హత్రాస్ ఘటనా స్థలానికి చేరుకున్న ‘సిట్’ టీమ్
హత్రాస్ లో జరిగిన దారుణానికి సాక్ష్యంగా నిలిచిన స్పాట్ కి 'సిట్' ప్రత్యేక బృందం మంగళవారం ఉదయం చేరుకుంది. యూపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ముగ్గురు సభ్యుల ఈ బృందంలో హోం కార్యదర్శి భగవాన్ స్వరూప్...
హత్రాస్ లో జరిగిన దారుణానికి సాక్ష్యంగా నిలిచిన స్పాట్ కి ‘సిట్’ ప్రత్యేక బృందం మంగళవారం ఉదయం చేరుకుంది. యూపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ముగ్గురు సభ్యుల ఈ బృందంలో హోం కార్యదర్శి భగవాన్ స్వరూప్, డీఐజీ చంద్రప్రకాష్, ఐపీఎస్ అధికారి పూనమ్ ఉన్నారు. ఈ బృందం క్రైమ్ స్పాట్ ని అధ్యయనం చేసి రేపు తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించనుంది. కాగా-ఈ ఘటనలో యువతిపై గ్యాంగ్ రేప్ జరగలేదని ఫోరెన్సిక్ రిపోర్టు వెల్లడించిన వైనం వివాదాస్పదమైంది. యువతిపై దాడి జరిగిన 11 రోజుల తరువాత శాంపిల్స్ సేకరించారని నిపుణులు చెబుతున్నారు.