Viral: రైల్వేస్టేషన్‌లో తనిఖీలు.. టికెట్ లేకుండా దొరికిన ఇద్దరు వ్యక్తులు.. బ్యాగ్‌లు చెక్ చేయగా..
అది వారణాసి కంటోన్మెంట్ రైల్వే స్టేషన్. అప్పుడే ఓ రైలు ప్లాట్‌ఫార్మ్‌పైకి వస్తోంది. హోలీ పండుగ కావడంతో స్టేషన్‌లోని ఆర్పీఎఫ్ పోలీసులు..

అది వారణాసి కంటోన్మెంట్ రైల్వే స్టేషన్. అప్పుడే ఓ రైలు ప్లాట్‌ఫార్మ్‌పైకి వస్తోంది. హోలీ పండుగ కావడంతో స్టేషన్‌లోని ఆర్పీఎఫ్ పోలీసులు, టికెట్ కలెక్టర్లు సాధారణ తనిఖీలు చేపట్టారు. ట్రైన్ నుంచి దిగిన ప్రయాణీకులను ఒక్కొక్కరిగా తనిఖీలు చేస్తున్నారు. ఇంతలో వారికి క్యూలో నిలబడ్డ ఇద్దరు వ్యక్తులపై అనుమానమొచ్చింది. వారి కదలికలు కొంచెం డౌట్ కలిగించే విధంగా ఉండటంతో.. ఆ ఇద్దరినీ చెక్ చేశారు.. సదరు వ్యక్తులు టికెట్ లేకుండా దొరికారు. అంతేకాదు వారి బ్యాగ్‌లు చెక్ చేయడంతో పోలీసులకు ఒక్కసారిగా మైండ్ బ్లాంక్ అయింది. వాటిల్లో ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా.. అదేంటో తెలియాలంటే.. ఈ స్టోరీ చదవాల్సిందే..
వివరాల్లోకి వెళ్తే.. డబ్బును అక్రమంగా హవాలా చేస్తూ పోలీసులకు పట్టుబడ్డారు ఇద్దరు వ్యక్తులు. ఈ ఘటన వారణాసిలోని కంటోన్మెంట్ రైల్వేస్టేషన్‌లో చోటు చేసుకుంది. ధన్‌బాద్‌లోని శ్యామ్ ట్రేడర్స్ యజమాని ఆదేశాల మేరకు తాము వారణాసిలోని ఓ వ్యక్తి దగ్గర నుంచి డబ్బులు తీసుకునేందుకు వచ్చినట్లుగా ఆ ఇద్దరు పోలీసుల విచారణలో పేర్కొన్నారు. కాగా, నిందితుల వాంగ్మూలం మేరకు సదరు యజమానితో సంప్రదింపులు చేసేందుకు పోలీసులు ప్రయత్నించగా.. అతడు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే ఆ ఇద్దరికీ డబ్బులు అందజేసిన వ్యక్తి కోసం కూడా పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.




