Rahul Gandhi: పార్టీ అధ్యక్ష పదవిని రాహుల్ చేపట్టకపోతే.. కాంగ్రెస్ సీనియర్ నేత ఆసక్తికర వ్యాఖ్యలు

Congress Party New President: కాంగ్రెస్ పార్టీ కొత్త చీఫ్ ఎవరుకాబోతున్నారు? రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్ష పదవిని స్వీకరిస్తారా? హస్తిన రాజకీయ వర్గాల్లో ఇప్పుడు ఈ అంశంపైనే చర్చ జరుగుతోంది.

Rahul Gandhi: పార్టీ అధ్యక్ష పదవిని రాహుల్ చేపట్టకపోతే.. కాంగ్రెస్ సీనియర్ నేత ఆసక్తికర వ్యాఖ్యలు
Sonia Gandhi and Rahul Gandhi
Follow us
Janardhan Veluru

|

Updated on: Aug 23, 2022 | 11:03 AM

Congress Party New President: కాంగ్రెస్ పార్టీ కొత్త చీఫ్ ఎవరుకాబోతున్నారు? రాహుల్ గాంధీ (Rahul Gandhi) పార్టీ అధ్యక్ష పదవిని స్వీకరిస్తారా? రాహుల్ నిరాకరిస్తే ఆ పదవిని ఇంకెవరు చేపడుతారు? హస్తిన రాజకీయ వర్గాల్లో ఇప్పుడు ఈ అంశంపైనే చర్చ జరుగుతోంది. షెడ్యూల్ మేరకు సెప్టెంబర్ 20న కాంగ్రెస్ పార్టీ కొత్త చీఫ్‌ను ఎన్నుకోవాల్సి ఉంది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ అథారిటీ మరో మూడునాలుగు రోజుల్లో జారీ చేసే అవకాశముంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత, రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్(Ashok Gehlot) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్షుడు కావాలని పార్టీ నేతలు, కార్యకర్తలు ఏకగ్రీవంగా కోరుకుంటున్నట్లు చెప్పారు. ఈ సెంటిమెంట్‌ను గౌరవించి రాహుల్ గాంధీ పార్టీ సారథ్య బాధ్యతలు చేపట్టాలని కోరారు.జైపూర్‌లో మీడియాతో మాట్లాడిన గెహ్లాట్.. రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్ష పదవిని చేపట్టేందుకు ముందుకురాకుంటే పార్టీ శ్రేణులు అసంతృప్తికి గురవుతారని చెప్పారు.

పార్టీ అధ్యక్ష పదవిని రాహుల్ గాంధీకే అప్పగించాలన్నది పార్టీ శ్రేణుల ఏకగ్రీవ అభిప్రాయంగా అశోక్ గెహ్లాట్ పేర్కొన్నారు. ఈ పదవిని చేపట్టేందుకు రాహుల్ గాంధీ స్వయంగా ముందుకు వస్తే మంచిదన్నారు.గత 32 ఏళ్లుగా గాంధీ- నెహ్రూ కుటుంబీకులు ఎవరూ ప్రధాని, కేంద్ర మంత్రి, ముఖ్యమంత్రి పదవులను చేపట్టలేదన్నారు. అలాంటి కుటుంబం అంటే మోదీకి ఎందుకు భయం పట్టుకుందే తెలియడం లేదన్నారు.  75 ఏళ్లగా భారతావనిలో ప్రజాస్వామ్యం సజీవంగా ఉందంటే.. ఆ ఘనత కాంగ్రెస్ పార్టీకే చెందుతుందని అన్నారు. ప్రజాస్వామ్యం సజీవంగా ఉన్నందునే మోదీ దేశ ప్రధాని, కేజ్రీవాల్ సీఎం కాగలిగారని అశోక్ గెహ్లాట్ వ్యాఖ్యానించారు.

మరిన్ని జాతీయ వార్తలు చదవండి..