వానా.. వానా..వరదా..వరదా.. గుర్ గావ్ లో పడవల్లా నీటిలో కొట్టుకుపోతున్న కార్లు, వాహనాలు
హర్యానాలోని గుర్ గావ్ లో భారీ వర్షాలకు వీధులన్నీ జలమయమయ్యాయి. ముంచెత్తుతున్న వానతో నగరం తడిసి ముద్దయింది. సోమవారం ఉదయం నుంచే కురుస్తున్న వర్షాలతో అనేక లోతట్టు ప్రాంతాల్లో మోకాలి లోతు నీరు ప్రవహిస్తోంది....
హర్యానాలోని గుర్ గావ్ లో భారీ వర్షాలకు వీధులన్నీ జలమయమయ్యాయి. ముంచెత్తుతున్న వానతో నగరం తడిసి ముద్దయింది. సోమవారం ఉదయం నుంచే కురుస్తున్న వర్షాలతో అనేక లోతట్టు ప్రాంతాల్లో మోకాలి లోతు నీరు ప్రవహిస్తోంది. ట్రాఫిక్ జామ్ లతో వాహనదారులు పడిన పాట్లు ఇన్నీఅన్నీ కావు. పలు చోట్ల వాహనాలు మొరాయించాయి. ఇక కొన్ని వీధుల్లో నీట పాక్షికంగా మునిగిన కార్లు, ఇతర వాహనాల తాలూకు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పాలం విహార్ ప్రాంతంలో పార్క్ చేసిన పలు కార్ల పరిస్థితి చెప్పలేమని స్థానికులు అంటున్నారు. అనేకమంది తమ మొబైల్స్ లో వీటిని వీడియో తీశారు. నీట తేలుతున్న కార్లు కొన్ని అయితే మరికొన్ని పడవల మాదిరే కొట్టుకుపోతున్నాయని వారు తెలిపారు. గుర్ గావ్ కు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ ను ప్రకటించింది. రానున్న రెండు రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడవచ్చునని సూచించింది.
అనేక చోట్ల నీటి ప్రవాహాల కారణంగా వాహనాలు చిక్కుకుపోవచ్చునని, వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని కోరింది. నైరుతి రుతు పవనాలు ఈ నెల 13 నే ఢిల్లీ నగరాన్ని తాకాయి. అయితే గుర్ గావ్ లో ఇంత భారీ వర్షం పడడం మాత్రం ఇదే మొదటిసారి. ఇక ఢిల్లీలోనే కాక యూపీ, హర్యానా, రాజస్థాన్ రాష్ట్రాల్లోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. కాగా దేశ వ్యాప్తంగా కూడా రుతుపవనాలు చురుకుగా ఉన్నాయని, ఈ సారి వర్షపాతం సాధారణ స్థాయిలో ఉంటుందని అధికారులు తెలిపారు.
మరిన్ని ఇక్కడ చూడండి : ఇదేం సాహసం రా బాబు.. ఎత్తైన వంతెన నుంచి ఎలా దూకేశాడో..!వైరల్ అవుతున్న వీడియో.:Man Jumping Video.
బైక్ రైడర్స్ కు శుభవార్త..కేటీఎమ్ 250 బైక్‌పై బంపర్ ఆఫర్.. భారీ డిస్కౌంట్..!:KTM 250 bike Video
Monkey Viral Video: బాబోయ్ కోతి..! నడిరోడ్డుపై కత్తి నూరుతోంది..!నవ్వులు పూయిస్తున్న వీడియో.