Fire Accident: హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.. ఐదుగురు దుర్మరణం.. 24 మందికి తీవ్రగాయాలు..
జైపూర్‌లో విషాదం చోటుచేసుకుంది.. అజ్మీర్ రోడ్డులోని పెట్రోల్ పంప్ దగ్గర LPG, CNG ట్రక్కులు ఢీకొన్నాయి.. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందారు.. 24 మందికి గాయాలయ్యాయి.. 40 వాహనాలకు మంటలు అంటుకుని దగ్దమైనట్లు పోలీసులు తెలిపారు.. సమాచారం అందుకన్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.. రద్దీగా ఉండే అజ్మీర్ రోడ్డులో ఎల్‌పీజీ(LPG), సీఎన్‌జీ (CNG) ట్యాంకర్లు ఢీకొన్నాయి.. దీంతో ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించి.. మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు మరణించారు.. చాలా మందికి గాయాలయ్యాయి.. పదుల సంఖ్యలో వాహనాలు దగ్దమయ్యాయి.. శుక్రవారం (డిసెంబరు 20) ఉదయం రాజస్థాన్‌లోని జైపూర్‌లోని అజ్మీర్ రోడ్ పెట్రోల్ పంపు సమీపంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది..
సమాచారం అందుకన్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఎల్‌పిజి (లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్), సిఎన్‌జి (కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్) ట్రక్కులు రెండూ ఢీకొన్నాయని, ఆ తర్వాత భారీ పేలుడు సంభవించిందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో ఐదుగురు మరణించారని.. 20 మందికి పైగా గాయపడ్డారని పోలీసులు తెలిపారు..
వీడియో చూడండి..
#WATCH | Jaipur, Rajasthan | 4 dead and several injured in a major accident and fire incident in the Bhankrota area.
A fire broke out due to the collision of many vehicles one after the other. Efforts are being made to douse the fire. pic.twitter.com/3WHwok5u8W
— ANI (@ANI) December 20, 2024
సమాచారం ప్రకారం, ఢీకొన్న అనంతరం ట్యాంకర్ వాహనాలపైకి దూసుకెళ్లిందని.. దీంతో అనేక వాహనాలు మంటల్లో చిక్కుకున్నాయని పోలీసులు తెలిపారు. పోలీసులు, అధికారులు మంటలను అదుపు చేసేందుకు శ్రమిస్తున్నారు.
జైపూర్-అజ్మీర్ హైవే ప్రమాదంలో 23 నుంచి 24 మందికి తీవ్ర కాలిన గాయాలైనట్లు సమాచారం. వారిని చికిత్స నిమిత్తం సవాయ్ మాన్ సింగ్ ఆసుపత్రికి తరలించారు. దాదాపు 40 వాహనాలకు మంటలు అంటుకున్నాయని జైపూర్ డీఎం జితేంద్ర సోనీ తెలిపారు.
VIDEO | Rajasthan: A truck, carrying chemical, collided with other trucks and caught fire on the Jaipur-Ajmer highway earlier today. Fire brigade carry out cooling operation at the accident site.#JaipurNews #RajasthanNews
(Full video available on PTI Videos -… pic.twitter.com/zy8BaY6uaG
— Press Trust of India (@PTI_News) December 20, 2024
అగ్నిమాపక దళం, అంబులెన్స్‌లు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మంటలు అదుపులోకి వచ్చాయని.. ఈ సంఘటనలో సుమారు 23-24 మంది గాయపడ్డారని జైపూర్ DM చెప్పారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..