AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: పాపం దానికి తెల్వదు స్నేహితుడు ఇక లేడని… నెటిజన్స్‌ను కన్నీరు పెట్టిస్తున్న వైరల్‌ వీడియో

కుక్కలు విశ్వాసానికి ప్రతిరూపం అంటారు. ఆకలితో ఉన్న కుక్కకు ఇంత అన్నం ముద్ద పెడితే చాలు జీవితాంతం అది తన విధేయతను చూపిస్తుంటుంది. అంతే కాదు తోటి కుక్కల పట్ల కూడా బలమైన భావోద్వేగ అనుబంధంతో కలిసిమెలసి ఉంటాయి. ఈ భావనను హైలైట్ చేసే వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా ప్రపంచంలో ఎక్కువగా...

Viral Video: పాపం దానికి తెల్వదు స్నేహితుడు ఇక లేడని... నెటిజన్స్‌ను కన్నీరు పెట్టిస్తున్న వైరల్‌ వీడియో
Dog Tries To Wake Friend
K Sammaiah
|

Updated on: Aug 23, 2025 | 4:15 PM

Share

కుక్కలు విశ్వాసానికి ప్రతిరూపం అంటారు. ఆకలితో ఉన్న కుక్కకు ఇంత అన్నం ముద్ద పెడితే చాలు జీవితాంతం అది తన విధేయతను చూపిస్తుంటుంది. అంతే కాదు తోటి కుక్కల పట్ల కూడా బలమైన భావోద్వేగ అనుబంధంతో కలిసిమెలసి ఉంటాయి. ఈ భావనను హైలైట్ చేసే వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా ప్రపంచంలో ఎక్కువగా వైరల్ అవుతోంది. దీన్ని చూసిన తర్వాత మీ హృదయం కూడా కరిగిపోతుంది. ఈ వీడియో చూసిన తర్వాత భావోద్వేగాలు మానవులలోనే కాదు జంతువులలో కూడా కనిపిస్తాయని తెలుసుకుంటారు.

వీడియోలో ఒక కుక్క రోడ్డుపక్కన ఫుట్‌పాత్‌ మీద పడిపోయి ఉంది. మరో కుక్క తన సహచరుడిని లేపడానికి శతవిధాలా ప్రయత్నిస్తుంది. ఎంత లేపినా ఎటువంటి సమాధానం ఇవ్వడం లేదు. అయితే ఆ కుక్క మాత్రం అలసిపోకుండా అలా లేపుతూనే ఉంది. కాళ్లతో తడుతూ, మొరుగుతూ తన సహచర కుక్కను లేపడానికి ప్రయత్నిస్తుంది. హృదయ విదారక స్వరంతో తన నిస్సహాయ ఏడుపు కొనసాగే వరకు ఇదంతా జరిగింది. దానికి తెల్వదు పాపం తన సహచరుడు చనిపోయాడని.

వీడియో చూడండి:

క్లిప్‌లో, ఒక కుక్క తన భాగస్వామి మరణంతో ఎంతగా బాధపడిందంటే అది చనిపోయిందనే విషయాన్ని అర్థం చేసుకోలేకపోతుంది. తన భాగస్వామిని మేల్కొలపడానికి తన వంతు ప్రయత్నం చేస్తుంది. కానీ అది జరగలేదు. దాని పరిస్థితిని చూస్తే కుక్కలు తమ భాగస్వాముల పట్ల ఎంత విశ్వాసపాత్రంగా ఉన్నాయో అర్థమవుతుంది. నెటిజన్స్‌ ఎమోషనల్‌గా స్పందిస్తున్నారు.

ఈ దృశ్యం నిజంగా చాలా హృదయ విదారకంగా ఉందని, దానిని చూసిన తర్వాత నాకు నిజంగా ఏడవాలని అనిపిస్తుందని ఒక వినియోగదారు రాశారు. అదే సమయంలో, కుక్కలు తమ భాగస్వాములకు చాలా విశ్వాసపాత్రంగా ఉన్నాయని ఈరోజే నాకు తెలిసిందని మరొకరు రాశారు.