AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Illegal betting case: కాంగ్రెస్ ఎమ్మెల్యే కె.సి. వీరేంద్ర అరెస్టు..దాడుల్లో 12 కోట్ల నగదు, బంగారం-వెండి స్వాధీనం

కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే కె.సి. వీరేంద్రను మనీలాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) అరెస్టు చేసింది. అతని రహస్య స్థావరాలపై ఈడీ దాడులు చేసి కోట్ల రూపాయలను, నగదు, బంగారం, వెండి, విదేశీ కరెన్సీని స్వాధీనం చేసుకుంది. వీరేంద్ర ఈ డబ్బులను బెట్టింగ్ సైట్ల నుంచి సంపాదించినట్లు దర్యాప్తులో తేలిందని అధికారులు చెప్పారు.

Illegal betting case: కాంగ్రెస్ ఎమ్మెల్యే కె.సి. వీరేంద్ర అరెస్టు..దాడుల్లో 12 కోట్ల నగదు, బంగారం-వెండి స్వాధీనం
Congress Mla Kc Veerendra
Surya Kala
|

Updated on: Aug 23, 2025 | 3:47 PM

Share

కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే కె.సి. వీరేంద్రను శనివారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇ.డి.) అరెస్టు చేసింది. మనీలాండరింగ్ కేసులో ఎమ్మెల్యే వీరేంద్రను అరెస్టు చేశారు. శుక్రవారం, వీరేంద్రకు చెందిన అనేక ప్రదేశాలపై ఏకకాలంలో ఈడీ దాడులు చేసింది. ఈ సందర్భంగా 12 కోట్లకు పైగా నగదు, బంగారం, వెండి స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు ఒక కోటి కంటే ఎక్కువ విలువైన విదేశీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు.

బెంగళూరులోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) ఆగస్టు 22, 23 తేదీలలో దేశవ్యాప్తంగా ఒక పెద్ద ఆపరేషన్‌లో అక్రమ బెట్టింగ్, ఆన్‌లైన్ గేమింగ్ రాకెట్‌ను ఛేదించింది. ఈ కేసు కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లా ఎమ్మెల్యే కెసి వీరేంద్ర, అతని సన్నిహితులకు సంబంధించినది.

ఈ దాడిలో 12 కోట్లకు పైగా నగదు స్వాధీనం

ఇవి కూడా చదవండి

గ్యాంగ్‌టక్, చిత్రదుర్గ, బెంగళూరు, హుబ్లి, జోధ్‌పూర్, ముంబై, గోవా సహా 31 ప్రదేశాలలో ఈడీ బృందాలు ఏకకాలంలో దాడులు నిర్వహించాయని వర్గాలు తెలిపాయి. గోవాలో కూడా పప్పీస్ క్యాసినో గోల్డ్, ఓషన్ రివర్స్ క్యాసినో, పప్పీస్ క్యాసినో ప్రైడ్, ఓషన్ 7 క్యాసినో , బిగ్ డాడీ క్యాసినో అనే ఐదు పెద్ద క్యాసినోలలో ఈడీ సోదాలు నిర్వహించింది.

ఈ దాడిలో ఈడీ దాదాపు రూ.12 కోట్ల నగదును స్వాధీనం చేసుకుంది. అందులో రూ.1 కోటి విదేశీ కరెన్సీ ఉంది. అంతేకాదు రూ.6 కోట్ల విలువైన బంగారం, 10 కిలోల వెండి, నాలుగు లగ్జరీ కార్లు ఉన్నాయి. వీటితో పాటు, 17 బ్యాంకు ఖాతాలు, 2 లాకర్లను కూడా స్తంభింపజేసింది.

బెట్టింగ్ సైట్ల ద్వారా సంపాదించిన డబ్బు

ఎమ్మెల్యే వీరేంద్ర కింగ్567, రాజా567 వంటి అనేక ఆన్‌లైన్ బెట్టింగ్ సైట్‌లను నడుపుతున్నాడని దర్యాప్తులో తేలింది. అతని సోదరుడు కె.సి. తిప్పస్వామి దుబాయ్ నుంచి డైమండ్ సాఫ్టెక్, టిఆర్ఎస్ టెక్నాలజీస్, ప్రైమ్ 9 టెక్నాలజీస్ అనే మూడు కంపెనీల ద్వారా ఈ వ్యాపారాన్ని నిర్వహిస్తున్నాడు. మరో సోదరుడు కె.సి. నాగరాజ్ , అతని కుమారుడు పృథ్వీ ఎన్. రాజ్ కూడా ఈ పనిలో పాలుపంచుకున్నట్లు చెబుతున్నారు.

గ్యాంగ్‌టక్‌లో కాంగ్రెస్ ఎమ్మెల్యే అరెస్టు

ఈ దాడుల సమయంలో ED అధికారులు అనేక ముఖ్యమైన పత్రాలు, ఆధారాలను కూడా కనుగొంది. దీని ప్రకారం అక్రమ ఆదాయాన్ని వేర్వేరు విధాలుగా వైట్ మనీగా చూపించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని స్పష్టమైంది. సమాచారం ప్రకారం ఇటీవల వీరేంద్ర తన సహచరులతో కలిసి గ్యాంగ్‌టక్‌కు వెళ్లాడు. అక్కడ వారు ఒక ల్యాండ్ క్యాసినోను లీజుకు తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ సమయంలో ED సిబ్బంది అతన్ని గ్యాంగ్‌టక్ లో అరెస్టు చేసింది. శనివారం స్థానిక కోర్టులో హాజరుపరిచిన తర్వాత.. ED అధికారులు వీరెంద్రని బెంగళూరు కోర్టుకు తీసుకెళ్లడానికి ట్రాన్సిట్ రిమాండ్‌ను పొందింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..