Sports Minister: అథ్లెట్ మహిళా కోచ్‌కు లైంగికవేధింపులు.. క్రీడా శాఖ మంత్రి సందీప్‌సింగ్ రాజీనామా..
హర్యానా క్రీడా మంత్రి సందీప్ సింగ్‌పై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. సందీప్ గతంలో భారత జాతీయ హాకీ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు.
అథ్లెటిక్స్ మహిళా కోచ్‌ను లైంగికంగా వేధించిన కేసులో హర్యానా క్రీడా శాఖ మంత్రి , భారత హాకీ జట్టు మాజీ కెప్టెన్ సందీప్‌సింగ్ అడ్డంగా బుక్కయ్యారు. తన నివాసంలో మహిళా కోచ్‌ను లైంగికంగా వేధించినట్టు ఆరోపణలు రావడంతో సందీప్‌సింగ్ తన పదవికి రాజీనామా చేశారు. అయితే తనపై కుట్ర చేశారని , ఎవరిని వేధించలేదని అంటున్నారు సందీప్‌సింగ్. అథ్లెటిక్స్ క్రీడాకారులు నల్లగా ఉంటారని , పిల్లలకు కోచింగ్ ఇచ్చి అందంగా ఉన్న నువ్వు ఎందుకు కష్టపడుతావని సందీప్‌సింగ్ అన్నాడని బాధితురాలు తెలిపారు. తాను చెప్పినట్టు నడుచుకుంటే ఎలాంటి ఇబ్బందులు ఉండవని వేధించినట్టు తెలిపారు.
అయితే మహిళా కోచ్ తనపై నిరాధార ఆరోపణలు చేశారని అంటున్నాడు సందీప్‌సింగ్ . నైతిక విలువలతో పదవికి రాజీనామా చేస్తునట్టు తెలిపారు. విచారణలో అన్ని విషయాలు వెలుగు లోకి వస్తాయన్నాడు.
విచారణ బృందం
భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్లు 354, 354A, 354B, 342, 506 కింద క్రీడా మంత్రిపై కేసు నమోదు చేశారు. గురువారం రాష్ట్ర జూనియర్ అథ్లెటిక్స్ కోచ్ క్రీడా మంత్రిపై ఆరోపణలు చేశారు. ఒక రోజు తర్వాత, అతనిపై ఫిర్యాదు కోసం పోలీసులను ఆశ్రయించారు. అయితే, మహిళా కోచ్ ఆరోపణలను క్రీడా మంత్రి సందీప్ సింగ్ పూర్తిగా తోసిపుచ్చారు. స్వతంత్ర విచారణకు డిమాండ్ చేశారు. అదే సమయంలో రాష్ట్ర ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ పీకే అగర్వాల్, రోహ్‌తక్ రేంజ్ అదనపు డైరెక్టర్ జనరల్ మమతా సింగ్ నేతృత్వంలో ఈ విషయంపై దర్యాప్తు చేయడానికి ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఇందులో పలువురు పోలీసు ఉన్నతాధికారులు పాల్గొంటున్నారు.
విషయం ఏంటంటే..
మరిన్ని జాతీయ వార్తల కోసం