Hardik Patel Resigns: గుజరాత్ ఎన్నికల ముందు కాంగ్రెస్‌కు షాక్.. పార్టీకి రాజీనామా చేసిన హార్దిక్ పటేల్..

అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో గుజరాత్ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. రోజురోజుకూ సమీకరణాలు మారుతున్నాయి...

Hardik Patel Resigns: గుజరాత్ ఎన్నికల ముందు కాంగ్రెస్‌కు షాక్.. పార్టీకి రాజీనామా చేసిన హార్దిక్ పటేల్..
Hardik Patel
Follow us
Ravi Kiran

|

Updated on: May 18, 2022 | 12:26 PM

అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో గుజరాత్ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. రోజురోజుకూ సమీకరణాలు మారుతున్నాయి. ఇదిలా ఉంటే.. తాజాగా ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి గట్టి షాక్ తగిలింది. గుజరాత్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ హార్దిక్ పటేల్.. పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి, పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ వేదికగా ఓ లేఖను పోస్ట్ చేశారు.

“నేను కాంగ్రెస్ పార్టీకి, పదవికి రాజీనామా చేసేందుకు ధైర్యాన్ని కూడగట్టుకుంటున్నాను. నా నిర్ణయాన్ని నా సహచరులు, గుజరాత్ ప్రజలు స్వాగతిస్తారని నమ్ముతున్నాను. ఈ నిర్ణయంతో నేను గుజరాత్ రాష్ట్రం కోసం మున్ముందు ఇంకా సానుకూలంగా పని చేయగలని ఆశిస్తున్నాను” అని హార్దిక్ పటేల్ లేఖలో పేర్కొన్నారు.

“గుజరాత్ కాంగ్రెస్ నాయకులు పార్టీని ఎలా నిర్వీర్యం చేశారో, ప్రజా ప్రాముఖ్యత ఉన్న అనేక సమస్యలను వ్యక్తిగత ఆర్థిక ప్రయోజనాల కోసం ఎలా నీరుగార్చారో మీకు బాగా తెలుసు. రాజకీయ ఆలోచనలు భిన్నంగా ఉండవచ్చు కానీ మన నాయకులు ఈ రకంగా అమ్ముడుపోవడం గుజరాత్ ప్రజలకు చేసే ద్రోహమే. గుజరాత్‌లోని దాదాపు ప్రతి ఒక్కరికీ దీని గురించి తెలుసు. కాబట్టి నేను కూడా దీనికి విచారం వ్యక్తం చేస్తున్నానని” హార్దిక్ పటేల్.. పార్టీ పరిస్థితిని కాంగ్రెస్ అధినేత్రి రాహుల్ గాంధీకి వివరిస్తూ లేఖలో పేర్కొన్నారు.