PM Modi: నీట్ పరీక్షలపై స్పందించిన IMA.. పీఎం మోదీ, కేంద్ర మంత్రులకు బహిరంగ లేఖ..

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అభినందించింది. నీట్ పరీక్షలు రద్దు చేసి తిరిగి నిర్వహించినందుకు దేశ ప్రధానితో సహా కేంద్ర మంత్రుల బృందానికి కృతజ్ఙతలు తెలిపింది. దేశంలో తలెత్తిన నీట్ అండర్ గ్రాడ్యూయేషన్ పరీక్ష వివాదంపై సత్వరమే స్పందించి ఆ సమస్యను పరిష్కరించినందుకు ధన్యావాదాలు తెలిపింది. అందుకు సంబంధిత శాఖ మంత్రి ధర్మేంద్రప్రధాన్‎ను కూడా ఐఎంఏ అభినందించింది.

PM Modi: నీట్ పరీక్షలపై స్పందించిన IMA.. పీఎం మోదీ, కేంద్ర మంత్రులకు బహిరంగ లేఖ..
Pm Modi
Follow us
Srikar T

|

Updated on: Jun 23, 2024 | 7:29 PM

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అభినందించింది. నీట్ పరీక్షలు రద్దు చేసి తిరిగి నిర్వహించినందుకు దేశ ప్రధానితో సహా కేంద్ర మంత్రుల బృందానికి కృతజ్ఙతలు తెలిపింది. దేశంలో తలెత్తిన నీట్ అండర్ గ్రాడ్యూయేషన్ పరీక్ష వివాదంపై సత్వరమే స్పందించి ఆ సమస్యను పరిష్కరించినందుకు ధన్యావాదాలు తెలిపింది. అందుకు సంబంధిత శాఖ మంత్రి ధర్మేంద్రప్రధాన్‎ను కూడా ఐఎంఏ అభినందించింది. నీట్ పరీక్షకు సంబంధించిన వివాదాన్ని తీవ్రతరం కాకుండా, ఆందోళనలను విరమించేందుకు దోహదపడే నిర్ణయాలు తీసుకున్నాందుకు ఒక లేఖలే సందేశాన్ని పంపించింది. అందులో కొన్ని కీలక విషయాలను పొందుపరిచింది. నీట్ పరీక్షల్లో జరిగిన అక్రమాలపై సమగ్ర దర్యాప్తు కోరుతూ సీబీఐని ఆదేశించినందుకు కేంద్ర విద్యాశాఖ మంత్రిత్వ శాఖకు కృతజ్ఙతలు తెలిపింది.

ఇప్పటికే పాత NTA డైరెక్టర్ జనరల్‌ను తొలగించి, కొత్త డైరెక్టర్ జనరల్‌గా శ్రీ ప్రదీప్ కుమార్ ఖరోకాకు అదనపు బాధ్యతను అప్పగించినందుకు కేంద్ర ప్రభుత్వాన్ని అభినందించింది. పోటీ పరీక్షల్లో అక్రమాలకు తావులేకుండా కేంద్ర ప్రభుత్వం స్పందించిన తీరును ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కొనియాడింది. అందుకు సంబంధించిన చట్టాలు కూడా కఠినతరం చేయాలని కోరింది. ఇలాంటి పోటీ పరీక్షల్లో అక్రమాలకు పాల్పడి నేరస్తులుగా రుజువైతే గరిష్టంగా 10 సంవత్సరాల జైలు శిక్ష, కనీసం రూ. 1 కోటి జరిమాన విధించాలని సూచించింది. ప్రస్తుత విద్యార్థుల భారతదేశ భవిష్యత్తును పరిగణలోకి తీసుకుని ముఖ్యమైన పోటీ పరీక్షలను అత్యంత శ్రద్ధతో, గోప్యతతో నిర్వహించడం చాలా కీలకమని పేర్కొంది. IMA ప్రభుత్వ నిర్ణయాలను స్వాగతించడమే కాకుండా, సమయానుకూలమైన వాటిపై తీసుకునే గొప్ప నిర్ణయాలను అభినందిస్తుందని ఈ లేఖలో పేర్కొంది. మెడికల్, డెంటల్ కోర్సులతో పాటు ఇతర కోర్సులలో ప్రవేశానికి కౌన్సెలింగ్ సకాలంలో ప్రారంభమయ్యేలా ప్రభుత్వం త్వరితగతిన చర్యలు తీసుకోవాలని తాము కోరుతున్నట్లు ఈ లేఖలో పొందుపరిచింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..