Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2021: ఢిల్లీ క్యాపిటల్‌కు భారీ షాక్.. అల్‌రౌండర్ ఆక్సర్ పటేల్‌కు కరోనా పాజిటివ్..!

ప్రముఖులు, రాజకీయ నాయకులు కరోనా బారిన పడి ఇప్పడిప్పుడే కోలుకుంటున్నారు. అటు క్రికెటర్లపై కరోనా పంజా విసురుతున్న విషయం తెలిసిందే.

IPL 2021: ఢిల్లీ క్యాపిటల్‌కు భారీ షాక్..  అల్‌రౌండర్ ఆక్సర్ పటేల్‌కు కరోనా పాజిటివ్..!
Cricker Allrounder Axer Patel
Follow us
Balaraju Goud

|

Updated on: Apr 03, 2021 | 2:40 PM

Axar Patel : దేశంలో కరోనా మళ్లీ విజృంభిస్తోంది. సామాన్యుల నుంచే సెలెబ్రిటీల వరకు పేద, ధనిక అనే తేడా లేకుండా అందరికీ సోకుతుంది. ఇప్పటికే ప్రముఖులు, రాజకీయ నాయకులు కరోనా బారిన పడి ఇప్పడిప్పుడే కోలుకుంటున్నారు. అటు క్రికెటర్లపై కరోనా పంజా విసురుతున్న విషయం తెలిసిందే.

ఇప్పటికే సచిన్‌, పఠాన్‌ బ్రదర్స్‌, బద్రీనాథ్‌లకు కరోనా సోకింది. అయితే.. తాజా మరో క్రికెట్ అక్సర్ పటేల్ ఆస్పత్రిలో చేరారు. కరోనా లక్షణాలు ఉండటంతో ఆయన కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా వైద్యుల సలహా మేరకు ఆస్పత్రిలో చేరిన్నట్లు డీసీ ఫ్రాంచెజీ బృందం తెలిపింది.

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా వాంఖడే స్టేడియం వేదకగా చెన్నై సూపర్ కింగ్స్ – ఢిల్లీ క్యాపిటల్స్‌ తలపడనున్నాయి. సరిగ్గా ఏడు రోజుల గడువు ఉండటంతో, ఆల్ రౌండర్ ఆక్సర్ పటేల్‌కు కరోనా పరీక్షలు చేయడంతో కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. ఈ అంశాన్ని డీసీ ఫ్రాంచెజీ బృందాలు ధృవీకరించాయి. కోల్‌కతా నైట్ రైడర్స్ బ్యాట్స్‌మేన్ నితీష్ రానా తర్వాత అక్సర్ పటేల్ కూడా వైరస్ బారినపడటం క్రికెట్ ప్రియులకు నిరాశ కలిగించింది. ఐపీఎల్ ఆటగాళ్లలో కరోనా సోకిన రెండవ ఆటగాడు ఆక్సర్.