West Bengal: ఊపందుకున్న బెంగాల్‌ ఎన్నికల ప్రచారం.. మార్కెట్లో హల్‌చల్‌ చేస్తోన్న మోదీ, మమతా స్వీట్‌ విగ్రహాలు

దేశంలోని పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు కొనసాగుతున్నాయి. అయితే ఈ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పశ్చిమ బెంగాల్‌లో రాజకీయం మరింత వేడెక్కుతోంది. హౌరా జిల్లాలో..

  • Subhash Goud
  • Publish Date - 2:46 pm, Sat, 3 April 21
West Bengal: ఊపందుకున్న బెంగాల్‌ ఎన్నికల ప్రచారం.. మార్కెట్లో హల్‌చల్‌ చేస్తోన్న మోదీ, మమతా స్వీట్‌ విగ్రహాలు
Howrah Shop

దేశంలోని పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు కొనసాగుతున్నాయి. అయితే ఈ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పశ్చిమ బెంగాల్‌లో రాజకీయం మరింత వేడెక్కుతోంది. హౌరా జిల్లాలో ఓ స్వీ్‌ట్‌ దుకాణంలో ప్రధాని నరేంద్ర మోదీ, బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విగ్రహాలు స్వీట్‌తో తయారు చేసి ఏర్పాటు చేయడం సంచలనంగా మారుతోంది. దుకాణ యజమాని ఇద్దరి విగ్రహాలను ఏర్పాటు చేసి ఓట్లువేయాలని అభ్యర్థిస్తున్నాడు. అయితే మమతా బెనర్జీపై ఇటీవల దాడి జరగడంతో ఆమె కాలుకు గాయాలయ్యాయి.దీంతో గాయాలతో వీల్‌చైర్‌పై కూర్చున్న విగ్రహం ఏర్పాటు చేయగా, ప్రధాని మోదీ విగ్రహం నిలబడి ఉంది. అలాగే ఈ స్వీట్‌ షాపులో మూడు ప్రధాన నేతలు విగ్రహాలను ఏర్పాటు చేశారు. మరో వ్యక్తి ఐఎస్‌ఎప్‌ నాయకుడు సంజుక్తా మోర్చా ఉన్నారు.

ఈ సందర్భంగా స్వీ్‌ట్‌ షాపు యజమాని మాట్లాడుతూ.. స్వీట్‌తో తయారు చేసిన ఈ విగ్రహాలు కనీసం ఆరు నెలల వరకు ఉంటాయని అన్నారు. మీరు ఏ పార్టీకి ఓటు వేసినా పోలింగ్‌ ప్రక్రియను శాంతియుతంగా నిర్వహించాలని ప్రజలు అర్థం చేసుకుంటారని ఇలా ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఇక్కడ ఎవరు పాలించినా… అభివృద్ధి ముఖ్యమని అన్నారు. కాగా, పశ్చిమబెంగాల్‌లో మొదటి, రెండు దశల అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ జరిగాయి. ఇక మూడో విడత పోలింగ్‌ ఏప్రిల్‌ 6న జరగనుంది. ఓట్ల లెక్కింపు మే 2న జరగనుంది.

ఇలా బెంగాల్‌ ఎన్నికల నేపథ్యంలో పలు రాజకీయ పార్టీలు రకరకాలుగా ప్రచారాలు చేసుకుంటుండగా, స్వీట్‌ దుకాణ యజమాని ఇలా స్వీట్లతో విగ్రహాలు ఏర్పాటు చేయడం అందరిని ఆకర్షిస్తున్నాయి. బీజేపీ, తృణమూల్‌ కాంగ్రెస్‌, ఇతర పార్టీల నేతలు ఎవరికి వారు పోటీపోటీగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇక బీజేపీ మాత్రం దూకుడు పెంచింది.

Lockdown: నిరుపేద కుటుంబాలను భయపెట్టిస్తున్న లాక్‌డౌన్‌.. ఉన్న ఉపాధి కోల్పోతే పరిస్థితి ఏమిటి..?

India Corona Cases Updates: భారత్‌లో మరింత విజృంభిస్తున్న కరోనా మహమ్మారి.. భారీగా పెరిగిన మరణాల సంఖ్య..