Hair Growth Oil: చెట్టుకు డబ్బులు కాయవు కానీ.. బట్టతలకు కాస్తాయి..!

ఈ నునె వాడితే మీ జట్టు గుబురుగా నిండుగా పెరుగుతుందని ప్రజలకు ముగ్గురు కేటుగాళ్లు టోపీ పెట్టారు. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లో జరిగింది. వారిని ఉత్తర్‌ప్రదేశ్‌లోని మేరఠ్‌లో పోలీసులు అరెస్టు చేశారు. అయితే పోలీసులు విచారణలో విస్తుపోయే నిజాలు బయటకు వచ్చాయి.

Hair Growth Oil: చెట్టుకు డబ్బులు కాయవు కానీ.. బట్టతలకు కాస్తాయి..!
Hair Growth Oil Arrested For Fraud In Up's Meerut
Follow us
Velpula Bharath Rao

|

Updated on: Dec 20, 2024 | 8:37 AM

జుట్టు పెరగడానికి ఓ మంచి నూనెను ఇస్తామని అది వాడితే జట్టు పెరుగుతుందని ప్రజలను మభ్యపెడుతున్న కొందరు మోసగాళ్లను ఉత్తర్‌ప్రదేశ్‌లోని మేరఠ్‌లో పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ బట్టతల వ్యక్తి, ఇద్దరు సహాయకులు ఉత్తర్‌ప్రదేశ్‌లోని మేరఠ్‌లో పోలీసులు అరెస్ట్ చేశారు. బాధితుల్లో ఒకరు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చినట్లు పోలీసులు చెబుతున్నారు. పోలీసులు ఈ పెద్ద కుంభకోణాన్ని బయటపెట్టారు.

ప్రహ్లాద్ నగర్‌లో హెయిర్ గ్రోత్ ఆయిల్ విక్రయిస్తున్న కొందరిపై లిసారి గేట్ ప్రాంతానికి చెందిన షాదాబ్ ఫిర్యాదు చేసినట్లు పోలీసు సూపరింటెండెంట్ (సిటీ) ఆయుష్ విక్రమ్ సింగ్ తెలిపారు. వాళ్లు ఇచ్చిన ఆయిల్ వాడడం వల్ల తన నెత్తిమీద దురద, అలెర్జీ వంటి సమస్యలు వచ్చాయిని అతను పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనకు పాల్పడిన ఇమ్రాన్, సల్మాన్, సమీర్ అనే ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సంబంధిత సెక్షన్ల కింద చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆ ముగ్గురు కొన్ని రోజుల క్రితం లిసారి గేట్-సమర్ కాలనీ ప్రాంతంలో క్యాంపును ఏర్పాటు చేసి బట్టతలపై వెంట్రుకలు తిరిగి పెరుగుతాయని  ప్రచారం చేశారు. ఇది చూసి కొందరు వెంట్రుకలు నిజంగానే పెరుగుతాయని నమ్మిన జనం శిబిరం వద్ద క్యూ కట్టారు. దీంతో వీధుల్లో ట్రాఫిక్ జామ్‌ అయింది. ఆ ఆయిల్ తీసుకున్నవారు అలెర్జీ సమస్యలు ఎదుర్కొన్నారు. అయితే ఆ బాధితుల్లో ఓ వ్యక్తి పోలీసులను ఆశ్రయించాడు.

విచారణలో నిందితులు పలు నగరాల్లో ఇలాంటి మోసపూరిత శిబిరాలు నిర్వహించినట్లు వారు ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఆ మోసగాళ్లు ఆయిల్ కోసం రూ. 20 నుంచి రూ. 300 ప్రవేశ రుసుము వసూలు చేసినట్లు వారు వెల్లడించారు. ఈ బృందం మీరట్, ఢిల్లీ, హర్యానా, ఉత్తరాఖండ్ అంతటా ప్రజలను మోసగించినట్లు దర్యాప్తులో తేలిందని, ఈ ప్రక్రియలో లక్షల రూపాయలను దండుకున్నారని చెప్పారు. వారిపై తగిన చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి