Viral Video: అది బొమ్మకాదురయ్యా.. ఎటమటం అయిందనుకో పోతవురరేయ్… చోటుగాడి గట్స్‌కు నెటిజన్స్ షాక్!
పామును చూస్తే ఎంత లావటి మనిషికైనా ఓ పక్క వణుకుతుంది. అక్కడ పాము ఉందంటే ఇక్కడి నుంచే జారుకుంటారు. మరికొంత మంది మాత్రం పాములను చలా చాకచక్యంగా పట్టుకుంటారు. వాటి తోక పట్టుకుని ఆడిస్తారు. పెద్దవారైతే ఓకే గాని ఇక్కడో బుడతడు కూడా పామును...

పామును చూస్తే ఎంత లావటి మనిషికైనా ఓ పక్క వణుకుతుంది. అక్కడ పాము ఉందంటే ఇక్కడి నుంచే జారుకుంటారు. మరికొంత మంది మాత్రం పాములను చలా చాకచక్యంగా పట్టుకుంటారు. వాటి తోక పట్టుకుని ఆడిస్తారు. పెద్దవారైతే ఓకే గాని ఇక్కడో బుడతడు కూడా పామును పట్టుకున్న విధానం చేసి నెటిజన్స్ షాక్ అవుతున్నారు. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఇందులో ఒక చిన్న పిల్లవాడు ఎటువంటి భయం లేకుండా తన చేతులతో పామును పట్టుకోవడం కనిపిస్తుంది. ఈ వైరల్ క్లిప్ గురించి సోషల్ మీడియాలో కొత్త చర్చ ప్రారంభమైంది. కొంతమంది పిల్లవాడి ధైర్యాన్ని ప్రశంసిస్తుండగా, చాలా మంది నెటిజన్లు పిల్లవాడి తల్లిదండ్రుల నిర్లక్ష్యాన్ని ప్రశ్నిస్తున్నారు.
ఈ 33 సెకన్ల వీడియోలో ఆ పిల్లవాడు మొదట పామును పట్టుకునే సాధనంతో దాని తలను నొక్కి, ఆపై త్వరగా పాము నోటిని పట్టుకుని దాన్ని పైకి లేపడం చూడవచ్చు. వీడియోలో ఈ పిల్లవాడు పామును ఓ బొమ్మలాగా పట్టుకోవడం మీరు చూస్తారు. దీని తర్వాత పాము తన చేతిలో ఇబ్బంది పడుతుండగా అతను నవ్వుతూనే ఉన్నాడు. ఆ పిల్లవాడు పాము నోటిని గట్టిగా నొక్కినందున అది ఏమీ చేయలేకపోయింది.
వీడియో చూడండి:
छोटू का यमराज के साथ उठना बैठना लगता है
लेकिन यह साहस जानलेवा भी साबित हो सकता हैं😱 pic.twitter.com/nAuVU7DcaQ
— Manju (@cop_manjumeena) August 20, 2025
ఈ వీడియో చూసిన తర్వాత, చాలా మంది నెటిజన్లు దీనిని ‘రీల్’ చేయడానికి చేసిన నిర్లక్ష్యంగా భావిస్తున్నారు. అయితే, పాము విషపూరితమైనదా కాదా అనేది స్పష్టంగా తెలియదు. కానీ ఇంత చిన్న వయస్సులో ఇంత రిస్క్ తీసుకోవడం ప్రాణాంతకం అని నెటిజన్స్ అంటున్నారు.
అది ఎలుకను తిన్న పాములా అనిపిస్తుందని ఒక నెటిజన్ కామెంట్ పెట్టాడు. ఈ పాము విషపూరితమైనది కానట్లుంది అటూ మరొకరు రాశారు. అయినప్పటికీ, తల్లిదండ్రులు ఆ బిడ్డ పట్ల శ్రద్ధ వహించాలని రాశాడు. మరొకరు, అతను చాలా ధైర్యవంతుడైన పిల్లవాడు చాలా మంది పామును చూసి అరుస్తారని పోస్టు పెట్టాడు.
