Ram Navami Violence: రెండోరోజు కూడా కొనసాగిన హింసా.. బెంగాల్‌ హింసపై గవర్నర్‌తో మాట్లాడిన అమిత్ షా

హౌరాలో అల్లరి మూకలు మళ్లీ రెచ్చిపోయాయి. శ్రీరామ నవమి ఊరేగింపు సందర్భంగా చెలరేగిన హింసాకాండ రెండోరోజు కూడా కొనసాగింది. భద్రతా బలగాలు భారీగా మోహరించాయి. అల్లర్లపై కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, బెంగాల్ గవర్నర్‌ని నివేదిక కోరారు.

Ram Navami Violence: రెండోరోజు కూడా కొనసాగిన హింసా.. బెంగాల్‌ హింసపై గవర్నర్‌తో మాట్లాడిన అమిత్ షా
Ram Navami Violence
Follow us

|

Updated on: Mar 31, 2023 | 9:49 PM

బెంగాల్‌లోని హౌరాలో వరుసగా రెండోరోజు కూడా అల్లర్లతో అట్టుడుకుతోంది. అల్లరిమూకలు దాడులకు దిగాయి. ఇళ్లమీద రాళ్లదాడి జరిగింది. బెంగాల్‌ పోలీస్‌తోపాటు, RAF బృందాలు పరిస్థితిని కంట్రోల్‌ చేయడానికి ప్రయత్నిస్తున్నాయి. రోడ్డుపక్కన ఉన్న టీస్టాల్స్‌ను, దుకాణాలను నిరసనకారులు ధ్వంసం చేయడంతోపాటు రాళ్లు రువ్వారు. స్థానికులు అపార్ట్‌మెంట్ల గేట్లకు తాళాలు వేసి ఇళ్లలో సురక్షితంగా ఉండిపోయారు. శ్రీరామ నవమి శోభాయాత్ర నుంచి ఈ అల్లర్లు సాగుతున్నాయి. హౌరా అల్లర్లపై వెనక బీజేపీ, దాని అనుసంధ సంస్థలు ఉన్నాయంటూ బెంగాల్‌ CM మమతా బెనర్జీ ఆరోపించారు. ఈ అల్లర్ల వెనక హిందూ ముస్లింలు లేరని చెప్పారామె. గురువారం నాటి అల్లర్ల తర్వాత 31 మందిని అరెస్ట్‌ చేశామన్నారు. నిందితులను కఠినంగా శిక్షిస్తామన్నారు.

అదానీ వ్యవహారంపై ప్రతిపక్షాల ప్రశ్నలకు ఎదుర్కోలేక- BJP ఇలాంటి చర్యలకు దిగిందని బెంగాల్‌ దీదీ మండిపడ్డారు. హౌరా సంఘటన దురదృష్టకరమని, అల్లర్లు సృష్టించాలని ముందుగానే పథకం వేసుకుని, ఈ ఘాతుకానికి పాల్పడిన క్రిమినల్స్ పిస్టల్స్‌ను, పెట్రోల్ బాంబులను వెంట తెచ్చుకున్నారని మమతా చెప్పారు.

హౌరాలో రామనవమి అల్లర్ల వెనక బీజేపీ హస్తం ఉందంటున్న తృణమూల్‌ కాంగ్రెస్‌- ఇందుకు ఆధారం బయటపెట్టింది. హౌరాలో శోభాయాత్రలో ఒక వ్యక్తి తుపాకీ పట్టుకుని ఉన్న వీడియోను మమతా బెనర్జీ మేనల్లుడు, TMC జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్‌ బెనర్జీ విడుదల చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసం బీజేపీ హింసను రెచ్చగొడుతోందని అభిషేక్‌ బెనర్జీ ట్వీట్‌ చేశారు.

మరోవైపు హౌరా అల్లర్లపై కేంద్రహోం మంత్రి అమిత్‌ షా- బెంగాల్‌ గవర్నర్‌ ఆనంద బోస్‌తో మాట్లాడారు. బెంగాల్ బీజేపీ చీఫ్‌ సుకాంత మజుందార్‌తో మాట్లాడారు. మరోవైపు హౌరా, ధల్‌ఖోలాలో అల్లర్లపై NIA దర్యాప్తు జరపాలంటూ కలకత్తా హైకోర్టులో బెంగాల్‌ విపక్షనేత సువేందు అధికారి పిల్‌ దాఖలు చేశారు. వెంటనే ఈ ప్రాంతాల్లో కేంద్ర బలగాలను మోహరించాలని హైకోర్టును అభ్యర్థించారు.

మరోవైపు బెంగాల్లో శాంతి భద్రతల పరిస్థితులు ప్రమాదకరంగా ఉన్నాయని ఆ రాష్ట్ర బీజేపీ చీఫ్‌ సుకాంత్‌ మజుందార్‌ తెలిపారు. శ్రీరామ నవమి ఊరేగింపు ప్రశాంతంగా వెళ్తుంటే, పోలీసులు అక్కడి నుంచి వెళ్లిపోయారన్నారు. ఆ తర్వాతే ఒక వర్గం వారంతా మిద్దెల పై నుంచి రాళ్లు వేశారని ఆరోపించారు. మొత్తానికి ఈ వ్యవహారంతో బెంగాళ్లో తృణమూల్‌ వర్సెస్‌ బీజేపీగా మిగిలిపోయింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం

చక్రవ్యూహంలో ప్రవేశించిన మేనల్లుడిని కన్నయ్య ఎందుకు రక్షించలేదంటే
చక్రవ్యూహంలో ప్రవేశించిన మేనల్లుడిని కన్నయ్య ఎందుకు రక్షించలేదంటే
పంజాబ్‌తో మ్యాచ్.. టాస్ ఓడిన కోల్ కతా.. 25 కోట్ల ప్లేయర్ దూరం
పంజాబ్‌తో మ్యాచ్.. టాస్ ఓడిన కోల్ కతా.. 25 కోట్ల ప్లేయర్ దూరం
రజినీకాంత్‌తో ఉన్న ఈ కుర్రాడు ఇప్పుడు అమ్మాయిల కలల రాకుమారుడు..
రజినీకాంత్‌తో ఉన్న ఈ కుర్రాడు ఇప్పుడు అమ్మాయిల కలల రాకుమారుడు..
తెలంగాణలో రాగల ఐదురోజులు వడగాలులు.. ఆ ప్రాంతాలకు IMD హెచ్చరిక
తెలంగాణలో రాగల ఐదురోజులు వడగాలులు.. ఆ ప్రాంతాలకు IMD హెచ్చరిక
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
రెండోసారి తండ్రైన క్రికెటర్ కృనాల్ పాండ్య.. బాబు పేరెంటో తెలుసా?
రెండోసారి తండ్రైన క్రికెటర్ కృనాల్ పాండ్య.. బాబు పేరెంటో తెలుసా?
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
విమానాలు రద్దయితే ఆటోమేటిక్‌ రిఫండ్‌
విమానాలు రద్దయితే ఆటోమేటిక్‌ రిఫండ్‌
వేసవి తాపాన్ని తట్టుకోవడానికి డ్రైవర్‌ వినూత్న ఆలోచన !!
వేసవి తాపాన్ని తట్టుకోవడానికి డ్రైవర్‌ వినూత్న ఆలోచన !!
టీ20 ప్రపంచకప్‌లో సిక్సర్ల కింగ్‌.. యువరాజ్‌ కు కీలక బాధ్యతలు
టీ20 ప్రపంచకప్‌లో సిక్సర్ల కింగ్‌.. యువరాజ్‌ కు కీలక బాధ్యతలు