Farmers Protest: ఆగ్రహంతో రెచ్చిపోయిన రైతులు.. నడిరోడ్డుపై ఎమ్మెల్యే బట్టలు చింపి చితకబాదారు..

Farmers Protest: రైతు ఉద్యమానికి వ్యతిరేకంగా కామెంట్స్ చేసిన బీజేపీ ఎమ్మెల్యేకు పంజాబ్ రైతులు దేహ శుద్ధి చేశారు. నడిరోడ్డుపై..

Farmers Protest: ఆగ్రహంతో రెచ్చిపోయిన రైతులు.. నడిరోడ్డుపై ఎమ్మెల్యే బట్టలు చింపి చితకబాదారు..
Mla
Follow us
Shiva Prajapati

|

Updated on: Mar 28, 2021 | 5:44 AM

Farmers Protest: రైతు ఉద్యమానికి వ్యతిరేకంగా కామెంట్స్ చేసిన బీజేపీ ఎమ్మెల్యేకు పంజాబ్ రైతులు దేహ శుద్ధి చేశారు. నడిరోడ్డుపై బట్టలు చించి, ముఖంసై ఇంక్ చల్లి చితకబాదారు. పోలీసులు ఎంటరైనా ఏమాత్రం తగ్గలేదు. దొరకబుచ్చుకుని మరీ కొట్టారు. బీజేపీ నేత, అబోహర్ ఎమ్మెల్యే అరుణ్ నారంగ్‌ శనివారం నాడు పంజాబ్‌లోని మాలోట్ నగరంలో గల బీజేపీ కార్యాలయం వద్ద విలేకరుల సమావేశం నిర్వహించారు. రైతు చట్టాలకు మద్ధతుగా, రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కామెంట్స చేశారు. అది చూసిన రైతులు నేరుగా బీజేపీ కార్యాలయం వద్దకు వచ్చారు. అరుణ్ నారంగ్‌పై గుర్రుగా రైతులు.. ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. అతని బట్టలను చించేశారు. ముఖంపై ఇంక్ జల్లారు. మసి పూసారు. అతని కారును కూడా ధ్వంసం చేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. ఆందోళనకారులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ వారు కంట్రోల్ కాకపోవడంతో ఎమ్మెల్యేను పక్కనే ఉన్న ఓ దుకాణంలోకి తీసుకెళ్లారు.

కాసేపటి తరువాత నారంగ్ దుకాణం నుంచి బయటకు రాగా.. అక్కడే ఉన్న రైతులు మళ్లీ అతనిపై దాడి చేశారు. ఇష్టారీతిన కొట్టారు. ఎమ్మెల్యేతో పాటు.. మరికొంతమంది బీజేపీ నేతలపైనా దాడికి పాల్పడ్డారు రైతులు. బీజేపీ కార్యాలయంలోకి దూసుకెళ్లిన రైతులు.. పార్టీ జెండాలను, ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. మళ్లీ పోలీసులు ఎమ్మెల్యేను పక్కన ఉన్న షాపులోకి తీసుకెళ్లారు. అక్కడి నుంచి వేరే మార్గం గుండా సురక్షిత ప్రదేశానికి తరలించారు. ఈ ఘర్షణలో పలువురు పోలీసులకు కూడా గాయాలైనట్లు తెలుస్తోంది. కాగా, సుమారు గంటసేపు ఈ గొడవ జరిగింది. ఈ ఘర్షణతో బీజేపీ నాయకులు తమ ప్రెస్‌మీట్‌ని క్యాన్సెల్ చేసుకుని వెళ్లిపోయారు. ఇదిలాఉంటే.. ఎమ్మెల్యేపై దాడి ఘటనకు సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇక ఈ దాడిని పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ తీవ్రంగా ఖండించారు. ఇలాంటి దాడులు ఉపేక్షించేది లేదని..ఎమ్మెల్యేపై దాడి చేసిన వారిని అరెస్ట్ చేసి, కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆయన ఆదేశించారు. ఇక బీజేపీ శ్రేణులు కూడా ఈ దాడిపై తీవ్రంగా స్పందించారు. రైతుల ముసుగులో కాంగ్రెస్ నేతలు ఈ దాడికి పాల్పడ్డారని ఆరోపణలు గుప్పిస్తున్నారు. దాడికి పాల్పడిన వారిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతరేకంగా రైతులు గత కొంతకాలంగా ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు ఢిల్లీ సరిహద్దు ప్రాంతాలపైన టిక్రీ, సింఘూ, ఘజియాబాద్‌లో గుడారాలు ఏర్పాటు చేసుకొని నిరసనలు కొనసాగిస్తున్నారు. కాగా, కేంద్రం తీరును నిరసిస్తూ శుక్రవారం నాడు రైతులు భారత్‌ బంద్‌కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.

Also read:

Knife in Chest: ఏడాదిన్నర కాలంగా ఛాతిలో కత్తి.. ఉద్యోగం కోసం వెళితే వెలుగులోకి షాకింగ్ విషయం..

Kurnool Airport: కర్నూలు ప్రజల కల సాకారమైంది.. ఓర్వకల్లు ఎయిర్‌పోర్టు నుంచి తొలి విమాన సర్వీస్ నేటి నుంచే ప్రారంభం..