Solar Powered Fan: హైటెక్ పద్ధతిలో మొక్కజొన్న పొత్తులను కాలుస్తున్న బామ్మ.. పిక్ ను షేర్ చేసిన వివిఎస్ లక్ష్మణ్

Solar Powered Fan:కొంతమంది అవకాశాలు లేవంటూ నిరాశను వ్యక్తం చేస్తూ.. కాలాన్ని గడిపేస్తారు.. మరికొందరు, ఉన్న అవకాశాలను వినియోగించుకుంటూ.. ఉన్నంతలో ఉన్నతంగా బతకడానికి..

Solar Powered Fan: హైటెక్ పద్ధతిలో మొక్కజొన్న పొత్తులను కాలుస్తున్న బామ్మ.. పిక్ ను షేర్ చేసిన వివిఎస్ లక్ష్మణ్
Solar Powered Fan
Follow us

|

Updated on: Apr 10, 2021 | 12:10 PM

Solar Powered Fan:కొంతమంది అవకాశాలు లేవంటూ నిరాశను వ్యక్తం చేస్తూ.. కాలాన్ని గడిపేస్తారు.. మరికొందరు, ఉన్న అవకాశాలను వినియోగించుకుంటూ.. ఉన్నంతలో ఉన్నతంగా బతకడానికి ప్రయత్నిస్తారు.. తాజాగా ఓ 80 ఏళ్ల బామ్మ బతుకు తెరువు కోసం మొక్కజొన్న పొత్తులను కాల్చుకుని అమ్ముకుంటుంది. అయితే అది హైటెక్ పద్ధతిలో మొక్కజొన్న పొత్తులు కాలుస్తూ అందరిని ఆకర్షించింది ఈ బామ్మ. ప్రముఖ ఇండియన్ మాజీ క్రికెటర్ వివిఎస్ లక్ష్మణ్ బామ్మ మొక్క జొన్నపొత్తులను హైటెక్ గా కాలుస్తున్న బామ్మ అంటూ ఓ పిక్ ని తన ట్విట్టర్ వేదికగా ఓ పిక్ ని షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ బామ్మ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

కర్ణాటక రాష్ట్రంలో బెంగళూరులో అసెంబ్లీ ముందు 80 ఏళ్ల సెల్వమ్మ మొక్కజొన్న పొత్తుల బండిని పెట్టుకుని గత 20 ఏళ్లుగా జీవనాన్ని సాగిస్తుంది. అయితే గత కొన్ని నెలల నుంచిసెల్వమ్మ పొత్తులను కాల్చడానికి సోలార్ పవర్ ని ఉపయోగిస్తుంది. బండి ఉన్న ప్రాంతం లో ఎన్సీసీ కంపెనీలు, హైకోర్టు, కబ్బన్ పార్క్ ఉన్నాయి. దీంతో అటువైపు ప్రయాణించే ప్రయాణికులకు బామ్మ కంకులను కాల్చే విధానం ఆకట్టుకుంటుంది. దీనికి కారణం ఆమె సోలార్ పవర్ సాయంతో హైటెక్ విధానంలో జొన్న కంకులు కాల్చడమే.

తొమ్మిది నెలల క్రితం జొన్న కంకులు అమ్ముకుంటూ జీవనం సాగిస్తోన్న సెల్వమ్మకు ఓ స్వచ్ఛంద సంస్థ ఈ సోలార్ యంత్రాన్ని అందించింది. కంకులు కాల్చడానికి సెల్వమ్మ పడుతోన్న కష్టాన్ని చూసి చలించిపోయిన సెల్కో ఫౌండేషన్.. మినీ సోలార్ యంత్రాన్ని ఉచితంగా సెల్వమ్మ బండిపై ఏర్పాటు చేసింది. డీసీ ఫ్యాన్, ఓ లైట్, తేలికపాటి లిథియం ఐయాన్ బ్యాటరీతో కూడిన సోలార్ పవర్ యంత్రాన్ని అమర్చారు. దీంతో సెల్వమ్మ కంకులు కాల్చడానికి శారీరక శ్రమ తగ్గింది. అంతేకాదు.. ఆమె వ్యాపారం పెరగడానికి కూడా తోడ్పడింది. అంతేకాదు.. ఆమె మొక్కజొన్న కంకులను కాలుస్తున్న విధానం మీడియా దృష్టిని ఆకర్షించింది.

ఇదే విషయంపై సెల్వమ్మ మాట్లాడుతూ.. గతంలో మొక్కజొన్న పొత్తులను నిప్పులపై కాల్చడానికి ఫ్యాన్ తిప్పి, తిప్పి నా చేతులు విపరీతంగా నొప్పులు వచ్చేవని.. దీంతో సాయంత్రం అయ్యేసరికి కంకులు అమ్మలేని పరిస్థితి ఉండేదని తెలిపింది. అయితే, సోలార్ పవర్ యంత్రంతో ఇప్పుడు చాలా ఈజీగా కంకులను కాల్చేస్తున్నానని.. గతంలో 10 నిమిషాలు పట్టేదని, ఇప్పుడు కేవలం ఐదు నిమిషాల్లోనే పని పూర్తవుతోందని సంతోషం వ్యక్తం చేసింది. ఐతే ఇప్పుడు ఈ సోలార్ ప్యాన్స్ పనిచేయడానికి ప్రతి రోజు సూర్యుడు కనిపించాలని ప్రార్థిస్తున్నా అంటూ నవ్వుతూ చెబుతుంది ఈ బామ్మ. ఆమె రోజుకు 30 మొక్కజొన్న పొత్తులను విక్రయిస్తుంది.. దీంతో రూ. 150 లాభం పొందుతుంది 80ఏళ్ల ఈ సీనియర్ సిటిజన్ జీవనోపాధి కోసం కష్టపడుతూనే ఉన్నారు. తీవ్రమైన నీటి కొరత సమయంలో సెల్వమ్మ తన స్వస్థలమైన భద్రావతిని వదిలి దాదాపు 40 సంవత్సరాల క్రితం బెంగళూరులో స్థిరపడింది.

Also Read: మళ్ళీ పోలీసులను ఆశ్రయించిన జబర్దస్త్ కమెడియన్ వినోద్ .. న్యాయం చేయమని వినతిపత్రం

దీప కండిషన్ సీరియస్.. సంతోషంలో మోనిత…. దీపని ఎలా కాపాడుకోవాలి అనే ఆలోచనలో కార్తీక్..