JP Nadda on PM Modi: ప్రధాని మోడీ నిర్ణయం ఎలా తీసుకుంటారో తెలుసా?.. కీలక వ్యాఖ్యలు చేసిన జేపీ నడ్డా!
ప్రధాని నరేంద్ర మోడీ.. కేంద్ర మంత్రులను, అధికార యంత్రాంగాన్ని మొత్తం తన గ్రిప్‌లో పెట్టుకుని.. ఏకపక్షంగా వ్యవహరిస్తారని అంటుంటారు. నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ జేపీ నడ్డా కీలక వ్యాఖ్యలు చేశారు.

JP Nadda on PM Modi: 2014లో భారత ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నరేంద్ర మోదీ తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంటూ పాలన సాగిస్తున్నారు. విభిన్న శైలితో యావత్ దేశ ప్రజానికాన్నే కాక.. ప్రపంచ దేశాలను సైతం తన వైపునకు తిప్పుకుంటున్నారు. అయితే, ప్రధాని మోడీ నియంతృత్వ ధోరణి కలిగి ఉంటారని విపక్షాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేంద్ర మంత్రులను, అధికార యంత్రాంగాన్ని మొత్తం తన గ్రిప్‌లో పెట్టుకుని.. ఏకపక్షంగా వ్యవహరిస్తారని అంటుంటారు. నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ జేపీ నడ్డా కీలక వ్యాఖ్యలు చేశారు. ఓ జాతీయ మీడియా ఇంటర్య్వూలో ఆయన ఆసక్తికరమైన రిప్లై ఇచ్చారు. అంతేకాదు.. ప్రధాని మోడీకి సంబంధించి ఇంట్రస్టింగ్ విషయాలను పంచుకున్నారు.
“మేము సమిష్టిగా ఆలోచిస్తాము. మోడీకి ఆలోచన ఉంటే అందరితో చర్చిస్తారు. అనంతరం పార్లమెంటరీ బోర్డు సభ్యులతో చర్చిస్తారు. అది మరింత ముందుకు వెళుతుంది. చివరకు ఫిల్టర్ చేసిన దానిని ప్రధానమంత్రి ముందుంచుతారు” అని జేపీ నడ్డా అన్నారు. దేశప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా మాత్రమే అన్ని నిర్ణయాలు తీసుకుంటారా అనే ప్రశ్నకు జేపీ నడ్డా బదులిచ్చారు. ” ప్రధాని మోడీ నాయకుడు, అతని ఆలోచనలు చాలా ముఖ్యమైనవి, కానీ అతను అందరినీ వెంట తీసుకెళతాడు” అని JP నడ్డా సమాధానమిచ్చారు. ‘‘ఏ సమావేశంలో అయినా ఆయన అతి తక్కువ మాట్లాడుతారు. ప్రతీ ఒక్కరు మాట్లాడేది ఓపిగా వింటారు. విషయ పరిజ్ఞానం ఆధారంగా ప్రతి వ్యక్తి సూచనలకు అత్యంత ప్రాముఖ్యత ఇస్తారు’’ అని జేపీ నడ్డా చెప్పుకొచ్చారు. “ఆలోచనలో తేడా అదే. ఇతర పార్టీల్లో ఒకరి మరింత ఎక్కువగా ఉంది. మేము సమిష్టిగా ఆలోచిస్తాము. నేను వేరే పని చేయాల్సిన అవసరం లేదు. మేము ఏమి చేస్తున్నామో వేగవంతం చేస్తున్నాము,” అని JP నడ్డా పార్టీ వ్యూహంతో పాటు తన విలువ గురించి మాట్లాడమని అడిగినప్పుడు అన్నారు.
ఇందుకు సంబంధించి నడ్డా ఒక ఉదాహరణగా చెప్పారు. ఒక్కో బూత్‌కు 10 మంది యువకులు ఉంటారని రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు. ఇదొక కొత్త ప్రక్రియ. నితిన్ గడ్కరీ దానిని ముందుకు తీసుకెళ్లారు. ఒక్కొక్కరు 20 మంది దళిత కార్మికులు, 20 మంది మహిళలు, 20 మంది ఓబీసీ కార్మికులు, 20 మంది యువకులు, 20 మంది ఆర్థికంగా వెనుకబడిన వారని అమిత్ షా అన్నారు. అందరినీ ఏకతాటిపైకి తెచ్చారు. బూత్ కమిటీకి తీసుకెళ్లాం’’ అని చెప్పారు.
“ దేశవ్యాప్తంగా 10.40 లక్షల ఎలక్టోరల్ బూత్‌లు ఉన్నాయి. మేము 8.5 లక్షలకు చేరుకున్నాము. 10.40 లక్షలకు పార్టీని తీసుకెళ్లాలి. ఇది నిరంతర ప్రక్రియ. యూపీలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ నాయకత్వం, ప్రధాని మోడీ దీవెనలు ఉంటే మన కార్యకర్తలు దానిని అక్షరబద్ధంగా అమలు చేస్తారు. సమాజంలోని అన్ని వర్గాలను కలుపుకోవడమే బీజేపీ వ్యూహం. మేము మా పనిని ప్రతి ఒక్కరికీ తీసుకెళ్లాలి, ”అని జెపి నడ్డా తెలిపారు. వచ్చే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి సత్తా చాటుతామని ధీమా వ్యక్తం చేశారు జేపీ నడ్డా.