AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Price Today: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. వరుసగా రెండో రోజు తగ్గిన బంగారం, వెండి ధరలు

హైదరాబాలో 22 క్యారెట్ల బంగారం ధర చూసుకుంటే మంగళవారం ధరతో పోలిస్తే బుధవారం బంగారం ధరలో రూ.70 తగ్గుదల కనిపించింది. గ్రాము బంగారం ధర బుధవారం రూ.4,690గా ఉండగా, పది గ్రాముల బంగారం ధర రూ.46,900గా ఉంది. 24 క్యారెట్ల బంగారం..

Gold Price Today: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. వరుసగా రెండో రోజు తగ్గిన బంగారం, వెండి ధరలు
Gold And Silver Today
Amarnadh Daneti
|

Updated on: Oct 12, 2022 | 6:51 AM

Share

వరుసగా రెండో రోజు కూడా బంగారం, వెండి ధరలు తగ్గాయి. ముందురోజుతో పోలిస్తే దాదాపు 22, 24 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు సుమారు రూ.70వరకు తగ్గుదల కనిపించింది. మంగళవారం, బుధవారం కలిపి దాదాపు గ్రాముకు బంగారం ధర రూ.90 తగ్గినట్లయింది. బంగారం కొనాలనుకునే వారు ఎప్పుడు ధర దిగివస్తుందా అని ఎదురుచూస్తూ ఉంటారు. ధర తగ్గినప్పుడు పసిడి కొనుగోలు చేయాలని చాలా మంది భావిస్తుంటారు. భవిష్యత్తులో ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా.. మన దగ్గర ఉన్న బంగారమే మన ఆస్తి అవుతుందని చాలా మంది పేద, మధ్య తరగతి ప్రజలు సైతం బంగారం కొనేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. అదే కొంత ఉన్నత వర్గాలకు, ధనిక కుటుంబాలకు చెందిన వారైతే.. మార్కెట్లోకి వచ్చే నూతన మోడల్స్ ను కొనుగోలు.. ఆ ఆభరణాలతో తమను అలంకరించుకుంటారు. ముఖ్యంగా పేద, మధ్య తరగతి ప్రజలు బంగారం కొనేటప్పుడు చూసేది ధర, గతంలో ధర ఎలా ఉంది, భవిష్యత్తులో తగ్గుతుందా, పెరుగుతుందా అని ఆలోచిస్తూ ఉంటారు. ఇలా గత కొద్దిరోజులుగా బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూసి పెరిగితే కొద్ది రోజులు ఆగుదామని, ధర కొంత తగ్గుదల కొనిపిస్తే వెంటనే కొనుగోలు చేయడం చేస్తుంటారు. మరి ఈరోజు (12అక్టోబర్ 2022) బంగారం, వెండి ధరలు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలతో సహా, దేశంలోని ప్రధాన నగరాల్లో ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం.

బంగారం ధరలు ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ పరిస్థితుల్లో మార్పు, సెంట్రల్ బ్యాంక్ గోల్డ్ రిజర్వ్, వడ్డీ రేట్లలో హెచ్చుతగ్గులు, నగల మార్కెట్‌లతో సహా అనేక పరిణామాల ప్రభావం బంగారం, వెండి ధరలపై ఆధారపడి ఉంటాయి. అక్టోబర్ 11వ తేదీ మంగళవారంతో పోలిస్తే అక్టోబర్ 12వ తేదీ బుధవారం బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి.

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర

హైదరాబాలో 22 క్యారెట్ల బంగారం ధర చూసుకుంటే మంగళవారం ధరతో పోలిస్తే బుధవారం బంగారం ధరలో రూ.70 తగ్గుదల కనిపించింది. గ్రాము బంగారం ధర బుధవారం రూ.4,690గా ఉండగా, పది గ్రాముల బంగారం ధర రూ.46,900గా ఉంది. 24 క్యారెట్ల బంగారం కూడా మంగళవారంతో పోలిస్తే బుధవారం ధర గ్రాముకు రూ.77 మేర తగ్గింది. గ్రాము బంగారం ధర 5,116గా ఉండగా, పది గ్రాముల బంగారం ధర రూ.51,160గా ఉంది. ఇవే ధరలు తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన నగరాలైన విజయవాడ, విశాఖ పట్నంతో పాటు తెలంగాణలోని వరంగల్ లో కూడా కొనసాగుతున్నాయి.

వివిధ నగరాలలో బంగారం ధరలు

దేశ రాజధాని ఢిల్లీలో కూడా 22, 24 క్యారెట్ల బంగారానికి సంబంధించి మంగళవారంతో పోలిస్తే బుధవారం తగ్గుదల ఉంది. 22 క్యారెట్ల గ్రాము బంగారం ధర రూ. 4,705గా ఉంది. పది గ్రాముల బంగారం ధర రూ.47,050గా ఉంది. 24 క్యారెట్ల బంగారం గ్రాము ధర ఢిల్లీలో రూ.5,133గా ఉంది. అదే పది గ్రాముల బంగారం అయితే రూ.51,330గా ఉంది.

దేశ ఆర్ధిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర ఈరోజు (బధవారం) రూ.4,690గా ఉంది. అదే పది గ్రాముల బంగారం ధర రూ.46,900గా ఉంది. ప్యూర్ గోల్డ్ 24 క్యారెట్ల బంగారం గ్రాము ధర రూ.5,116గా ఉంది. పది గ్రాముల బంగారం ధర రూ.51,160గా ఉంది.

దేశంలో అన్ని ప్రధాన నగరాల్లో కంటే చెన్నైలో పసిడి ధరలు అధికంగా ఉన్నాయి. బుధవారం (అక్టోబర్12) గ్రాము బంగారం ధర రూ. 4,740గా ఉండగా, పది గ్రాముల బంగారం ధర చెన్నైలో రూ.47,400గా ఉంది. అదే 24 క్యారెట్ల బంగారం అయితే మంగళవారంతో పోలిస్తే బుధవారం గ్రాము బంగారం ధర రూ.71 తగ్గింది. దీంతో గ్రాము బంగారం ధర రూ.5,171కు చేరుకోగా, పది గ్రాముల బంగారం ధర రూ.51,710గా ఉంది.

దేశంలో వెండి ధరలు

దేశీయంగా పసిడి ధరల్లో స్వల్ప తగ్గుదల కనిపించగా.. వెండి ధర కూడా స్వల్పంగా తగ్గింది. మన దేశంలో పెళ్లిళ్లు, ఫంక్షన్లు, పూజలు వంటి సమయంలో వెండి వస్తువుల ఖరీదుకి ఆసక్తిని చూపిస్తారు. ప్రస్తుతం పండగల సీజన్ కావడంతో వెండి వస్తువులను కొనుగోలు చేయడానికి మరింత ఆసక్తిని చూపిస్తారు. మంగళవారం ధరలతో పోలిస్తే బుధవారం వెండి ధర కిలోకు రూ.800 తగ్గింది. దీంతో హైదరాబాద్ సహా తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన విజయవాడ, విశాఖపట్టణంతో పాటు తెలంగాణలోని వరంగల్ నగరాల్లో నేడు వెండి ధర కిలో రూ.64,000గా ఉంది. వెండి ధర మంగళవారం, బుధవారాల్లో కలిపి కిలోకు దాదాపు రూ.2000 తగ్గింది.

Note: పైన పేర్కొన్న బంగారం ధరలు GST, TCS వంటివి కలిపిన ధరలు కావు.. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల వ్యాపారిని సంప్రదించాల్సి ఉంటుంది. ఈ పసిడి వెండి ధరలు.. ఈ రొజు ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు. అయితే ఈ ధరలలో హెక్చుతగ్గులు స్థానిక పరిస్థితిని బట్టి కూడా ఏర్పడవచ్చు. కొనుగోలు దారులు ఈ విషయాన్నీ గమనించాల్సి ఉంటుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం చూడండి..

Follow Us
ముంబైపై ఘన విజయం.. ప్లేఆఫ్ రేస్‌లోకి కేకేఆర్ ఎంట్రీ..!
ముంబైపై ఘన విజయం.. ప్లేఆఫ్ రేస్‌లోకి కేకేఆర్ ఎంట్రీ..!
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..