Odisha Train Accident: ఒడిశా ఘోర రైలు ప్రమాదంపై రైల్వే శాఖ ప్రాథమిక నివేదిక ఇదే

-ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదం.. రైలు ప్రయాణం అంటేనే వణుకు పుట్టేలా చేసింది. సేఫ్ జర్నీ అనే మాటే హాస్పాస్పదం అవుతోంది. ఇంతకీ ఈ ప్రమాదానికి అసలు కారణం ఏంటి... సిగ్నలింగ్‌ వ్యవస్థ వైఫల్యం… ఇది పక్కా అంటోంది రైల్వే శాఖ ప్రాధమికంగా ఇప్పటికైతే తేల్చింది

Odisha Train Accident: ఒడిశా ఘోర రైలు ప్రమాదంపై రైల్వే శాఖ ప్రాథమిక నివేదిక ఇదే
Odisha Train Accident
Follow us
Ram Naramaneni

|

Updated on: Jun 03, 2023 | 5:11 PM

కోరమాండల్ ట్రైన్ ప్రమాదంపై రైల్వేశాఖ నిపుణుల బృందం ప్రాథమిక నివేదిక ఇచ్చింది. సిగ్నల్‌ లోపం కారణంగానే ప్రమాదం జరిగిందని వెల్లడించింది.  లూప్ లైన్‌లో ఉన్న గూడ్స్‌ను కోరమాండల్ ఎక్స్ ప్రెస్ ఢీకొనడం వల్లే మొదట ప్రమాదం జరిగిందని తెలిపింది. మెయిన్ లైన్‌లో నుంచి వెళ్లాల్సిన కోరమండల్ లూప్ లైన్లోకి వెళ్లిందని అధికారులు పేర్కొన్నారు. మొదట కోరమండల్‌కు మెయిన్ లైన్లో వెళ్లేందుకు సిగ్నల్ ఇచ్చారు. కానీ కొద్దిసేపటికి ఇచ్చిన సిగ్నల్‌ను నిలిపివేశారని అధికారులు తెలిపారు. సిగ్నల్ నిలిపివేయడం వల్లే మెయిన్ లైన్‌లో వెళ్లాల్సిన కోరమండల్ లూప్ లైన్లోకి వెళ్లి గూడ్స్‌ను ఢీకొట్టి పట్టాలు తప్పిందని.. పట్టాల తప్పిన కోరమండల్‌ను యశ్వంతపూర్ ఎక్స్ ప్రెస్ ఢీ కొట్టిందని వెల్లడించారు.

ఒడిషాలో ఘోర విషాదం.. కనీవినీ ఎరుగనంత ప్రాణ నష్టం.. ఇండియన్ రైల్వే చరిత్రలో మూడవ అతి పెద్ద ప్రమాదం.. ఒడిషాతో పాటు నాలుగు రాష్ట్రాల్ని వణికిస్తోంది.  బాలాసోర్‌ ఘోర రైలు ప్రమాదం ఎన్నో కుటుంబాలను చిన్నాభిన్నం చేసింది. ఎన్నో హృదయాలను ఛిద్రం చేసింది. యావత్‌ భారత సమాజాన్ని పెను విషాదంలోకి నెట్టివేసింది ఈ ఘోర ప్రమాదం. రెప్పపాటులో తరుముకొచ్చిన మృత్యువునుంచి తప్పించుకోలేక రైలుమధ్యపడి నలిగిపోయారు వందలాది మంది ప్రయాణికులు.

ఒడిషా రైలు ప్రమాద ఘటనను సీరియస్‌గా తీసుకుంది కేంద్రప్రభుత్వం. బాధితులకు పరిహారం ప్రకటించారు ప్రధాని మోదీ. రైల్వేమంత్రి ఒడిషాకు పంపి అక్కడే మకాం పెట్టించారు. అత్యవసర సమావేశం నిర్వహించి వివరాలు తీసుకుని కారణాలపై సమీక్షించారు ప్రధాని మోదీ. వెంటనే ఘటనా స్థలానికి బయలుదేరారు. భువనేశ్వర్‌కు చేరుకుని అక్కడినుంచి హెలికాప్టర్‌లో ప్రమాదస్థలానికి వెళ్లారు. కటక్‌ ఆస్పత్రిలో బాధితుల్ని పరామర్శించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి