాలోని జాన్స్‌ హాప్‌కిన్స్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన పరీక్షలో అందరికంటే ఎక్కువ మార్కులు సాధించింది. ప్రపంచ వ్యాప్తంగా 76 దేశాల నుంచి 15,300కి పైగా విద్యార్థులు ఈ పోటీ పరీక్షల్లో పాల్గొనగా కేవలం 27శాతం కంటే తక్కువ మంది మాత్రమే అర్హత సాధించారు. అందులో నటాషా ప్రథమ స్థానంలో నిలిచింది.

అప్పటికి ఐదో గ్రేడ్‌ చదువుతున్న నటసా.. ఎయిత్ క్లాస్ స్టూడెంట్ స్థాయి ప్రతిభ చూపింది. వెర్బల్‌, క్వాంటిటేటివ్‌ విభాగాల్లో 90 శాతం స్కోర్‌ చేసింది. అరుదైన రికార్డు సాధించింది. పెరియనాయగం నటషా న్యూ జెర్సీలోని ఫ్లోరెన్స్‌ ఎం గౌడినీర్‌ మిడిల్‌ స్కూల్‌లో చదువుతుంది. ‘ప్రపంచ వ్యాప్తంగా అత్యంత చురుకైన విద్యార్థులను, తమ వయస్సు కంటే ఎక్కువ తెలివితేటలు కలిగిన వారిని వెలికి తీసేందుకు సీటీవై ప్రతి ఏడాదీ విభిన్న పరీక్షలు నిర్వహిస్తుంది. న్యూజెర్సీలోని ఫ్లోరెన్స్‌ స్కూల్‌లో చదువుతున్న నటాషా 2021లో నిర్వహించిన పరీక్షల్లోనూ పాల్గొని తన ప్రతిభ చాటింది. చెన్నై నుంచి అమెరికాకు వలస వెళ్లారు పెరియనాయగం పేరెంట్స్. డూడ్లింగ్‌ను ప్రేమిండమే కాక, ఖాళీ సమయాల్లో జేఆర్‌ఆర్‌ టోల్కిన్స్‌ నవలలు కూడా నటషాక చదువుతుందని ఆమె పేరెంట్స్‌ చెప్పారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..