AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: గోల్ వేసి హూప్ కు వేలాడిన ప్లేయర్.. కాసేపటికే షాకింగ్ ఇన్సిడెంట్!

ఈ మధ్య కాలంలో క్రీడలు ప్రాక్టీస్ చేస్తూ.. ప్రమాదవశాత్తు క్రీడాకారులు గాయాల పాలవడం, ప్రాణాలు కోల్పోయిన ఘటన చూస్తూ ఉన్నాం. తాజాగా అలాంటి ఘటనే హరియాణాలో వెలుగు చూసింది. గ్రౌండ్‌లో ప్రాక్టీస్ చేస్తుండగా.. ప్రమాదవశాత్తూ బాస్కెట్‌బాల్‌ హూప్‌ పోల్‌ మీద పడి ఓ జాతీయస్థాయి బాస్కెట్‌బాల్ క్రీడాకారుడు (16) ప్రాణాలు కోల్పోయాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

Watch Video: గోల్ వేసి హూప్ కు వేలాడిన ప్లేయర్.. కాసేపటికే షాకింగ్ ఇన్సిడెంట్!
Viral Video
Anand T
|

Updated on: Nov 26, 2025 | 1:24 PM

Share

గ్రౌండ్‌లో ప్రాక్టీస్ చేస్తుండగా.. ప్రమాదవశాత్తూ బాస్కెట్‌బాల్‌ హూప్‌ పోల్‌ మీద పడి ఓ జాతీయస్థాయి బాస్కెట్‌బాల్ క్రీడాకారుడు ప్రాణాలు కోల్పోయిన ఘటన హరియాణాలోని రోహ్‌తక్‌లో చోటుచేసుకుంది. ప్రమాదం జరిగిన వెంటనే కోర్టులో ఉన్న ఇతర క్రీడాకరులు అతన్ను వెంటనే హాస్పిటల్‌కు తరలించారు.. కానీ చికిత్స పొందుతూ అతను ప్రాణాలు కోల్పోయాడు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానిరి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్ట్‌మార్టం నిమిత్తం తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రోహ్‌తక్‌కు చెందిన లఖన్ అనే జాతీయస్థాయి బాస్కెట్‌బాల్ క్రీడాకారుడు తన గ్రామంలోని స్పోర్ట్స్ గ్రౌండ్‌లో ఫ్రెండ్స్‌తో కలిసి బాస్కెట్‌బాల్ ప్రాక్టీస్‌ చేస్తున్నాడు. ఈ క్రమంలో బంతిని గోల్‌ వేసి.. బాస్కెట్‌బాల్ హూప్‌ను పట్టుకొని వేలాడాడు.. దీంతో ఒక్కసారిగా పోల్‌ విరిగి లఖన్ పై పడిపోయింది. అతను తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాదం జరిగిన వెంటనే గ్రౌండ్‌లో ఉన్న తోటి క్రీడాకారులు లఖన్‌ను వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ లఖన్ మృతి చెందాడు.

స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్ట్‌మార్టం నిమిత్తం తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డైన ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైలర్‌గా మారాయి. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.

వీడియో చూడండి..

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us