మూడు పరోటాలు తింటే.. లక్ష ప్రైజ్‌మనీ! ఎక్కడో తెలుసా

50 నిమిషాల్లో 3 జంబో పరోటాలు తింటే.. లక్ష ప్రైజ్ మనీతోపాటు.. జీవితాంతం ఫుడ్ ఫ్రీ. ఈ హోటల్ ప్రారంభించినప్పటి నుంచి ఇద్దరు మాత్రమే ఈ పందెం నెగ్గినట్లు..

మూడు పరోటాలు తింటే.. లక్ష ప్రైజ్‌మనీ! ఎక్కడో తెలుసా
Follow us

| Edited By:

Updated on: Mar 01, 2020 | 7:50 PM

పరోటాలంటే మీకిష్టమా.. ఎన్ని పరోటాలైనా.. అమాంతం లాగించేగలరా? అయితే మీకో గుడ్ న్యూస్. కేవలం మూడు పరోటాలు తింటే.. లక్ష రూపాయల ప్రైజ్‌తో పాటు జీవితాంతం భోజనం ఫ్రీగా తినొచ్చు. అదెక్కడో మీకు తెలుసా!

‘భీమిలీ కబడ్డీ జట్టు’ సినిమాలోని ధన్‌రాజ్ పరోటా ఛాలెంజ్ మీకు గుర్తుందా.. సేమ్ అదే సీన్ ఇక్కడ రిపీట్ కాబోతుంది. హర్యానాలోని తపస్య హోటల్‌లో.. అతి పెద్ద పరోటాలకు పెట్టింది పేరు. జంబో పరోటాలు ఇక్కడే లభిస్తాయి. దీంతో ఆ హోటల్‌కి.. తినడానికి వచ్చేవారికి ఓ సవాల్ విసిరారు యజమాని. దాదాపు 50 నిమిషాల్లో 3 జంబో పరోటాలు తింటే.. లక్ష ప్రైజ్ మనీతోపాటు.. జీవితాంతం ఫుడ్ ఫ్రీ. ఈ హోటల్ ప్రారంభించినప్పటి నుంచి ఇద్దరు మాత్రమే ఈ పందెం నెగ్గినట్లు యజమాని పేర్కొన్నారు.

ఈ జంబో పరోటాలు రెండున్నర అడుగుల మేర.. మందంగా ఉంటాయి. ఇందులో రెండు కిలోల కుర్మా వేసి, స్వచ్ఛమైన నెయ్యితో కాల్చుతారు. ఇక్కడ ఒక మీడియం పరోటా ధర 90 రూపాయలు. ఇక జంబో పరోటా ఒకటి రూ.300ల పైన ఉంటాయి. ఈ జంబో ఒక్క పరోటాను ఐదుగురు తినవచ్చు. ఈ సందర్భంగా హోటల్ యజమాని మాట్లాడుతూ.. ఈ జంబో పరోటాలను తినడానికి చుట్టుపక్కల వారు మాత్రమే కాదు.. వేరే ప్రాంతాల నుంచి ఇక్కడికి వస్తారన్నారు.

Latest Articles
దంచికొట్టిన డుప్లెసిస్..RCB హ్యాట్రిక్ విక్టరీ..ప్లే ఆఫ్ రసవత్తరం
దంచికొట్టిన డుప్లెసిస్..RCB హ్యాట్రిక్ విక్టరీ..ప్లే ఆఫ్ రసవత్తరం
రేవన్న ఫ్యామిలీ విషయంలో వేణు స్వామిని ఏకిపారేస్తున్న నెటిజన్స్
రేవన్న ఫ్యామిలీ విషయంలో వేణు స్వామిని ఏకిపారేస్తున్న నెటిజన్స్
ఆంధ్రా స్టైల్‌లో పీతల పులుసు ఇలా చేశారంటే.. ఇంట్లో సువాసనలే..
ఆంధ్రా స్టైల్‌లో పీతల పులుసు ఇలా చేశారంటే.. ఇంట్లో సువాసనలే..
IPL యాడ్‌లో కల్కి.. దిమ్మతిరిగేలా చేస్తున్న ప్రభాస్‌ లుక్‌.!
IPL యాడ్‌లో కల్కి.. దిమ్మతిరిగేలా చేస్తున్న ప్రభాస్‌ లుక్‌.!
క్రేజీ అప్డేట్.. మరో బాహుబలి వస్తోంది.! అనౌన్స్ చేసిన జక్కన్న.
క్రేజీ అప్డేట్.. మరో బాహుబలి వస్తోంది.! అనౌన్స్ చేసిన జక్కన్న.
నేను టాలీవుడ్‌కు దూరమవ్వడానికి కారణం వాల్లే.. ఇలియానా.
నేను టాలీవుడ్‌కు దూరమవ్వడానికి కారణం వాల్లే.. ఇలియానా.
ఎన్నికల బరిలో దిగుతున్న విక్టరీ వెంకటేష్.!
ఎన్నికల బరిలో దిగుతున్న విక్టరీ వెంకటేష్.!
మీ కళ్లు కాంతివంతంగా ఉండాలంటే రోజూ ఒక పచ్చిమిర్చి తినండి..!
మీ కళ్లు కాంతివంతంగా ఉండాలంటే రోజూ ఒక పచ్చిమిర్చి తినండి..!
శంకర్ డైరెక్షన్లో బంగారం లాంటి హిట్టు మిస్‌ చేసుకున్న చిరు.!
శంకర్ డైరెక్షన్లో బంగారం లాంటి హిట్టు మిస్‌ చేసుకున్న చిరు.!
కేజీఎఫ్ ని ఫాలో అవుతున్న పుష్ప రాజ్‌.! ఇక అక్కడ కూడా..
కేజీఎఫ్ ని ఫాలో అవుతున్న పుష్ప రాజ్‌.! ఇక అక్కడ కూడా..