Watch Video: ఆసుపత్రిలో డీన్‌తో టాయ్‌లెట్‌ శుభ్రం చేయించిన ఎంపీ.. వీడియో వైరల్

మహారాష్ట్రలోని శంకర్ రావ్ చవాన్ ప్రభుత్వ ఆసుపత్రిలో కేవలం 48 గంటల్లోనే 31 మంది మృత్యువాతపడిన ఘటన దేశవ్యాప్తంగా దుమారం రేపిన సంగతి తెలిసిందే. దీంతో ఆ ఆసుపత్రిపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంచో ఆ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. పరిస్థితిని సమీక్షించేందుకు అక్కడికి వెళ్లిన నాందేడ్ ఎంపీ హేమంత్ పాటిల్ వెళ్లారు. ఆ ఆసుపత్రిలోని అన్ని పరిసరాలను పరిశీలించారు. అలా పరిశీలిస్తుండగా.. ఆసుపత్రిలో టాయ్‌లెట్‌ అపరిశుభ్రంగా ఉండటాన్ని ఆయన గమనించారు. దీంతో ఎంపీ హేమంత్ ఆసుపత్రి డీన్ శ్యామ్‌రావ్ వకోడాతో శుభ్రం చేయించారు.

Watch Video: ఆసుపత్రిలో డీన్‌తో టాయ్‌లెట్‌ శుభ్రం చేయించిన ఎంపీ.. వీడియో వైరల్
Toilet Cleaning
Follow us

|

Updated on: Oct 03, 2023 | 9:30 PM

మహారాష్ట్రలోని శంకర్ రావ్ చవాన్ ప్రభుత్వ ఆసుపత్రిలో కేవలం 48 గంటల్లోనే 31 మంది మృత్యువాతపడిన ఘటన దేశవ్యాప్తంగా దుమారం రేపిన సంగతి తెలిసిందే. దీంతో ఆ ఆసుపత్రిపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంచో ఆ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. పరిస్థితిని సమీక్షించేందుకు అక్కడికి వెళ్లిన నాందేడ్ ఎంపీ హేమంత్ పాటిల్ వెళ్లారు. ఆ ఆసుపత్రిలోని అన్ని పరిసరాలను పరిశీలించారు. అలా పరిశీలిస్తుండగా.. ఆసుపత్రిలో టాయ్‌లెట్‌ అపరిశుభ్రంగా ఉండటాన్ని ఆయన గమనించారు. దీంతో ఎంపీ హేమంత్ ఆసుపత్రి డీన్ శ్యామ్‌రావ్ వకోడాతో శుభ్రం చేయించారు. ఇలా ఏకంగా డీన్‌తోనే శుభ్రం చేయించడం చర్చనీయాంశమైంది. ఇక వివరాల్లోకి వెళ్తే.. మహారాష్ట్రలోని శంకర్ రావ్ ప్రభుత్వ ఆసుపత్రిలో మరణాలు దేశవ్యాప్తంగా సంచలనం రేపాయి. సోమవారం నాటికి 24గా ఉన్న మృతుల సంఖ్య కేవలం మరో 24 గంటల వ్యవధిలోనే 31కి చేరింది.

అయితే వీరిలో చిన్నారులు కూడా ఉండటంతో పరిస్థితులు ఆందోళనకరంగా మారాయి. దీనివల్ల మరో 71 మంది పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆసుపత్రి వర్గాలు తమ స్పందనను తెలియజేశాయి. ఇదిలా ఉండగా.. ఆసుపత్రి డీన్ వకోడా మాట్లాడుతూ ఆసుపత్రిలో వైద్య సదుపాయాలు కొరవడటం అలాగే ఆసుపత్రి వర్గాల నిర్లక్ష్యం చేయడం వల్లే మరణాలు జరిగాయనే విమర్శల రావడాన్ని ఆయన కొట్టిపారేశారు. అంతేకాదు రోగులకు సరైన వైద్యమే అందిస్తున్నామని కానీ వాళ్లే వైద్యానికి స్పందించలేదని ఆయన అన్నారు. అలాగే మరోవైపు ప్రతిపక్షాలు సైతం అధికార కూటమిపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. దీంతో షిండే ప్రభుత్వం దీన్ని చాలా సీరియస్‌గా తీసుకుంది.

ఇవి కూడా చదవండి

దీంతో వెంటనే షిండే వర్గానికి చెందిన ఎంపీ హేమంత్ పాటిల్ వెంటనే శంకర్ రావ్ చవాన్ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి బాధిత కుటుంబాలను పరామర్శించారు. అలాగే ఆసుపత్రిలో తనిఖీలు నిర్వహించి పరిసరాల్లో తనిఖీలు చేశారు. అయితే అక్కడి టాయ్‌లెట్‌ అత్యంత అపరిశుభ్రంగా ఉండటం గమనించారు. దీంతో వెంటనే ఆసుపత్రి డీన్‌ను పిలిపించారు. ఆ తర్వాత ఆయనతోనే ఆ టాయ్‌లెట్‌ను శుభ్రం చేయించారు. అలాగే ఎంపీ కూడా అక్కడే ఉండి నీళ్ళపైపుతో నీళ్లు వేశారు. అయితే ఈ వీడియో ప్రస్తుతం ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. మరోవైపు ఆసుపత్రిలో మరణాలపై విచారణ చేసేందుకు కమిటీని నియమించినట్లు వైద్య, విద్య పరిశోధన డైరెక్టర్ డాక్టర్ దిలీప్ మైసెఖర్ స్పష్టం చేశారు.

ఏపీకి దూసుకొస్తున్న మిచౌంగ్‌ తుఫాన్‌.! ఏడో ప్రమాద హెచ్చరిక.
ఏపీకి దూసుకొస్తున్న మిచౌంగ్‌ తుఫాన్‌.! ఏడో ప్రమాద హెచ్చరిక.
నేటి రాశి ఫలాలు.. ఏ రాశి వారికి ఎలా ఉందంటే.?
నేటి రాశి ఫలాలు.. ఏ రాశి వారికి ఎలా ఉందంటే.?
జీఎస్టీ వసూళ్లలో రికార్డ్.! రూ.1.66 లక్షల కోట్లకు చేరిన వసూళ్లు..
జీఎస్టీ వసూళ్లలో రికార్డ్.! రూ.1.66 లక్షల కోట్లకు చేరిన వసూళ్లు..
ఖాన్‌ యూనిస్‌ లక్ష్యంగా ఇజ్రాయెల్‌ దాడులు 24గంటల్లో 700మంది మృతి.
ఖాన్‌ యూనిస్‌ లక్ష్యంగా ఇజ్రాయెల్‌ దాడులు 24గంటల్లో 700మంది మృతి.
తెలంగాణలో మిచౌంగ్ తుపాన్ ప్రభావం.. భారీ నుండి అతిభారీ వర్షాలు..
తెలంగాణలో మిచౌంగ్ తుపాన్ ప్రభావం.. భారీ నుండి అతిభారీ వర్షాలు..
21 వేల కి.మీ పాదయాత్ర.!ఎందుకోసమో తెలుసా.? వీడియో వైరల్.
21 వేల కి.మీ పాదయాత్ర.!ఎందుకోసమో తెలుసా.? వీడియో వైరల్.
మిగ్‌ జాం తుపాను తో చెన్నై అతలాకుతలం!
మిగ్‌ జాం తుపాను తో చెన్నై అతలాకుతలం!
దక్షిణకోస్తాకు ముప్పు! తీరం దాటే సమయంలో సముద్రంలో ఎగసిపడనున్నఅలలు
దక్షిణకోస్తాకు ముప్పు! తీరం దాటే సమయంలో సముద్రంలో ఎగసిపడనున్నఅలలు
చికెన్‌ బిర్యానీ ఆర్డర్‌ చేస్తే.. బల్లి బిర్యానీ వచ్చింది! వీడియో
చికెన్‌ బిర్యానీ ఆర్డర్‌ చేస్తే.. బల్లి బిర్యానీ వచ్చింది! వీడియో
మరో యోగి రెడీ అవుతున్నారా.? రాజస్థాన్‌ లో బాబాబాలక్‌నాథ్‌.
మరో యోగి రెడీ అవుతున్నారా.? రాజస్థాన్‌ లో బాబాబాలక్‌నాథ్‌.