గణేష్ విగ్రహ ఊరేగింపు, నిమజ్జనంకు ‘నో’

కరోనా నేపథ్యంలో మార్చి నుంచి దేశవ్యాప్తంగా అన్ని పండుగలకు బ్రేకులు పడ్డాయి. ఉగాది మొదలు శ్రీరామ నవమి, రంజాన్, గుడ్‌ ఫ్రైడే పండుగలను జనం ఇళ్లలోనే ఉండి జరుపుకున్నారు.

గణేష్ విగ్రహ ఊరేగింపు, నిమజ్జనంకు 'నో'
Follow us

| Edited By:

Updated on: Jul 12, 2020 | 6:56 PM

కరోనా నేపథ్యంలో మార్చి నుంచి దేశవ్యాప్తంగా అన్ని పండుగలకు బ్రేకులు పడ్డాయి. ఉగాది మొదలు శ్రీరామ నవమి, రంజాన్, గుడ్‌ ఫ్రైడే పండుగలను జనం ఇళ్లలోనే ఉండి జరుపుకున్నారు. అంతేకాదు ప్రస్తుతం తెలంగాణలో బోనాలు పండుగను కూడా భక్తులు లేకుండా నిర్వహిస్తున్నారు. ఇక ప్రస్తుతం కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతుండగా.. రాబోయే పండుగలకు కూడా ఆంక్షలు కొనసాగనున్నాయి. ఈ క్రమంలో ఈ ఏడాది గణేష్ ఉత్సవాలకు సంబంధించి నిబంధనలు పెడుతూ మహారాష్ట్ర ప్రభుత్వం శనివారం ఓ ప్రకటనను విడుదల చేసింది.

గణేష్ మండళ్లకు కచ్చితంగా అనుమతి తీసుకోవాలని, కేంద్ర ప్రభుత్వం విధించిన నిబంధనలను మండపాల నిర్వాహకులు తప్పకుండా పాటించాలని, నాలుగు అడుగులకు మించి విగ్రహం ఎత్తు ఉండకూడదని తెలిపింది. అంతేకాదు ఈ ఏడాది గణేష్ విగ్రహ ఊరేగింపు, నిమజ్జనం కార్యక్రమంకు అనుమతి లేదని మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. గణేష్‌ విగ్రహాన్ని నిమజ్జనం చేయాలనుకునే వారు వచ్చే ఏడాదికి వాయిదా వేయాలని.. లేదంటే సరస్సు, నదుల దగ్గరకి రాకుండా ఇంట్లోనే నిమజ్జనం చేయాలని మహారాష్ట్ర ప్రజలకు ప్రభుత్వం సూచించింది. కాగా ఆగష్టు 22 నుంచి గణేష్ ఉత్సవాలు ప్రారంభం కానున్న విషయం తెలిసిందే.