రేయ్.. ఏంట్రా ఇది.. ఎక్కడ్నుంచి వచ్చార్రా మీరంతా.. వైరల్ ఫోటోపై నెట్టింట పేలుతోన్న జోక్స్

తమిళనాడులోని శ్రీపెరంబుదూర్‌లోని కార్యాలయ భవనంలో ఒకే బాత్రూంలో నిర్మించిన రెండు కమోడ్‌ల దృశ్యాలు సోషల్ మీడియాలో జోక్‌గా మారాయి. మీరూ ఓ లుక్కేయండి

రేయ్.. ఏంట్రా ఇది.. ఎక్కడ్నుంచి వచ్చార్రా మీరంతా.. వైరల్ ఫోటోపై నెట్టింట పేలుతోన్న జోక్స్
Two commodes inside one bathroom
Follow us
Ram Naramaneni

|

Updated on: Oct 12, 2022 | 7:13 AM

బిల్డింగ్ అన్నాక బాత్ రూమ్ ఉండటం సాధారణం. ఒక్కో టాయిలెట్‌లో ఒక్కో కమోడ్ ఏర్పాటు చేయడం కామన్. కానీ ఇక్కడ ఓ ఆఫీసులో టాయిలెట్ నిర్మాణం చూస్తే ఎవరైనా ఖంగుతినాల్సిందే. వెస్ట్రన్ స్టైల్‌లో టాయిలెట్ నిర్మాణం చేశారు. కానీ ఒకే బాత్రూమ్‌లో రెండు కమోడ్‌లు ఏర్పాటు చేశారు. రెండు కమోడ్‌ల మధ్య కనీసం ఎలాంటి అడ్డుగోడ లాంటి నిర్మాణం చేపట్టలేదు. బాత్రూమ్‌లోకి వచ్చే ఎంట్రీ పాయింట్ కూడా ఒకటే ఉంది. శ్రీపెరంబదూర్‌లోని సిప్కట్ పరిశ్రమలకి సంబంధించిన ప్రాజెక్ట్ ఆఫీస్‌ ఇది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 2 రోజుల క్రితమే సీఎం స్టాలిన్ ఈ బిల్డింగ్‌ను ప్రారంభించారు. స్థానిక ఎమ్మెల్యే దగ్గరుండి మరీ ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.

కోటీ 88 లక్షలతో నిర్మించిన ఈ బిల్డింగ్‌లో అడుగడుగునా లోపాలే. పూర్తిగా నాసిరకంతో గోడలు నిర్మించడంతో ఎక్కడిక్కడ విరిగిపోయాయి. బిల్డింగ్‌లో టాయిలెట్స్ కూడా నాసిరకంగానే నిర్మాణం జరిగింది. ఇది చూసిన నెటిజెన్లు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ భవన నిర్మాణంలో ఉన్న లోపాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో గడువులోగా పనులు పూర్తి చేసినట్లు చూపేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతనెలలో కోయింబత్తుర్‌లో కూడా ఇదే తరహాలో ప్రభుత్వ పాఠశాలలో నిర్మాణం జరిగింది. ఇప్పుడు శ్రీ పెరంబదూర్‌లో ఇలాంటి ఘటన రిపీట్ అయింది.

ఇక ఇలాంటి ఫోటోలు దొరికితే మీమ్ రాజాలు వదులుతారా చెప్పండి. తమ మార్క్ క్రియేటివిటీతో చెలరేగిపోతున్నారు. ప్రజంట్ తమిళ సోషల్ మీడియా పేజీలు అన్నింటిలో ఈ ఫోటో చక్కర్లు కొడుతుంది. కొత్త ఆవిష్కరణను అభినందించకుండా, తిడతారేంటి అని ఒక నెటిజన్ సరదాగా కామెంట్ పెట్టాడు. ఇలాంటి పని చేసిన వ్యక్తికి ఒక కమోడ్ గిఫ్ట్‌గా ఇవ్వాలని మరొకరు వ్యాఖ్యానించారు. చూడండి.. మతి లేకుండా చేసే పనలు ఎంతటి అనర్థాలను తీసుకొస్తాయో..!

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం చూడండి..