Heavy Rains: ఉత్తరాదిలో ఆగని కుంభవృష్టి.. వణుకు పుట్టిస్తున్న వానలు.
ఉత్తరాదిని భారీ వర్షాలు వదలా అంటున్నాయి. కుంభవృష్టి వర్షం ఆగకుండా కురుస్తోంది. భారీ వర్షాలకు ఇప్పటి వరకు ఏకంగా 37 మంది మృతి చెందారు. ఎడతెరపి లేకుండా కురుస్తోన్న వర్షాల కారణంగా రోడ్లు తెగిపోయాయి, వరద నీటిలో కార్లు కొట్టుకుపోయాయి. ఉత్తరాదిలో వరద బీభత్సం కొనసాగుతోంది. ఢిల్లీ సహా ఉత్తరాధి రాష్ట్రాల్లో వర్షం బీభత్సం...
ఉత్తరాదిని భారీ వర్షాలు వదలా అంటున్నాయి. కుంభవృష్టి వర్షం ఆగకుండా కురుస్తోంది. భారీ వర్షాలకు ఇప్పటి వరకు ఏకంగా 37 మంది మృతి చెందారు. ఎడతెరపి లేకుండా కురుస్తోన్న వర్షాల కారణంగా రోడ్లు తెగిపోయాయి, వరద నీటిలో కార్లు కొట్టుకుపోయాయి. ఉత్తరాదిలో వరద బీభత్సం కొనసాగుతోంది. ఢిల్లీ సహా ఉత్తరాధి రాష్ట్రాల్లో వర్షం బీభత్సం సృష్టిస్తోంది. భారీ వర్షాల నేపథ్యంలో 8 రాష్ట్రాలకు వాతావరణ శాఖ రెయిన్ అలర్ట్ చేసింది.
ప్రస్తుతం హిమాచల్‌ప్రదేశ్‌లో రెడ్ అలర్ట్ కొనసాగుతోంది. వరద నీరుతో బియాస్ నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడుతున్నాయి. క్లౌడ్ బరస్ట్, కుంభవృష్టి ఉండే అవకాశాలు ఉన్నాయని తావారణ శాఖ తెలిపింది. 39 NDRF టీమ్స్‌తోపాటు ఆర్మీని రంగంలోకి దింపిన కేంద్రం. పంజాబ్-14, హిమాచల్-12, ఉత్తరాఖండ్-8, హర్యానా-5 NDRF టీమ్స్ సహాయక చర్యల్లో పాల్గొన్నాయి. ఢిల్లీలో గత రెండు రోజులుగా ఎడతెరిలేకుండా కుస్తోన్న వర్షాల కారణంగా వరద ముప్పు పొంచి ఉందని అధికారులు హెచ్చరించారు.
యమునా నది ఉప్రరూపం దాల్చి ప్రవహిస్తోంది. నీటిమట్టం 206.65 మీటర్లకు చేరింది. హత్నీకుండ్ నుంచి నీటి విడుదలతో నీటిమట్టం భారీగా పెరిగింది. హర్యానాలోని అంబాలలో నదులు ఉధృంతంగా ప్రవహిస్తున్నాయి. అధికారులు హైఅలర్ట్ ప్రకటించారు. సిమ్లా, సోలన్, సిర్మౌర్, కులులో రెడ్ అలర్ట్ జారీ చేశారు. 24 గంటల్లో భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు లిపారు. ఉనా, హమీర్‌పూర్, కాంగ్రాలో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..